Ala Vaikunthapurramuloo FDFS

‘అల వైకుంఠపురములో’ ఫస్ట్‌ రిపోర్ట్.. బన్నీ కుమ్మేశాడు.!

428 0

షెడ్యూల్‌ కంటే కాస్త ముందే ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo FDFS) ఫస్ట్‌ టాక్‌ బయటకు వచ్చేసింది.

యూఎస్‌ ప్రీమియర్స్‌ నుంచి అందుతున్న రిపోర్ట్స్‌ ప్రకారం అల్లు అర్జున్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ అయ్యే లక్షణాలు ‘అల వైకుంఠపురములో’ సినిమాలో వున్నాయట.

స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ అల్లు అర్జున్‌ (Stylish Star Allu Arjun) మార్క్‌ స్టైలిష్‌ క్లాస్‌ మిక్స్‌డ్‌ మాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram Srinivas) మార్క్‌ టేకింగ్‌తో సినిమా అదిరిపోయిందని అంటున్నారు.

Also Read: ప్రివ్యూ: అల వైకుంఠపురములో.. స్టైలిష్‌ విన్నర్‌

డాన్సుల్లో అల్లు అర్జున్‌ గురించి కొత్తగా చెప్పేదేముంది.? అనుకోవడానికి వీల్లేదట. ఇంకా ఇంకా కొత్తగా చెప్పుకునేలా డాన్సులు అదరగొట్టేశాడట. అఫ్‌కోస్స్‌ సాంగ్‌ ప్రోమోస్‌తోనే ఆ విషయం అర్థమయిపోయిందనుకోండి.. అది వేరే సంగతి.

ఇక, ‘అల వైకుంఠపురములో’ సినిమాలో లీడ్ పెయిర్ అయిన అల్లు అర్జున్‌ – పూజా హెగ్దే (Allu Arjun Pooja Hegde) మధ్య ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అయ్యిందని తెలుస్తోంది.

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా తమన్‌ అదరగొట్టేశాడట. ఈ సంక్రాంతికి పెర్‌ఫెక్ట్‌ ఎంటర్‌టైనర్‌.. అంటూ సినిమా చూసినోళ్ళు తేల్చి చెబుతున్నారు. మరోపక్క, ఓవర్సీస్‌లో ‘అల వైకుంఠపురములో’ సరికొత్త సంచలనాలకు తెరలేపనుందట.

అక్కడ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సినిమాలకీ, అల్లు అర్జున్‌ సినిమాలకీ వున్న మార్కెట్‌ గురించి అందరికీ తెల్సిందే. అన్నట్టు, కేరళలో తొలిసారిగా ఓ డబ్బింగ్‌ సినిమాకి ప్రీమియర్‌ షోలు, బెనిఫిట్‌ షోలు వేస్తుండడం గమనార్హం. అక్కడ అల్లు అర్జున్‌కి వున్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ అలాంటిది మరి.

Also Read: స్టైలిష్‌గా ‘అల..’.. అదరగొట్టేస్తోందిలా.!

ఓవరాల్‌గా ‘బొమ్మ బ్లాక్‌ బస్టర్‌’ అనే టాక్‌ అయితే బయటకొచ్చేసిందన్నమాట. ఇక, అల్లు అర్జున్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఎక్కడా నెగెటివిటీ స్ప్రెడ్‌ కాకుండా చూసుకుంటున్నారు.

అయితే, కొందరి అత్యుత్సాహం కారణంగా ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo FDFS) సినిమాకి సంబంధించి సీన్స్‌ వీడియో బైట్స్‌ రూపంలో బయటకు వచ్చేస్తున్నాయి.

Related Post

Vijay Deverakonda

‘నోటా’తో మళ్ళీ రికార్డుల వేట

Posted by - September 26, 2018 0
విజయ్‌ దేవరకొండ.. (Vijay Devarakonda) తెలుగు సినిమాకి సంబంధించి నయా సూపర్‌ స్టార్‌గా ఈ యంగ్‌ హీరోని అభివర్ణించడం అతిశయోక్తి కాదు. కొడితే బాక్సాఫీస్ బద్దలైపోవాలనేంత కసి,…

కాజల్‌ అగర్వాల్‌ సమ్‌థింగ్‌ స్పెషల్‌.!

Posted by - June 19, 2019 0
కాజల్‌ అగర్వాల్‌ (Kajal Agarwal).. పరిచయం అక్కర్లేని పేరిది. తెలుగు ప్రేక్షకులు అందాల చందమామగా (Kajal Aggarwal movies) పిలుచుకుంటారు. ‘మిత్రవింద’ (Kajal Aggarwal movies) గా…

‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్‌ టాక్‌ ‘దద్దరిల్లిపోయింది’

Posted by - January 11, 2020 0
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తాజా సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్‌ టాక్‌ (Sarileru Neekevvaru Review FDFS) ‘దద్దరిల్లిపోయింది’. అవును, అందరి నోటా ఒకటే మాట.. సినిమా…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *