బిగ్‌ ట్విస్ట్‌: మట్టి కరిచిన అలీ రెజా ‘అతి’!

103 0

టిక్కెట్‌ టు ఫినాలే రేసులోకి చాలా వేగంగా దూసుకెళ్ళాడు అలీ రెజా (Ali Reza Battery Discharged). ఎంత వేగంగా దూసుకెళ్లాడో, అంతే వేగంగా కిందకి పడిపోయాడు. అంతా స్వయంకృతాపరాధమే.

టాస్క్‌ల్లో బెస్ట్‌ పెర్ఫామర్‌ అన్పించుకోవడానికి అలీ రెజా ప్రదర్శించే ‘అతి’ అతనికి శాపమయిపోయిందిప్పుడు. బాబా భాస్కర్‌తో మడ్‌ పిట్‌లో అలీ రెజా తలపడాల్సి వచ్చింది. అప్పటికి అలీ రెజా చాలా సేఫ్‌ పొజిషన్‌లో వున్నాడు. అలీ రెజాకి దరిదాపుల్లో కూడా ఇంకెవరూ లేరు.

ఇది టిక్కెట్‌ టు ఫినాలే రేస్‌కి సంబంధించిన టాస్క్‌. సైలెంట్‌గా వుండాల్సిన అలీ రెజా, వైలెంట్‌ అయిపోయాడు. బాబా భాస్కర్‌ని తోసి పారేశాడు. రెజ్లింగ్‌ పోటీలు, బాక్సింగ్‌ పోటీల తరహాలో తన కండ బలం చూపించేయాలనుకున్నాడు అలీ రెజా.

ఇదంతా చూస్తోన్న ఇతర హౌస్‌మేట్స్‌కే కాదు, బిగ్‌బాస్‌ వ్యూయర్స్‌కి కూడా గగుర్పాటు కలిగింది అలీ రెజా ఓవరాక్షన్‌. బాబా భాస్కర్‌ కాబట్టి, అంత జరిగినా తట్టుకున్నాడు. అదే వరుణ్‌ లేదా రాహుల్‌ సిప్లిగంజ్‌ అయితే.. పెద్ద కొట్లాటే జరిగిపోయేది.

అలీ రెజా అతి కారణంగా ఓసారి వార్నింగ్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌, ఆ తర్వాత కూడా అలీ రెజా తీరు మారకపోవడంతో టాస్క్‌ రద్దు చేశాడు. అంతే కాదు, అలీ రెజాని డిస్‌క్వాలిఫై కూడా చేసేశాడు.

ఇంకోసారి ఇలాంటి ఓవరాక్షన్‌ చేస్తే, డైరెక్ట్‌గా ఎవిక్ట్‌ (ఎలిమినేషన్‌) చేసేయాల్సి వుంటుందనీ బిగ్‌బాస్‌ హెచ్చరించడం గమనార్హం. ఇంతా చేసి, అలీ రెజా – బాబా భాస్కర్‌కి కనీసం ‘క్షమాపణ’ కూడా చెప్పలేదు.

అన్నట్టు, ‘మొక్కలు నాటడంలో శ్రద్ధ పెట్టలేదు..’ అంటూ బాబా భాస్కర్‌ మీద ఎగతాళి చేశాడు అలీ రెజా. ఎలా చూసినా హౌస్‌లో వుండడానికి అలీ రెజా (Ali Reza Battery Discharged) అనర్హుడని బిగ్‌బాస్‌ వ్యూయర్స్‌ ముక్త కంఠంతో చెబుతున్నారిప్పుడు.

Related Post

Sree Mukhi Rohini

బిగ్ డౌట్: శ్రీముఖి వైలెంట్‌ కిల్లర్‌.!

Posted by - August 18, 2019 0
బిగ్‌బాస్‌ గేమ్‌ షోలో లేటెస్ట్‌ వికెట్‌ రోహిణిది. రోహిణి (Sree Mukhi Rohini) హౌస్‌ నుండి ఎలిమినేట్‌ అవ్వడాన్ని హిట్‌ వికెట్‌గా అభివర్ణించాలా.? అంపైరింగ్‌లోనే లోపాలున్నాయి అనుకోవాలా.?…
Ashu Reddy Baba Bhaskar Siva Jyothy

ఎలిమినేషన్ 4: బిగ్ షాక్ తప్పదా?

Posted by - August 13, 2019 0
బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్.. తాజా ఎపిసోడ్‌లో ఈ సారి, నామినేషన్స్‌ (Baba Bhaskar Siva Jyothy) ప్రక్రియలో భాగంగా ఇద్దరిద్దరు చొప్పున కన్‌ఫెషన్‌ రూమ్‌కి…
pawan kalyan, vijay deverakonda, taxiwaala

పవన్‌ సారీ.. ‘ట్యాక్సీవాలా’ సవారీ.!

Posted by - November 20, 2018 0
సినిమాల్లో తిరిగి నటించాలన్న ఆలోచన ప్రస్తుతానికి తనకు లేదంటూ సినీ నటుడు, జనసేన పార్టీ (Jana Sena Party) అధినేత పవన్‌కళ్యాణ్‌ (Pawan Kalyan) ప్రకటించేశారు. రాజకీయాల్లో…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *