కల్కి కైరా.! ఫాలోయింగ్ అదిరిందిరా.!
Anna Ben Kalki 2898AD.. ‘కల్కి’ సినిమా చూశారా.? అందులో కైరా గుర్తుందా.? అదేనండీ, శంబల ప్రాంతానికి చెందిన ఫైటర్ కైరా.!
కాంప్లెక్స్ మూకలతో బీభత్సమైన ఫైటింగ్స్ చేసేసి, వీరోచితమైన పోరాటంలో ప్రాణాలు కోల్పోతుంది కదా.. ఆ కైరా గురించే ఇదంతా.
ఎవరీ కైరా.? ఏమా కథ. ‘కల్కి’ కైరా అసలు పేరు, అన్నా బెన్.! మలయాళ నటి. పలు సినిమాల్లో ఇంట్రెస్టింగ్ రోల్స్ చేసింది అన్నా బెన్.
Anna Ben Kalki 2898AD.. కల్కి కైరాగా సంచలనం..
ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొనే, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ సినిమాలో ‘కైరా’ పాత్రకి కూడా మంచి గుర్తింపే వచ్చింది.
మరీ ముఖ్యంగా యూత్ బాగా కనెక్ట్ అయిపోయారు కైరా అలియాస్ అన్నా బెన్‌కి.! తెరపై ఆమె ఆటిట్యూడ్‌కి ఫిదా అయిపోయారు యూత్. అదీ అసలు సంగతి.
అయినా, కైరా పాత్రని చంపేయాల్సిన అవసరం ఏముంది.? ఆమెని చంపేయకుండా వుంటే, ‘కల్కి’ యూనివర్స్ పేరుతో వచ్చే సినిమాలన్నిటిలోనూ ఆమె కనిపించేది కదా.? అంటూ నాగ్ అశ్విన్ మీద ఒకింత గుస్సా అవుతున్నారు అన్నా బెన్ ఫ్యాన్స్.
ఏమో.. మళ్ళీ పుట్టించేస్తాడేమో.!
కర్ణుడిగా, భైరవగా రెండు కాలాల్లో విభిన్న పాత్రల్లో ప్రభాస్ కనిపించిన దరిమిలా, ఏమో.. కైరాని కూడా ఏదో రూపంలో నాగ్ అశ్విన్ ముందు ముందు తెరపై మళ్ళీ చూపిస్తాడేమో.
ఇక, ‘కల్కి’ గురించి మాట్లాడుతూ, తన కెరీర్‌లో ఇదొక స్పెషల్ ఫిలిం అని అంటోంది అన్నా బెన్.
పాత్ర నిడివి తక్కువేనని ముందే తెలుసనీ, అయినా ఆ పాత్ర ప్రభావం తెరపై చాలా ఎక్కువగా వుంటుందని అనుకున్నాననీ, తన అంచనాలు తప్పు కాలేదని అన్నా బెన్ అలియాస్ కైరా చెప్పుకొచ్చింది.
అన్నట్టు, తెలుగులో అన్నా బెన్‌కి అవకాశాలు పోటెత్తుతున్నాయ్ అట.!