ప్రగతి రెండో పెళ్ళి.! పుకారు పుట్టించిందెవరు.?

 ప్రగతి రెండో పెళ్ళి.! పుకారు పుట్టించిందెవరు.?

Pragathi Actress

Actress Pragathi Second Marriage.. సీనియర్ నటి ప్రగతి రెండో పెళ్ళి చేసుకోబోతోందట.! అదీ ఓ ప్రముఖ నిర్మాతతో కొన్నాళ్ళుగా సాగిస్తోన్న ప్రేమ వ్యవహారానికి కొనసాగింపుగా పెళ్ళి అంట.!

ఈ విషయమై మీడియాలో రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి రావడంతో, ప్రగతి ఎట్టకేలకు స్పందించక తప్పలేదు.!

యూ ట్యూబ్ థంబ్‌నెయిల్స్, వెబ్ మీడియాలో వెకిలి రాతలు.. ఇవేం కొత్త కాదు సెలబ్రిటీల మీద.!

కాకపోతే, మెయిన్‌స్ట్రీమ్ మీడియా కూడా దిగజారిపోయింది.! వాస్తవానికి, మెయిన్ స్ట్రీమ్ మీడియాకి సెలబ్రిటీలు అందుబాటులోనే వుంటారు.

Actress Pragathi Second Marriage.. పుకార్లకు క్రాస్ చెక్ అవసరంలేదా.?

ఏదన్నా పుకారు గనుక సెలబ్రిటీలకు సంబంధించి వస్తే, ఆ వెంటనే ‘క్రాస్ చెక్’ అనేది వుంటుంది. కానీ, ప్రగతి విషయంలో అలా జరగలేదు. ఆ మాటకొస్తే, ఇలాంటి గాసిప్స్ విషయంలో క్రాస్ చెక్ అనేదాన్ని మీడియా మర్చిపోయింది.!

గత కొంతకాలంగా ప్రగతిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వెకిలి పోస్టుల్ని చూస్తున్నాం. ప్రగతి మాత్రమే కాదు, ఈ లిస్టులో మరో సీనియర్ నటి సురేఖా వాణి కూడా బాధితురాలే.!

Pragathi Actress
Pragathi Actress

ఈ తరహా పుకార్లు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కనిపిస్తున్నాయంటే, ఇందులో ‘బ్లాక్‌మెయిల్’ వ్యవహారమే ఎక్కువగా కనిపిస్తుంటుంది.

నటి ప్రగతి (Pragathi Mahavadi) గట్టిగానే కౌంటర్ ఎటాక్ ఇచ్చేసింది.! నిజం చెప్పాలంటే, పెంటలో ముంచిన చెప్పుతో కొట్టిందామె.!

ఎవరిదీ పాత్రికేయ వ్యభిచారం.?

ఓ వెబ్ మీడియా జర్నలిస్టు, ఈ పుకారుని సృష్టించి, తమకు అనుబంధంగా వున్న మెయిన్ స్ట్రీమ్ మీడియాకి అందించాడన్నది సినీ మీడియా వర్గాల్లో సర్క్యులేట్ అవుతున్న విషయం.

Also Read: మేఘా.! అదృష్టం ‘ఆకాశ’మంత.! సక్సెస్సో మరి.!

ఎవరా వికృత ఎర్నలిస్ట్.? ఎవరిది ఈ పాత్రికేయ వ్యభిచారం.! ఒక్కటి మాత్రం నిజం.. సెలబ్రిటీలనే కాదు, ఎవరికైనా.. పెళ్ళి అనేది వారి వ్యక్తిగత విషయం.

అది ఒక్కసారా.? రెండు సార్లా.? మూడు సార్లా.? అన్నది వారి వారి వ్యక్తిగత జీవితంలో ఎదురైన పరిస్థితుల్ని బట్టి వారు తీసుకునే నిర్ణయం. వార్తకీ, పుకార్లకీ తేడా తెలియని స్థాయికి జర్నలిజం దిగజారిపోవడం అత్యంత హేయం.!

Digiqole Ad

Related post