అంబటి కొత్త ఇన్నింగ్స్.! ఆ బౌన్సర్లని తట్టుకోగలడా.?

Ambati Rayudu

Ambati Rayudu YSRCP.. అంబటి రాయుడు.! పరిచయం అక్కర్లేని పేరిది.! మన తెలుగు కుర్రాడు.. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ సందడి చేశాడు.!

చిన్న వయసులో క్రికెట్ ఆడటం మొదలు పెట్టి, లేటు వయసులో స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు అంబటి రాయుడు.!

కానీ, అంతే వేగంగా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసిపోయింది.! జట్టులో అవకాశాలు తగ్గడంతో, క్రికెట్‌కి గుడ్ బై చెప్పేశాడు.

లోకల్ క్రికెట్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకు.. అంబటి రాయుడి చుట్టూ బోల్డన్ని వివాదాలు.!

నిజానికి, క్రికెట్‌లో ఏమేం చేయాలో శక్తివంచన లేకుండా అన్నీ చేశాడు.. అంటే, వికెట్ కీపింగ్ దగ్గర్నుంచి, బౌలింగ్, బ్యాటింగ్ వరకూ..!

Ambati Rayudu YSRCP.. రాజకీయం వేరే లెవల్.!

క్రికెట్‌నీ రాజకీయాల్నీ విడదీసి చూడలేం. ఎందుకంటే, క్రికెట్‌లో కూడా రాజకీయాలుంటాయ్. ఆ రాజకీయాలే తనను క్రికెట్‌కి దూరం చేశాయని సన్నిహితుల వద్ద వాపోయాడు గతంలో అంబటి రాయుడు.

అలాంటిది, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేసిన అంబటి రాయుడు, ఈ రాజకీయ బౌన్సర్లు, యార్కర్లని ఎలా తట్టుకుంటాడన్న ప్రశ్న తలెత్తడం సహజమే.

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు అంబటి రాయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో.

వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ట్వీట్లేయడంతో మొదలైన అంబటి రాయుడి రాజకీయ ప్రయాణం, ఇప్పుడు వైసీపీలో చేరడంలో అధికారికమయ్యింది.

ప్రత్యర్థులపైకి ఎలా దూసుకెళతాడో.!

రాజకీయాల్లో విమర్శలు సహజం.! క్రికెట్‌లో రాజకీయాలు తట్టుకోలేకపోయిన అంబటి రాయుడు, రాజకీయాల్లో బౌన్సర్లని ఎలా తట్టుకుంటాడు.? యార్కర్లని ఎలా ఎదుర్కొంటాడు.? అన్న చర్చ అతని అభిమానుల్లో జరుగుతోంది.

వైసీపీలో చేరకముందే, వైసీపీ రాజకీయ ప్రత్యర్థులపై సెటైర్లు వేసేశాడు అంబటి రాయుడు.. అదీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.

గుంటూరు ఎంపీ అభ్యర్తిగా వైసీపీ నుంచి పోటీ చేసేందుకు అంబటి రాయుడికి వైసీపీ అధినాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన దరిమిలా.. రాజకీయ విమర్శలూ ఇకపై అతన్నుంచి గట్టిగా వినిపించబోతున్నాయన్నమాట.

Also Read: సామి చెప్పిండు.! ఓ పదిహేనేళ్ళు ఎన్నికలు మానేయిండ్రి.!

అంతా బాగానే వుందిగానీ, రాజకీయాల్లో అంబటి రాయుడు రాణిస్తాడా.? క్రికెటర్లు రాజకీయాల్లో రాణించిన సందర్భాలే కాదు, డకౌట్ అయిన సందర్భాలూ వున్నాయ్.

అంబటి రాయుడు పొలిటికల్ కెరీర్ ఏమవుతుందో వేచి చూడాల్సిందే.

hellomudra

Related post