ఛాతిలో మంట, గుండె పోటుకు సంకేతమా.?

 ఛాతిలో మంట, గుండె పోటుకు సంకేతమా.?

Acidity Heart Burn

Acidity Heart Burn.. ఎసిడిటీ, ఛాతి మంట.. గుండె పోటుకు సంకేతమా.? అంటే, అన్ని సందర్భాల్లోనూ కాదని అంటున్నారు నిపుణులు. తీసుకున్న ఆహారం డైజెస్ట్ కాకుంటే, ఛాతిలో మంటగా అనిపిస్తుంది.

దాన్నే ‘ఎసిడిటీ (గ్యాస్ నొప్పి)’ అంటుంటాం. ఇన్‌స్టెంట్‌గా ఎసిడిటీ తగ్గేందుకు ‘ఈనో’ వంటి మందులు మార్కెట్లో అందుబాటులో వున్నాయ్.

అలాగే, సహజ సిద్ధంగా అల్లం, వాము, జీలకర్ర వంటి వంటింటి చిట్కాలను కూడా చకచకా వాడేస్తుంటారు కొందరు. అయితే, అన్నిరకాల ఛాతి మంటలూ ఎసిడిటీనేనా.?

కొన్ని సందర్భాల్లో ఎసిడిటి లేదా ఛాతి మంటనే గుండె పోటుగా పరిగణిస్తూ భయపడుతుంటారు కొందరు. మరి ఛాతీలో మంటకీ గుండె పోటుకీ తేడా ఏంటీ.?

Acidity Heart Burn.. అసలు ఛాతిలో మంటలు ఎందుకొస్తాయ్.?

కడుపులోని యాసిడ్స్ ఊపిరితిత్తుల్లోకి చేరినప్పుడు ఛాతిలో మంట వస్తుంది. కానీ అది గుండె పోటు కాదని వైద్యులు చెబుతుంటారు

అలా తయారైన ఈ యాసిడ్స్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం వల్ల న్యుమోనియా, శ్వాస లోపం, ఆస్తమా వంటి సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.

అంతేకాదు, గొంతు నొప్పి, వాపు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయ్. ఇలాంటి ఛాతీ నొప్పికి కంగారు పడవల్సిన పనిలేదు. ఇది కేవలం గ్యాస్ నొప్పి మాత్రమే.! అని వైద్యులు చెబుతున్నారు.

అలాగే హెర్నియాతో బాధపడేవారు కూడా అప్పుడప్పుడూ ఛాతిలో మంటతో ఇబ్బందిపడుతుంటారు. కాసేపటికి ఆ నొప్పి నుంచి ఉపశమనం పొందుతుంటారు.

పేగు క్యాన్సర్ వున్నవారు కూడా తరచూ ఛాతీ మంటతో బాధపడుతుంటారు. పేగు క్యాన్సర్ వున్నవాళ్లలో ఆహారం తీసుకున్నప్పుడల్లా అన్నవాహికపై ఎక్కువ ప్రెజర్ కలుగుతుంది

అందుకే కడుపులోకి ఆహారం వెళ్లినప్పుడల్లా ఛాతీలో మంటలు మొదలవుతాయ్. ఇది కూడా గుండె పోటుకు సంకేతం కాదని నిపుణులు చెబుతున్నారు.

గుండె నొప్పికీ, ఛాతీలో మంట లేదా గ్యాస్ నొప్పికీ తేడా ఏంటీ.?

అయితే, అన్ని సందర్భాల్లోనూ వచ్చే ఛాతీ మంటను అశ్రద్ధ చేయకూడదు. కొన్ని సమయాల్లో గుండె పోటు కూడా ఛాతీలో మంటతోనే మొదలవుతుంది.

అయితే, అదే సమయంలో గుండె వేగంగా కొట్టుకోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, అదే సమయంలో మళ్లీ శరీరమంతా చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయ్.

అలాగే, చర్మం బిగుసుకుపోయినట్లు అనిపించడం తదితర లక్షణాలు కనిపిస్తాయ్. ఇలాంటి సమయంలో గుండె అంతా పట్టేసినట్లుండడం, ఛాతి భాగంలో మంటగా అనిపిస్తుంటుంది.

Also Read: ఎందుకొచ్చిన ఎగ్జిట్ పోల్.? ఎవర్ని ఏమార్చడానికి.?

ఈ రకమైన ఛాతి నొప్పిని అస్సలు అశ్రద్ధ చేయరాదు. ఆలస్యం చేయకుండా వైద్యుని సంప్రదించాలి. ఏ చిన్న అసౌకర్యం ఛాతిలో కలిగినా, వీలైనంత తక్కువ సమయంలో వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి.

గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్‌లో అందుబాటులో వున్న సమాచారం ప్రకారం, కొందరు వైద్య నిపుణులు అందించిన సమాచారం ప్రకారం సేకరించబడింది.

ఏ నొప్పి అయినా కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే భరించాలి. అంతకన్నా ఎక్కువ సమయం తీవ్రమైన నొప్పి వేధిస్తే, అశ్రద్ద చేయకుండా వైద్యుని సంప్రదించాలి. తగు చికిత్స తీసుకోవాలి.

Digiqole Ad

Related post