క్రికెట్టూ.. సినిమాలూ.. సూడకపోతే కొంపలు మునిగిపోవ్.!

IPL Cricket Anil Ravipudi
Anil Ravipudi IPL Cricket.. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, తాజాగా ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్బంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.!
క్రికెట్ చూడకపోతే కొంపలేం మునిగిపోవు. వేసవి కాలం కదా, ఫస్ట్ షో.. సెకెండ్ షో.. సినిమాల్ని థియేటర్లలో చూడండి.. అని సెలవిచ్చాడు అనిల్ రావిపూడి.!
ఔను, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premiere League Cricket) చూడకపోతే కొంపలేం మునిగిపోవు.! అంతర్జాతీయ క్రికెట్ పోటీలకీ ఇది వర్తిస్తుంది.!
Anil Ravipudi IPL Cricket.. సినిమాల సంగతేంటి.?
ఇంతకీ, సినిమాలు చూడకపోతే కొంపలేమైనా మునిగిపోతాయా.? మునిగిపోతాయ్.. ప్రేక్షకులు, సినిమాల్ని చూడకపోతే.. సినీ జనాల కొంపలు మునిగిపోతాయ్.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
అనిల్ రావిపూడి ఈ విషయంలో సరిగ్గానే చెప్పాడండోయ్.! కానీ, సినిమాలు చూడకపోతే, ప్రజల కొంపలేమీ మునిగిపోవ్.! ఆ విషయం అనిల్ రావిపూడి కాస్త తెలుసుకుంటే మంచిది.!
సినిమాలు చూడకపోయినా కొంపలు మునిగిపోవు.. ఐపీఎల్ క్రికెట్ చూడకపోయినా కొంపలు మునిగిపోవు..!
అదీ, ఇదీ.. ఏదైనా ఎంటర్టైన్మెంటే..!
ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా చూడాలన్నది.. ఆయా వ్యక్తుల అభిరుచిని బట్టి ఆధారపడి వుంటుంది.
Mudra369
ఐపీఎల్ క్రికెట్టూ ఎంటర్టైన్మెంటే.. సినిమాలూ ఎంటర్టైన్మెంటే.. ఇందులో దాయడానికేమీ లేదు.! ఎవరికి ఏ ఎంటర్టైన్మెంట్ కావాలంటే, ఆ ఎంటర్టైన్మెంట్‌ని వాళ్ళు ఎంచుకుంటారు.
సినిమాల్లో ‘పస’ వుండటం లేదు కాబట్టే, సినిమా థియేటర్ల వైపు జనం చూడట్లేదు. ‘హనుమాన్’ సినిమా కోసం జనం ఎగబడలేదా.? ఎగబడ్డారు కదా.! విషయం వున్న సినిమా అది.!
ఐపీఎల్ (IPL 2024) క్రికెట్టు అయినా అంతే, స్టఫ్ లేకపోతే.. నిర్దాక్షిణ్యంగా రిమోట్‌కి పని చెప్పేస్తున్నారు వీక్షకులు.!
క్రికెట్టు అలా చూడాలి.. సినిమాల్ని ఎలా చూడాలి.?
అన్నట్టు, ఐపీఎల్ క్రికెట్ మ్యాచులను లైవ్‌లో చూడాల్సిన పనిలేదు, రిపీటెడ్ టెలికాస్ట్‌లో చూడమని సెలవిస్తున్నాడు అనిల్ రావిపూడి.!
సినిమాలు కూడా అంతే కదా.! థియేటర్లలో చూడాల్సిన పనేముంది.? టీవీల్లో చూసుకుంటే సరిపోద్ది కదా.!
Also Read: చిరంజీవిని చూసి మొరిగితే, చిరంజీవికి చేటా.?
థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అనేదొకటి ఎలాగైతే వుంటుందో, లైవ్ మ్యాచ్‌లను (Indian Premiere League 2024) తిలకించడమూ ఓ ప్రత్యకమైన అనుభూతి.!
అదండీ సంగతి.! సినిమా, ఐపీఎల్.. రెండూ ఎంటర్టైన్మెంట్లే.. ఎవరికి నచ్చింది వాళ్ళు ఎంచుకుంటారు.! ‘కొంపలు మునిగిపోయేంత’ కామెంట్లు, దీని మీద చేయాల్సిన పనిలేదు.!
అనిల్ రావిపూడీ.. నీకర్థమవుతోందా.?
