Ananya Panday Paris Fashion: నీ ప్యారిస్‌ అందమూ అనన్యమే!

 Ananya Panday Paris Fashion: నీ ప్యారిస్‌ అందమూ అనన్యమే!

Ananya Panday

Ananya Panday Paris Fashion.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుసు కదా.? అదేనండీ, విజయ్ దేవరకొండ సరసన ‘లైగర్’ సినిమాలో నటించింది కదా.. ఆ బ్యూటీనే.!

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్’ సినిమా గనుక హిట్టయి వుంటే, తెలుగులో ఓ రెండు మూడు సినిమాలు చేసేసి వుండేది అనన్య పాండే.

అసలు విషయానికొస్తే, అనన్య పాండే తాజాగా ప్యారిస్ వేదికగా జరిగిన ఓ ఫ్యాషన్ షోలో సందడి చేసింది. ఇదే ఆమెకు తొలి అంతర్జాతీయ వేదిక, ఫ్యాషన్ షో పరంగా.!

Ananya Panday Paris Fashion.. తొలి అడుగు.. సూపర్ హిట్టు..

తొలి అంతర్జాతీయ ఫ్యాషన్ షోలోనే అదరగొట్టేసింది అనన్య పాండే. రాహుల్ మిశ్రా ఆధ్వర్యంలో అనన్య పాండే ‘గ్లామరస్ షో’ అందర్నీ ఆకట్టుకుంది.

అంతర్జాతీయ వేదికపై తొలిసారిగా తానిలా ఫ్యాషన్ షోలో ప్రదర్శన చేయడం చాలా చాలా ఆనందంగా వుందంటూ అనన్య పాండే చెప్పుకొచ్చింది.

Ananya Panday
Ananya Panday

ఇది కూడా ఓ డ్రెస్సేనా.? అని అందరూ ఆశ్చర్యపోతున్నా, దాన్ని చాలా క్రియేటివ్‌గా డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. ఓ పెద్ద రింగ్.. బటర్ ఫ్లై కాన్సెప్ట్‌తో.. ఆ రింగ్ శరీరానికి అతుక్కునేలా డ్రెస్సుని డిజైన్ చేయడం గమనార్హం.

అందం చూడవయా.. ఆనందించవయా.. అంటాడో సినీ కవి.! కానీ, ఇదేం డ్రస్ మహాప్రభో.. అని కొందరు జుట్టు పీక్కుంటున్నారు.

Also Read: రష్మిక డీప్ ఫేక్.! ‘దొంగ’ దొరికాడహో.!

కానీ, ఫ్యాషన్ ప్రపంచంలో ఇలాంటి వింతలు చాలానే వుంటాయ్.! పెన్సిల్ హీల్‌తో ఫ్యాషన్ షోలో.. అదీ, తొలిసారి అంతర్జాతీయ వేదికపై.. అనన్య పాండే చాలానే కష్టపడిందట.

ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్‌తో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన అనన్య పాండే, అతి తక్కువ కాలంలోనే నటిగా తనదైన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతానికైతే బాలీవుడ్‌కి మాత్రమే పరిమితమైనప్పటికీ, ముందు ముందు ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తానంటోంది అనన్య పాండే.

‘లైగర్’ ఫలితం ఎలా వున్నా, అది తనకు వెరీ వెరీ స్పెషల్ ఫిలిం అని గతంలో ఓ ఇంటర్వ్యూలో అనన్య పాండే చెప్పుకొచ్చింది.

Digiqole Ad

Related post