రాయుడు రనౌట్‌.. ధోనీ రిటైర్‌మెంట్‌.!

180 0

ఒకేరోజు భారత క్రికెట్‌ అభిమానులకు రెండు షాక్‌లు (Ambati Rayudu Retirement MS Dhoni Retirement) తగిలాయి. ఒకటి అంబటి తిరుపతి రాయుడు (Ambati Tirupathi Rayudu) అయిష్టంతో తీసుకున్న  వీఆర్‌ఎస్‌.. రెండోది మహేంద్రసింగ్‌ ధోనీ (Mahendra Singh Dhoni) రిటైర్‌మెంట్‌. నిన్ననే బంగ్లాదేశ్‌పై విజయం సాధించి టీమిండియా (Team India) వరల్డ్‌ కప్‌లో సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది.

అభిమానులు ఈ సంబరాల్లో మునిగి తేలుతుండగా, అంబటి రాయుడు ఇచ్చిన షాక్‌, చాలా మంది విస్తుపోయేలా చేసింది. నిజానికి అంబటి తిరుపతి రాయుడు వరల్డ్‌ కప్‌లో ఆడి ఉండాల్సింది. అంతటి సమర్ధత అతనికి ఉంది. కానీ, క్రికెట్‌ పెద్దలు అంబటి రాయుడిని తొక్కేశారు.

రాయుడుకి దక్కాల్సిన ప్లేస్‌లో విజయ్‌ శంకర్‌ని (Vijay Shankar) ఎంపిక చేశారు సెలెక్టర్లు. రాయుడుకి కాకపోతే, ఇంకో బెస్ట్‌ ఆప్షన్‌ రిషబ్‌ పంత్‌ (Rishabh Pant).. అతన్నీ కాదని విజయ్‌ శంకర్‌కి ఓటేసిన సెలెక్టర్లు ఓ కుంటిసాకు వెతుక్కున్నారు. అదే త్రీడీ. బ్యాటింగ్‌, బౌల్డింగ్‌, ఫీల్డింగ్‌.. ఈ మూడు డైమన్షన్లు అన్న మాట.

కానీ, ఒక్క ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేయగల సత్తా ఉన్న రాయుడికి (Ambati Tirupathi Rayudu)చాలా పెద్ద అన్యాయం జరిగింది. ఈ అన్యాయంపై అభిమాన లోకం తిరగబడింది. కానీ, ప్రయోజనం లేకుండా పోయింది.

అభిమానుల ఒత్తిడికి కొంచెం తలొగ్గినట్లు కనిపించిన క్రికెట్‌ పెద్దలు స్టాండ్‌ బై కింద రాయుడుతో (Ambati Rayudu) పాటు, రిషబ్‌ పంత్‌నీ (Rishabh Pant) ఎంపిక చేశారు. Ambati Rayudu Retirement MS Dhoni Retirement.

అయినా రాయుడికి పిలుపు రాలేదెందుకో.. Ambati Rayudu Retirement MS Dhoni Retirement

అయితే, స్టార్‌ ఓపెనర్‌ శికర్‌ ధావన్‌ (Shikhar Dhawan) గాయపడ్డాక విజయ్‌ శంకర్‌ని (Vijay Shankar) తీసుకున్న జట్టు యాజమాన్యం (Team India Management) ఆ విజయ్‌ శంకర్‌ గాయపడినా అంబటి రాంబాబును పిలవలేదు.

ఇక వరల్డ్‌ కప్‌లో (ICC World Cupr 2019) ఆడే అవకాశం దొరకదని భావించిన అంబటి రాయుడు క్రికెట్‌ కెరీర్‌కి గుడ్‌ బై చెప్పాలనే నిర్ణయం తీసుకున్నాడు. తన నిర్ణయాన్ని బీసీసీఐకి తెలిపాడు. బీసీసీఐ ఆ రిటైర్‌మెంట్‌ని ఆమోదించడం లాంఛనమే.

కాగా, ఇక్కడ అంబటి రాయుడు (Ambati Rayudu) తన కెరీర్‌ని పాడు చేసుకున్నాడని అనుకోలేం. ఓ గొప్ప క్రికెటర్‌ని మనం వదులుకున్నామంతే. కోహ్లీ, ధోనీ తర్వాత బెస్ట్‌ యావరేజ్‌ కలిగిన ఆటగాడిగా అంబటి రికార్డులకెక్కాడు. పైగా ఇప్పుడు ఫుల్‌ ఫామ్‌లో ఉన్నాడు.

ఈ వరల్డ్‌ కప్‌లో (ICC World Cup 2019) నెంబర్‌ 4 ప్లేస్‌ ఎంత ఇబ్బందికరంగా ఉందో చూస్తున్నాం. ఆ లోటు రాయుడుతో తీరేదే. నిజానికి రాయుడు ఔట్‌ అవ్వలేదు. బీసీసీఐ తప్పిదాలకు రనౌట్‌ అయ్యాడంతే.

వన్‌ అండ్‌ ఓన్లీ ఎమ్మెస్‌ ధోనీ Ambati Rayudu Retirement MS Dhoni Retirement

ఇండియన్‌ క్రికెట్‌లో బెస్ట్‌ వికెట్‌ కీపర్‌, బెస్ట్‌ మ్యాచ్‌ ఫినీషర్‌, బెస్ట్‌ కెప్టెన్‌.. ఇలా మూడింట్లోనూ ది బెస్ట్‌ అనిపించుకున్న ఒకే ఒక్క క్రికెటర్‌ ఎమ్మెస్‌ ధోనీ. ధోనీ (MS Dhoni) ఉన్నాడంటే, అభిమానులకు కొండంత ధైర్యం. ఎలాగైనా మ్యాచ్‌ గెలిచేస్తామని.

ఐపీఎల్‌ (Indian Premier League) కావచ్చు. అంతర్జాతీయ క్రికెట్‌ కావచ్చు. దాదాపు అన్ని ఫార్మాట్‌ల్లోనూ ధోనీ (Mahendra Singh dhoni) అదరగొట్టేశాడు.

చాలా కాలం తర్వాత టీమిండియాకి వన్డే వరల్డ్‌ కప్‌ అందించిన ధోనీ (MS Dhoni), మొట్ట మొదటి టీ 20 వరల్డ్‌ కప్‌ని భారత్‌ సొంతం చేశాడు. వయసు మీద పడుతుండడంతో, క్రికెట్‌కి గుడ్‌ బై చెప్పాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నా, ఆ నిర్ణయంలో చిన్న చిన్న మార్పులు చేసుకుని, ఇప్పటికీ క్రికెట్‌లో కొనసాగుతున్నాడు.

టెస్ట్‌ క్రికెట్‌కి కొన్నాళ్ల క్రితమే వీడ్కోలు పలికిన ధోనీ, వన్డేలకూ, టీ 20లకూ రిటైర్‌మెంట్‌ ప్రకటించబోతున్నాడు. ఈ మేరకు బీసీసీఐకి సమాచారమ్‌ కూడా ఇచ్చాడట ధోనీ. ఆ సమచారం ప్రకారం వన్డే వరల్డ్‌ కప్‌ చివరి మ్యాచ్‌తో ధోనీ రిటైర్‌ అవ్వబోతున్నాడనీ తెలుస్తోంది.

ధోనీ రిటైరవుతాడు సరే, వికెట్ల వెనకాల అద్భుతాలు సృష్టించగల మాంత్రికుడు మళ్లీ టీమిండియాకి (Team India) దొరుకుతాడా.? బెస్ట్‌ మ్యాచ్‌ ఫినిషర్‌ అనదగ్గ వికెట్‌ కీపర్‌ని మళ్లీ చూడగలమా.? అద్భుతమైన టైమింగ్‌తో సంచలన నిర్ణయాలు తీసుకోగలిగే ధోనీ లాంటి కెప్టెన్‌ని వికెట్ల వెనకాల చూసే అదృష్టం కలిగేనా.? ఇవన్నీ ఇప్పటికైతే సమాధానం లేని ప్రశ్నలే.

సెలక్టర్లపై గంభీర్‌ సిక్సర్‌.. Ambati Rayudu Retirement MS Dhoni Retirement

అంబటి రాయుడు (Ambati Rayudu) విషయంలో సెలక్టర్లు చాలా పెద్ద తప్పిదానికి పాల్పడ్డారంటూ మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) సంచలన వ్యాఖ్యలు చేశాడు.

‘ఆ ఐదుగురు’ మొత్తంగా చేసిన పరుగుల కంటే రాయుడు ఒక్కడే చేసిన పరుగులు ఎక్కువంటూ గౌతమ్‌ గంభీర్‌ (Gowtham Gambhir) వేసిన సెటైర్‌ ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. Ambati Rayudu Retirement MS Dhoni Retirement.

నిజమే, గంభీర్‌ వ్యాఖ్యల్లోనూ నిజం లేకపోలేదు. ఎందుకంటే, ఆయనా అంబటి లాంటి బాధితుడే. వయసు మీద పడి, క్రికెట్‌కి దూరం కాలేదు. సెలక్టర్ల రాజకీయ కుట్రలకు బలైపోయాడు ఒకప్పటి ఈ స్టార్‌ ఓపెనర్‌.

Related Post

‘మెన్‌ ఇన్‌ బ్లూ’ దెబ్బకి పాకిస్తాన్‌ ‘ఔట్‌’

Posted by - September 19, 2018 0
భారత్‌ – పాకిస్తాన్‌ మధ్య ఎప్పుడు ఎక్కడ క్రికెట్‌ జరిగినా ఆ కిక్కే వేరప్పా. ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సిరీస్‌లకు అవకాశమే లేకుండా పోయింది. సరిహద్దుల్లో…

పసికూనపై మెన్ ఇన్ బ్లూ గెలుపు

Posted by - September 19, 2018 0
క్రికెట్‌లో అగ్ర జట్లలో ఒకటి టీమిండియా (Team India). పసికూన హాంగ్‌ కాంగ్‌ (Hong Kong). అయితే, మైదానంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. పిచ్‌ కండిషన్స్‌…
australia, team india

టీమిండియా విక్టరీ: ఇదీ హిస్టరీ.!

Posted by - December 10, 2018 0
అడిలైడ్‌ టెస్ట్‌లో (Adelaide Test) టీమిండియా (Team India) విజయాన్ని అందుకుంది. అనేక రికార్డులు ఈ మ్యాచ్‌తో బద్దలయ్యాయి. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాని (Australia) చిత్తు చేయడమంటే అది…

యువీరత్వం: విజేతను ఓడించిన రాజకీయం

Posted by - June 11, 2019 0
2011 వరల్డ్‌ కప్‌ (2011 world cup) పోటీల్ని భారత క్రికెట్‌ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే, సుదీర్ఘ కాలం తర్వాత టీమిండియాని వరించిన వన్డే వరల్డ్‌…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *