ఆంధ్రప్రదేశ్‌ తీర్పు.. ముఖ్యమంత్రి పీఠమెవరిది?

409 0

కాబోయే ముఖ్యమంత్రిని నేనే.. అంటాడొకాయన. అధికారం మళ్లీ మాదే.. అని బల్ల గుద్ది చెబుతాడు మరొకాయన. మార్పు మొదలైంది. అయితే, ఆ మార్పు ఏ స్థాయిలో ఉంటుందో మాత్రం ఇప్పుడే అంచనా వేయడం తొందరపాటు అవుతుందని ఇంకొకాయన చెబుతారు (Andhra Pradesh Assembly Elections 2019).

ఏది నిజం.? ఎవరు చెప్పేది వాస్తవం.? జరగబోయేది ఏంటీ.? తాను తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు కొనసాగిస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తూనే, ఎలక్ట్రాన్‌ ఓటింగ్‌ మెషీన్లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పోలింగ్‌ సరళి తమకే అనుకూలంగా ఉందనీ, అధికారం చేజిక్కించుకోబోతున్నామనీ, పోలింగ్‌ ముగిసిన వెంటనే జోస్యం చెప్పేశారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మాత్రం మొదటి నుండీ ఒకే మాట చెబుతున్నారు. అధికారం కోసం కాదు, ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చామనీ, ప్రజలు మార్పుకు పట్టం (Andhra Pradesh Assembly Elections 2019) కట్టబోతున్నారనీ, గెలిచినా, ఓడినా ప్రజల పక్షానే ఉంటామనీ పవన్‌ కళ్యాణ్‌ ముందే చెప్పినట్లు, ఇప్పుడూ అదే మాటకు కట్టుబడి ఉన్నారు.

ఏ సర్వే ఎంత నిజం.? (Andhra Pradesh Assembly Elections 2019)

ఎవరు గెలుస్తారో.. తీర్పునివ్వాల్సింది ప్రజలు. ఆ ప్రజలు తమ తీర్పును చెప్పేశారు. ఆ తీర్పు ఇప్పుడు రిజర్వ్‌లో ఉంది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లలో నమోదయ్యి ఉన్న ఆ తీర్పు సంగతేంటో, మే 23న తెలుస్తుంది.

ఎన్నికల ముందు జరిగిన సర్వేలు ఆయా పార్టీల్ని ఆప్రమత్తం చేయడానికో, వాటి పేరు చెప్పి రాజకీయ పార్టీలు కుమ్ములాడుకోవడం కోసమో, ప్రజల్లో గందరగోళం సృష్టించడం కోసమో మాత్రమేనన్న అభిప్రాయాలు చాలా మందిలో ఉంటాయి. అది కొంత నిజం కూడా.

ఇప్పుడు సర్వేలంటే, అదొక పెయిడ్‌ వ్యవహారం. నికృష్ట రాజకీయం. పోలింగ్‌ పూర్తయ్యింది. ఇప్పుడు కూడా సర్వే ఫలితాలొచ్చేస్తున్నాయి. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా ఇలాంటివి సబబు కాదు. కానీ వస్తున్నాయి. మరి ఎన్నికల కమీషన్‌ ఏం చేస్తుంది.? ఏమో ఎవరికెరుక.?

హంగ్‌ వస్తే సంగతేంటీ.? (Andhra Pradesh Assembly Elections 2019)

ఆంధ్రద్రేశ్‌ రాజకీయాల్లో హంగ్‌ రావడం అంత ఈజీ కాదు. ప్రజలు హంగ్‌ని కోరుకునే పరిస్థితి ఉండదు. ఇది గతం చెబుతున్న నిజం. అయితే రాజకీయాలు రోజుకో రకంగా మారుతున్నాయి కాబట్టి, ఏదీ అసంభవం అని చెప్పడానికి వీల్లేదు.

అందుకేనేమో. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న రెండు ప్రధాన రాజకీయ పార్టీలు (Andhra Pradesh Assembly Elections 2019) తెర వెనుక మంత్రాంగం షురూ చేశాయి. ఎవరు గెలుస్తారు.? అనే విషయమై, సర్వేల ఫలితాల్ని మదింపు చేసి, గెలుపు గుర్రాల్ని ముందే అంచనా వేసి, కొనుగోళ్లు మొదలెట్టేశాయట. అదే నిజమైతే, ప్రజాస్వామ్యానికి ఇంతకన్నా మాయని మచ్చ ఇంకేముంటుంది.?

గెలిచినా, ఓడినా.. అది బోనస్సే.!

ఓడితే చంద్రబాబు రాజకీయ భవిష్యత్తుకి ఎండ్‌ కార్డ్‌ పడినట్లే. వైఎస్‌ జగన్‌ పరిస్థితి కూడా ఇంతే. ఇది ఆయా పార్టీలు చెబుతున్న మాట. వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం ఎన్నికల్లో కూడా లాభ, నష్టాల్నే బేరీజు వేసుకుంటాయి.

కానీ జనసేన (Andhra Pradesh Assembly Elections 2019) పరిస్థితి వేరే. ఆ పార్టీ సిద్ధాంతం వేరే. ఒక్క ఓటు వచ్చినా, అది జనసేన బలానికి నిదర్శనం. ఎందుకంటే జనసేన పయనం సున్నాతో మొదలవుతుంది. ఒక శాతం ఓట్లు వస్తాయా.? పది శాతం ఓట్లు వస్తాయా.? ఒక్క సీటు వస్తుందా.? పది సీట్లు వస్తాయా.? అధికారమే జనసేన వశమవుతుందా.? ఏం జరిగినా, అది జనం బలం. జనసేనకు జనమే ఇచ్చే బలమది.

గెలిస్తే గద్దెనెక్కడమేనా.? జనసేనకు ఓటు వేసేది ఎవర్నో గెలిపించడానికి కాదు (Andhra Pradesh Assembly Elections 2019). నిన్ను గెలిపించేవాడి కోసం అన్నది జనసేన సిద్ధాంతం. ఇదే.. ఈ సిద్ధాంతమే సైలెంట్‌ ఓటింగ్‌కి కారణమైందా.? మే 23 వరకూ వేచి చూడాలి.

Related Post

తెలంగాణ ఎన్నికలు: ఏ సర్వే ఎంత నిజం.?

Posted by - December 8, 2018 0
తెలంగాణ (Telangana) ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. విజేత ఎవరన్నది డిసెంబర్‌ 11న తేలనుంది. ప్రధానంగా పోటీ తెలంగాణ రాష్ట్ర సమితికీ, కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రజా కూటమికీ మధ్యనే…

జనసేనాని బలమెంత.? బలగమెంత.?

Posted by - September 25, 2018 0
రాజకీయాల్లో బలం వుండాలి.. బలగం కూడా వుండాలి. మరి, జనసేనాని పవన్‌కళ్యాణ్‌కి ఆ బలం, బలగం రెండూ వున్నాయా.? సగటు అభిమానిని ఆందోళనకు గురిచేస్తున్న ప్రశ్నలివి. సినీ…

వైఎస్‌ జగన్‌ ‘రాంగ్‌’ స్టెప్‌ వేసినట్టేనా?

Posted by - October 31, 2018 0
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSR Congress Party) అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jaganmohan Reddy), తనపై విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి…

జనసేనపై ‘అలీ’ అస్త్రాన్ని సంధించిన జగన్

Posted by - March 11, 2019 0
నీతో స్నేహంగా వున్నంతమాత్రాన నీవాళ్ళు కారు.. ఈ విషయం చిరంజీవికి ప్రజారాజ్యం పార్టీ పెట్టాకగానీ తెలియలేదు (Ali Ditches Pawan and Joins Jagan). సినీ పరిశ్రమలో…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *