Animal Movie Review.! ఈ జంతువుని ఇష్టపడే జంతువేది.?

Animal Movie Review Ranbir Kapoor
Animal Movie Review.. ఓటీటీ ఓపెన్ చేస్తే, అందులో కనిపించే ఛండాలం అంతా ఇంతా కాదు.! విక్టరీ వెంకటేష్ లాంటోడే పచ్చి బూతులతో చెలరేగిపోయాడు.!
క్రమంగా ఓటీటీ కూడా జనాలకి అలవాటైపోయింది. ఆ బూతుల్ని, ఆ హింసనీ చూడటాన్ని అలవాటు చేసేసుకున్నారు కొందరు.
ఇప్పుడీ ఓటీటీ ప్రస్తావన ఎందుకంటే, ‘యానిమల్’ సినిమాలోనూ, హింస అలాగే బూతు.. ‘అంతకు మించి’ వున్నాయి గనుక.
Animal Movie Review.. ‘అర్జున్ రెడ్డి’ కాదు, అంతకు మించి..
‘అర్జున్ రెడ్డి’ సినిమాలోని హీరో పాత్ర, యువతరానికి కనెక్ట్ అయిపోయిందా.? యువతరంలోకి ఆ పాత్రని ఇంజెక్ట్ చేశారా.? ఏదైతేనేం, అదో స్పెషల్ ఫిలిం.
దానికి పది రెట్లు.. వంద రెట్లు.. వెయ్యి రెట్లు.. అని అనుకోవాల్సి వస్తుంది ‘యానిమల్’ సినిమా చూస్తోంటే.!
తండ్రి అంటే విపరీతమైన ప్రేమ కలిగిన కొడుకు.! ఆ విపరీతమైన ప్రేమ అంటే, దీన్ని జంతు ప్రేమ అని కూడా అనకూడదు. ఇది వేరే.!

హీరో పాత్ర అచ్చంగా జంతువులా వుంటుంది. తెరపై, అతని పాత్రని చూస్తోంటే, జుగుప్స కలుగుతుంది.!
ఫస్టాఫ్ స్టడీగానే స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్ వచ్చే సరికి, ‘చాలు బాబోయ్ ఈ వైపరీత్యం, జుగుప్స..’ అనిపిస్తాయ్.!
సెకెండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. అంటే, సాగతీత.. నీరసం.. అంతకు మించిన పైశాచికత్వం.! థియేటర్ల నుంచి బయటకు వచ్చేసరికి బుర్రలు బద్దలైపోతాయేమో అనిపిస్తుంది.
అన్నీ బాగున్నా.. ‘యానిమల్’ నోట్లో శని.!
సినిమాటోగ్రఫీ చాలా బావుంది. సంగీతం కూడా ఆకట్టుకుంది. నిర్మాణపు విలువల కోణంలో చూస్తే, అస్సలేమాత్రం రాజీ పడలేదు.. అన్నీ బాగానే వున్నాయ్.! అల్లుడి నోట్లో మాత్రం శని.!
దర్శకుడు ఏం చెబితే అది చేశాడు రణ్‌బీర్ కపూర్. అతన్ని తప్పు పట్టడానికి లేదు. హీరోయిన్ రష్మిక కూడా, తాను చెయ్యగలిగినదంతా చేసింది.
అనిల్ కపూర్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? నాన్న పాత్రలో బాగా చేశాడు. బాబీ డియోల్ కూడా తన వంతుగా తన పాత్రకు న్యాయం చేశాడు.
నిజానికి, ఇంత మంది స్టార్ కాస్టింగ్, బడ్జెట్, టెక్నికల్ వాల్యూస్ సెట్ అయ్యాక, దర్శకుడు ఎంత మంచి సినిమా తీసి వుండాలి.?
అబ్బే.. ఇది పైశాచికత్వమే..
కల్ట్ అనాలా.? ఛండాలం అనాలా.? జుగుప్స, పైశాచికత్వం అనాలా.? ఇంకేమైనా కొత్త పదం కనిపెట్టాలా.? అసలు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఏమనుకుంటున్నాడో ఏమో సినిమా అంటే.!
పెద్దలకు మాత్రమే.. అని ‘ఎ’ సర్టిఫికెట్ వేస్తే సరిపోదని సెన్సార్ బోర్డ్ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలిప్పుడు. ఆ రక్తపాతమేంటి.? ఆ బూతులేంటి.? ఆ నగ్నత్వమేంటి.?

‘హైపర్’ సినిమాలో నాన్న మీద విపరీతమైన ప్రేమున్న కుర్రాడిగా రామ్ పోతినేనిని చూశాం.! ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో జూనియర్ ఎన్టీయార్‌ని కొడుకు పాత్రలో హృదయానికి హత్తుకున్నాం.!
కానీ, రణ్‌బీర్ కపూర్‌ని ‘యానిమల్’ సినిమా చూశాక అసహ్యించుకోవాలేమో.! ఏ తండ్రీ, ఇలాంటి కొడుకు వుండాలని కోరుకోడు. ఏ కొడుకూ, ఇలా తనను తాను ఊహించుకోలేడు.!
Animal Movie Review.. ఏ జంతువుకి నచ్చుతుందో మరి.!
ఇంతకీ, ఈ ‘యానిమల్’ని ఇష్టపడే ‘యానిమల్’ ఏది.? అదే, ఇలాంటి జంతువుని ఇష్టపడే జంతువు ఏది.? వుండదు.. వుండదుగాక వుండదు.!
జనం నెత్తిన పబ్లిసిటీ పరంగా ఎంత బలంగా రుద్దినా, ఆ హైప్ నేపథ్యంలో నాలుగు కాసులు వచ్చినాగానీ.. ఇదైతే సినిమా కాదు.! నో డౌట్.!
ముందైతే, సందీప్ రెడ్డి వంగా తాను ‘జంతువు’ని కాదని నిరూపించుకోవాల్సి వుంటుందేమో.! ఇది ‘యానిమల్’ సినిమా తొలి రోజు చూసిన కొందరి అభిప్రాయం.!
ఇలా అన్నోళ్ళు కూడా, రివ్యూలు రాసేసి.. పైశాచికత్వంతో పాజిటివ్ రేటింగులు ఇస్తున్నారంటే.. వాళ్ళూ.. ‘యానిమల్’ కేటగిరికీ చెందినోళ్ళే అనుకోవాలేమో.!
చివరగా.. ఇలాంటి జుగుప్సాకరమైన, పైశాచికత్వంతో కూడిన సినిమా ఒకటి చూడాల్సి వస్తుందనీ.. దానికి రివ్యూ రాయాల్సి వస్తుందనీ.. కలలో కూడా ఊహించలేదు సుమీ.!
ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమాతో సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అదే ‘అర్జున్ రెడ్డి’.!
ఖర్మ కాలి.. ఈ ‘యానిమల్’ సినిమా కమర్షియల్ విజయాన్ని అందుకుంటే అందుకోవచ్చుగాక.! కానీ, సందీప్ రెడ్డి వంగా మీద పడ్డ ‘యానిమల్’ మచ్చ మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు.! అతని సినిమాలకు వెళ్ళాలంటే భయపడేలా చేశాడు మరి.!
