ali reza re entry bigg boss telugu 3

బిగ్‌బాస్‌3: అలీ.. గత్తర్‌ లేపాడా? గబ్బు పుట్టించాడా?

507 0

అలీ రెజా (Ali Reza Re Entry Bigg Boss 3 Telugu) బిగ్‌బాస్‌లోకి రీ-ఎంట్రీ ఎలా ఇవ్వగలిగాడు.? ‘నా కోసం బిగ్‌బాస్‌ చాలా ఎక్కువ ఖర్చు చేశారు’ అని అలీ ఎందుకు చెప్పాడు.?

ఏమోగానీ, అలీ రెజా రీ-ఎంట్రీ బిగ్‌హౌస్‌లో డ్రమెటిక్‌గా గత్తర్‌ లేపినా, సోషల్‌ మీడియాలో మాత్రం ‘బిగ్‌బాస్‌ని గబ్బు పట్టించేశారు’ అనే విమర్శలు ఎక్కువగా విన్పిస్తుండడం గమనార్హం.

Also Read: అలీ రెజాకి.. షాకిచ్చిన రాహుల్‌, పునర్నవి.!

బిగ్‌బాస్‌ తెలుగు మూడో సీజన్‌ (Bigg Boss Telugu Season 3) తీవ్ర గందరగోళంతో నడుస్తోంది. కింగ్‌ అక్కినేని నాగార్జున, ఈ షో టీఆర్పీని పెంచేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న మాట వాస్తవం.

కానీ, బిగ్‌బాస్‌ నిర్వాహకులు మాత్రం షో పాపులర్‌ అవడానికి తగిన కంటెంట్‌ని మాత్రం వాడలేకపోతున్నారు.

హౌస్‌లో కంటెస్టెంట్స్‌ (Bigg Boss Telugu 3) అంతా ఫుల్‌ ఎనర్జీ వున్నోళ్ళే. అలాంటోళ్ళతో ఇంతటి డల్‌ షో నిర్వహించడమేంటి.? ఇదే ఎవరికీ అర్థం కావడంలేదు. బిగ్‌బాస్‌ని ఎవరైతే చూస్తున్నారో, వారిలో కొందరు వ్యూయర్స్‌ కంటెస్టెంట్స్‌ని జడ్జ్‌ చేసి ఓటింగ్‌ చేస్తున్నారు.

ఈ క్రమంలో తక్కువమంది ఓట్లేసిన కంటెస్టెంట్‌ బిగ్‌హౌస్‌ (Bigg Boss 3 Telugu) నుంచి ఎలిమినేట్‌ అయిపోతాడు. అలా అలీ రెజా ఎలిమినేట్‌ అయిపోయాడు. మరి, ఏ ప్రాతిపదికన అలీని తిరిగి హౌస్‌లోకి తీసుకొచ్చారు.? అని వ్యూయర్స్‌ ప్రశ్నిస్తున్నారు. పైగా, రీ-ఎంట్రీ కూడా చాలా గ్రాండ్‌గా ప్లాన్‌ చేశారు.

చొక్కా విప్పించేసి, అలీ రెజాతో ‘స్కిన్‌ షో’ చేయించడం ద్వారా టీఆర్పీ రేటింగులు పెంచుకోవాలని బిగ్‌బాస్‌ చూడటమేంటి.? అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఎలాగైతేనేం, అలీ రెజా రీ-ఎంట్రీ ఇచ్చేశాడు. ఆ ఆనంద క్షణాల్ని తట్టుకోలేక, శివజ్యోతి పరమ రొటీన్‌గా ‘ట్యాప్‌’ విప్పేసింది.

శ్రీముఖి (Sree Mukhi) ఆనందానికి ఆకాశమే హద్దు. రవికృష్ణకి కొండంత బలం పెరిగింది అలీ రెజా రాకతో.

Also Read: బిగ్‌ ట్విస్ట్‌: నేరమెవరిది.? శిక్ష ఎవరికి.?

వరుణ్‌ సందేశ్ (Varun Sandesh), వితిక షెరు (Vithika Sheru), బాబా భాస్కర్‌, పునర్నవి భూపాలం (Punarnavi Bhupalam), రాహుల్‌ సిప్లిగంజ్‌ (Rahul Sipligunj).. అందరూ హ్యాపీ ఫీలయ్యారు. నిజానికి గేమ్‌ ఫైనల్‌ స్టేజ్‌కి దాదాపు దగ్గరకు వచ్చేసినట్లే.

ఈ టైమ్‌లో అలీ రెజా రీ-ఎంట్రీ (Ali Reza Re Entry Bigg Boss 3 Telugu) బిగ్‌బాస్‌ షో పట్ల ఆసక్తిని పెంచే అవకాశం లేకపోగా, మరింత ఫేక్‌గా బిగ్‌బాస్‌ని జనం అనుకునే పరిస్థితి దాపురిస్తోందని వ్యూయర్స్‌ స్పష్టం చేస్తున్నారు సోషల్‌ మీడియాలో.

Related Post

Ali Reza Punarnavi Bhupalam Mahesh Vitta

మహేష్‌, అలీ.. మధ్యలో పునర్నవి.!

Posted by - August 22, 2019 0
ఎవరు ఎవర్ని ఎప్పుడెలా తిట్టుకుంటారో తెలియని పరిస్థితి బిగ్‌హౌస్‌లో (Bigg Boss 3 Punarnavi) కన్పిస్తోంది. చుట్టూ బోల్డన్ని కెమెరాలు తమను గమనిస్తున్నాయనే ‘సోయ’ ఎవరికీ వుండడంలేదు.…

కింగ్‌ నాగ్‌.. ‘బిగ్‌’ రేటింగ్‌.. కుమ్మేశాడంతే.!

Posted by - August 1, 2019 0
కింగ్‌ అక్కినేని నాగార్జున (King Akkineni Nagarjuna) బుల్లితెరపై హోస్ట్‌గా దుమ్ము రేపేస్తున్నాడు. ఆల్రెడీ మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్‌ షోతో అదరగొట్టిన నాగార్జున, బిగ్‌ బాస్‌…

రొమాంటిక్‌ షాక్‌: వరుణ్‌ సందేశ్‌ హిట్‌ వికెట్‌.!

Posted by - August 8, 2019 0
బిగ్‌హౌస్‌లో రొమాంటిక్‌ కపుల్‌ ఇంకెవరు.! వరుణ్‌ సందేశ్‌ (Bigg Boss 3 Varun Sandesh), వితిక షెరు.. రియల్‌ లైఫ్‌ కపుల్‌ గనుక, బిగ్‌ బాస్‌ రియాల్టీ…
Eesha Rebba Shraddha Das

బిగ్‌ వైల్డ్ కార్డ్: ఈషా రెబ్బ.? శ్రద్ధాదాస్‌.?

Posted by - August 24, 2019 0
బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీకి మరోసారి టైమొచ్చిందని తెలుస్తోంది. ఇంతవరకూ 15 మంది కంటెస్టెంట్లు, వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా, మొదటి వారం హేమని…
india usa visa donald trump

ట్రంప్‌ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకి నష్టమెంత.?

Posted by - June 23, 2020 0
అమెరికాలో ట్రంప్‌ ప్రభుత్వం (Donald Trump) ‘వీసాల జారీ’ విషయమై సంచలన నిర్ణయం తీసుకుంది. హెచ్‌-1బి, హెచ్‌-2బి, జె, ఎల్‌.. ఇలా పలు రకాల వీసాల జారీ…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *