మళ్ళీ అదే తప్పు చేస్తున్న అక్కినేని అఖిల్

Akhil Akkineni
Akkineni Akhil Wrong Step.. నేను పదో తరగతిలో వున్నప్పుడు ఫలానా హీరో సినిమాలు రెండో మూడో చూశాను.. అని చెప్పుకునే రోజులు వేరు.
కానీ, ఇప్పుడలా కాదు. డిగ్రీ (మూడేళ్ళు) చదువున్న సమయంలో ఆ హీరో సినిమా ఒక్కటే చూశానని చెప్పుకోవాల్సి వస్తోంది. తప్పెవరిది.?
సాధారణ డిగ్రీ కాదు, ఇంజనీరింగ్, మెడిసిన్.. అంటే, నాలుగైదేళ్ళు పడుతోంది ఓ హీరో ఓ సినిమా చేయడానికి.! ఇలాగైతే ఎలా.?
Akkineni Akhil Wrong Step.. అక్కినేని వారసుడికి ఎందుకీ దుస్థితి.?
చేసిన సినిమాల్లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఒక్కటీ కాస్త ఫర్వాలేదనిపించిందంతే అక్కినేని వారసుడు అఖిల్‌కి.
అప్పుడెప్పుడో నెలల వయసున్నప్పుడు చేసిన ‘సిసింద్రీ’ సినిమా సెన్సేషనల్ హిట్. మళ్ళీ సంచలన విజయాన్ని అందుకోవడానికి అఖిల్‌కి ఎన్నేళ్ళు పడుతుందో ఏమో.!
అసలంటూ సినిమాలు చేస్తే కదా.? చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతోంటే.. చేస్తున్న సినిమాలూ ఆలస్యమవుతోంటే.. అభిమానులు, తమ అభిమాన హీరోల్ని మర్చిపోయే పరిస్థితి వస్తుంది.
ఏజెంట్ ఏమయ్యింది చెప్మా.?
అఖిల్ నటించిన ‘ఏజెంట్’ చాలా పెద్ద డిజాస్టర్. ఆ సినిమా ఇప్పటికీ ఓటీటీ మీదకి రావడంలేదు. ఈ ట్రాక్ రికార్డ్ బహుశా తెలుగులో ఏ హీరోకీ లేదేమో. నిజానికి, ఇదో చెత్త రికార్డ్.
హిట్టు.. ఫ్లాపు.. అన్నవి సినీ రంగంలో మామూలే. హిట్టు నుంచి జాగ్రత్త పడాలి.. ఫ్లాపొచ్చినప్పుడు ఆత్మవిమర్శ చేసుకుని, ముందడుగు వేయాలి.

అన్నట్టు, అఖిల్ కొత్త సినిమాకి రంగం సిద్ధమయ్యిందట. పీరియాడిక్ మూవీ అట. దానికోసమే జుట్టు బాగా పెంచేసి, శరీరాన్ని కష్టపెట్టేసి.. ఏవేవో చేసేస్తున్నాడట అఖిల్.
భారీ బడ్జెట్ సినిమా అంటున్నారు.. అంటే, ఓ రెండు మూడేళ్ళు.. ఆ పైనే, సినిమా నిర్మాణానికి సమయం పడుతుందేమోనన్న అనుమానాలు అక్కినేని అభిమానుల గుండెళ్ళో రైళ్ళు పరిగెత్తేలా చేస్తున్నాయ్.
వేగం ముఖ్యం..
అవన్నీ తర్వాత.. ముందైతే, వేగంగా సినిమాలు చేయాలి. అఖిల్ అనే కాదు, టాలీవుడ్ స్టార్ హీరోలు వేగంగా సినిమాలు చేయడం మీద ఫోకస్ పెడితే మంచిది.
Also Read: కేకులు, సోకులు.! అస్సలు చూడకు దిక్కులు.!
ఒకటి తన్నేసినా, ఇంకోటి సక్సెస్ అవ్వొచ్చు. ఏళ్ళ తరబడి నాన్చి, చివరికి ఉస్సూరు మనిపిస్తే.. దశాబ్ద కాలానికి ఒక్క సినిమా మాత్రమే.. అన్న పరిస్థితికి వచ్చేయొచ్చు.
