‘ఆదికేశవ’ రివ్యూ.! పంజా వైష్ణవ్ తేజ్ మెరిశాడుగానీ.!

 ‘ఆదికేశవ’ రివ్యూ.! పంజా వైష్ణవ్ తేజ్ మెరిశాడుగానీ.!

Aadikeshava Review

Aadikeshava Review.. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ‘ఉప్పెన’తో మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ, ఆ తర్వాతి సినిమాల విషయంలో తడబడుతున్నాడు.

తాజాగా, పంజా వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఆదికేశవ’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫక్తు కమర్షియల్ మూవీ ఇది.! శ్రీలీల గ్లామరు, ఫ్యాక్షన్ నేటివిటీ.. ఇవన్నీ ఒకింత ‘పాత ముతక’ వాసనలే అనిపించాయి.. అదీ సినిమా రిలీజ్‌కి ముందే.

పైగా, సినిమా రిలీజ్ విషయమై ఒకింత గందరగోళం ఏర్పడింది. ముందుకీ, వెనక్కీ.. ఇలా గందరగోళం నడుమ, ఎలాగైతేనేం, సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది.

Aadikeshava Review.. పాత చింతకాయ్ ఫ్యాక్షన్..

సరదాగా తిరిగేసే కుర్రాడికి, తన కుటుంబం అసలైన కుటుంబం కాదని తెలుస్తుంది. అసలు కుటుంబం కోసం వెళితే, అక్కడ ఫ్యాక్షన్ పంచాయితీ. ఇదీ సినిమా కథ.

బోల్డన్ని సినిమాల్లో చూసేశాం కదా, ఈ తరహా కంటెంట్. ఇందులో దర్శకుడు కొత్తగా చూపించిందేమీ లేదు.

మలయాళ నటుడు జోజు జార్జ్ ఈ సినిమాలో విలన్‌గా నటించడమొక్కటే కొత్తదనం అనుకోవాలేమో.! వైష్ణవ్ తేజ్ వరకూ ఇదో డిఫరెంట్ ఫిలిం.

నటన పరంగా ఇంకా మెరుగుపరచుకోవాల్సి వుంది. డాన్సుల్లో రాణించాడు, సినిమా సినిమాకీ నటనలోనూ ఇంప్రూవ్ అవుతున్నాడు. కానీ, అది సరిపోదు.

Aadikeshava Panja Vaishnav Tej Sreeleela
Aadikeshava Panja Vaishnav Tej Sreeleela

దర్శకుడు ఫక్తు మాస్ కమర్షియల్ సినిమా తీసే ప్రయత్నంలో, రొట్ట కొట్టుడు వ్యవహారమే నడిపాడు. మ్యూజిక్ జస్ట్ మమ అనిపించినట్లుంటుంది.

ఎడిటింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.! డైలాగ్స్ గురించీ గొప్పగా మాట్లాడుకోవడానికేమీ లేదు. యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం, బాగానే డిజైన్ చేశారు.

‘ఉప్పెన’, ‘కొండపొలం’, ‘రంగ రంగ వైభవంగా’.. ఇలా దేనికదే భిన్నమైన సినిమాలు. ఆ లిస్టులో ‘ఆదికేశవ’ కూడా భిన్నమైనదే వైష్ణవ్ తేజ్‌కి.

Also Read: స్నాక్స్ అండ్ గా‘చిప్స్’.! ఇక మొదలెడదామా.?

కానీ, కమర్షియల్ హిట్టు లెక్కల్లో చూస్తే మాత్రం, వైష్ణవ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ నిరాశ చెందుతున్నాడు. ‘ఉప్పెన’ స్థాయి విజయం మళ్ళీ ఎప్పుడు చూస్తాడో ఏమో.!

ప్రయత్న లోపం అనలేంగానీ, టైమ్ కలిసిరావడంలేదంతే. యంగ్ హీరోల నుంచి ఆడియన్స్ కొత్తదనం ఆశిస్తున్నారు. అదే సమయంలో, రొట్టకొట్టుడు సినిమాలూ ఒక్కోసారి యూత్‌కి కనెక్ట్ అయిపోతున్నాడు.

అలా చూస్తే, పంజా వైష్ణవ్ తేజ్‌ది బ్యాడ్ లక్ అనుకోవాలేమో.!

Digiqole Ad

Related post