అం..బానీ.! అసలేం తింటావ్ నువ్వు.?

 అం..బానీ.! అసలేం తింటావ్ నువ్వు.?

Anant Ambani

Anant Ambani Wedding Food.. అనంత్ అంబానీ ఎవరో తెలుసు కదా.? పేరులో ‘అంబానీ’ వుంది కాబట్టి, చాలామందికి తెలిసే వుంటుంది.!

‘అంబానీ’ సామ్రాజ్యానికి వారసుడే ఈ అనంత్ అంబానీ.! ఆ వారసుడి పెళ్ళి అంటే మాటలా.? ఆకాశమంత పందిరి వేసేయడంలో వింతేముంది.?

ఈ పెళ్ళి కోసం ఎన్ని వందల కోట్లు… కాదు కాదు, ఎన్ని వేల కోట్లు ఖర్చు చేస్తారో.. అని జనం చర్చించుకోవాలి. అలా జనం చర్చించుకోవడం కోసమే ఆ వివాహాన్ని అంత ఖరీదైనదిగా డిజైన్ చేసి వుంటారేమో.!

Anant Ambani Wedding Food.. అప్పుడు జరిగిందేంటబ్బా..

అదేంటీ, మొన్నెప్పుడో పెళ్ళి అన్నారు కదా.. 2 వేలకు పైగా వెరైటీలతో ‘భోజనాలు’ పెట్టించారు కదా.? అని జనం మాట్లాడుకుంటున్నారు.! మాట్లాడుకుంటారు మరి.!

ఇప్పుడు జరుగుతున్నదే అసలు పెళ్ళి. ఈ పెళ్ళి కోసం విందు ఎలా డిజైన్ చేసి వుంటారబ్బా.? అని, ఓ వర్గం మీడియా ఆరాలు తీయడం మొదలు పెట్టింది.

అనంత్ అంబానీ ఊబకాయంతో బాధపడుతుంటాడు. ఆ కారణంగా అతని మీద విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంటుంది. ఇప్పుడీ విందు – వంటకాల వ్యవహారం.. వీటితో ఆయన్ని అత్యంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు కొందరు. ఇదంతా సోకాల్డ్ మీడియా చేస్తున్న అతి వల్లేనా.? అంతేనేమో.!

Mudra368

ప్రపంచంలోని మేటి రుచులన్నీ వుండేలా అనంత్ అంబానీ పెళ్ళి విందుని డిజైన్ చేశారట. రెండున్నర వేలకు పైగానే వెరైటీలు ఈ విందులో వుంటాయట.

తినడానికేనా.?

ఏంటీ.? అవన్నీ ఆహార పదార్థాలేనా.? అంటే, డౌటేముంది.. అన్ని వెరైటీల్నీ ఆస్వాదించేవారైతే.. బతికి బట్టకట్టడం కష్టం. అంతే మరి, ఆ మెనూ అంతుంటుంది.!

అనంత్ అంబానీ పెళ్ళిని ఘనంగా చేయడం.. జియో నెట్‌వర్క్ టారిఫ్‌లు పెరగడం.. రెండిటికీ ఏమైనా సంబంధం వుందా.? ఇలాక్కూడా ట్రోల్ చేస్తున్నారు నెటిజనం.

Mudra369

నచ్చిన వాళ్ళు, నచ్చిన వెరైటీని ట్రై చేస్తారు. ఇంత గొప్ప, అంత గొప్ప.. అని అందరూ చెప్పుకోవాలి కాబట్టి, విందుని అలా ప్లాన్ చేసి వుంటారు.. అది వేరే చర్చ.!

అంబానీ అయినా, ఇంకెవరైనా.. క్షుద్భాద తీరేందుకు తినాల్సిందే. ఏదో ఒకటి తినాల్సిందే. అన్నమే తింటారో, రోటీ తింటారో.. ఇంకేమైనా తింటారో.. ఎవరిష్టం వాళ్ళది.

ఊళ్ళో పెళ్ళికి..

ఇక, సోకాల్డ్ మీడియా హడావిడి అంటారా.? ఊళ్ళో పెళ్ళికి.. గ్రామ సింహాల హడావిడి.. అనే మాట వింటుంటాం కదా.! ఇదీ అంతే.

Also Read: నిహారిక సినిమాల్లోకి వచ్చేస్తోందహో.!

హ్యూమన్ ఇంట్రెస్ట్.. పేరుతో, పెద్దోళ్ళ పెళ్ళిళ్ళు.. వాటిల్లో విందు.. వీటి గురించి కథనాలు వండి వడ్డించే సోకాల్డ్ మీడియా, పూట గడవని పేదల సమస్యల గురించి మాత్రం పట్టించుకోదనుకోండి.. అది వేరే విషయం.

Digiqole Ad

Related post