RGV Thriller Apsara Rani

ఆర్జీవీస్‌ ‘అప్సర’సలు.. ఈ ‘కిక్కు’ లెక్కే వేరేప్పా.!

250 0

‘శివ’ లాంటి అత్యద్భుతమైన సినిమా తీసిన రామ్ గోపాల్‌ వర్మ (Ram Gopal Varma RGV), అత్యంత నేలబారు సినిమాల్నీ తీశాడు. అదే ఆయన ప్రత్యేకత. ‘నేనెలాంటి సినిమాలు తీయాలనుకుంటానో, అలాంటివే తీస్తాను. కొన్ని మీకు నచ్చవచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు. అలాగని నా పంథా మార్చుకోలేను’ అంటాడు ఈ సంచలన దర్శకుడు.

కొందరు రామ్ గోపాల్‌ వర్మని విమర్శిస్తారు, కొందరు ఆయన్ని ప్రశంసిస్తారు. కానీ, ఎవరూ ఆయన్ని విస్మరించలేరు. జస్ట్‌ ఓ చిన్న ఎగ్జాంపుల్‌. ఓ హీరోయిన్‌ని వర్మ పరిచయం చేశాడు సోషల్‌ మీడియా ద్వారా. అంతే, ఆమె సోషల్‌ మీడియా పేజ్‌కి వేలల్లో ఫాలోవర్స్‌ పెరిగిపోయారు.

నిజానికి, ఆ హీరోయిన్‌ గతంలోనూ ఒకట్రెండు సినిమాలు చేసింది. అయితే, అప్పటి పేరు వేరు. అప్పటి సోషల్‌ మీడియా హ్యాండిల్‌ వేరు. ఆ సోషల్‌ మీడియా హ్యాండిల్‌కి వున్న ఫాలోవర్స్‌ వేరు. అదే రావ్‌ు గోపాల్‌ వర్మ ప్రత్యేకత.

ఇంతకీ, ఆ హీరోయిన్‌ కొత్త పేరు ఏంటో తెలుసా.? అప్సర రాణి. ఈ పేరుకి ముందు ఆమెకు ఇంకో పేరుంది. అంకేతా మహారాణా.. ఇదే అసలు పేరు. ‘4 లెటర్స్‌’ సినిమాలోనూ, ‘ఊలాలా ఊలాలా’ అనే సినిమాలోనూ నటించింది అంకేతా మహారణా.

ఆ సినిమాల్లో చేసినదానికంటే, ఇంకాస్త ఎక్కువ డోసులో వేడెక్కించే సన్నివేశాల్లో వర్మ సినిమాలో కన్పించబోతోందట. ఈ సినిమా పేరు ‘ద్రి¸ల్లర్‌’. నిజానికి, ఇది కూడా ఎప్పుడో ప్రారంభమయ్యిందే. దాని బూజు దులుపి, ‘కరోనా వైరస్‌ కోటా’లో విడుదల చేసేస్తున్నాడు వర్మ.

‘ఈ మధ్య వర్మ అన్నీ బూతు సినిమాలే తీస్తున్నాడు..’ అని చాలామంది అనుకోవచ్చుగాక.! అందులో నిజం కూడా వుండి వుండొచ్చుగాక. కానీ, కరోనా సీజన్‌లో సినిమా నిర్మాతలంతా బెంబేలెత్తుతోంటే, వర్మ మాత్రం హాయిగా.. క్యాష్‌ చేసుకుంటున్నాడు.

అవును, కరోనా కొంతమందికి ‘మేలు’ చేసింది అని వర్మని చూస్తేనే అర్థమవుతుంది. ఈ కరోనా సీజన్‌లో వర్మ ఇప్పటికే పోర్న్‌ స్టార్‌ మియా మల్కోవాని తీసుకొచ్చి ‘క్లైమాక్స్‌’ అన్నాడు, ఫ్యాషన్‌ డిజైనర్‌గా పనిచేసే శ్రీ రాపాకని తీసుకొచ్చి ‘నగ్నం’ అన్నాడు.

‘పే ఫర్‌ వ్యూ’ లెక్కన బాగానే సొమ్ములు చేసుకున్నాడు వర్మ. అహో, వర్మకి వచ్చిన ఈ ఆలోచన మాకెందుకు రాలేదు.? అని చాలామంది అసూయ పడేలా చేయగలిగాడు. ఇదే ఆలోచన ఇంకెవరికైనా వచ్చి వుంటే, కరోనా సీజన్‌లో బోర్‌ కొట్టకుండా చాలా సినిమాలు వచ్చేసేవేమో.!

శ్రీరాపాక పేరుని ‘స్వీటీ’గా మార్చేసిన వర్మ, ‘అంకేతా మహారాణా’ పేరుని ‘అప్సర రాణి’గా మార్చేసిన దరిమిలా, ఇంకెంతమందిని మారు పేర్లతో వర్మ, తన డిజిటల్‌ తెరపై పరిచయం చేస్తాడోగానీ.. అన్నిట్లోనూ కంటెంట్‌ దాదాపుగా ఒకటే. అందాల భామలు వస్త్ర సన్యాసం చెయ్యాల్సిందే.

ప్రస్తుతానికి సెమీ పోర్న్‌.. అనే స్థాయికి చేరిపోయింది వర్మ క్రియేటివిటీ.. అనే విమర్శలు వస్తున్నా, వర్మ (Ram Gopal Varma RGV) ఆగే రకం కాదు. ఇంకో మెట్టు పైకెక్కేస్తాడేమో ఈ విషయంలో అతి త్వరలోనే. ఆ మెట్టు ఏంటని మాత్రం అడక్కండి.. రామ్ గోపాల్ వర్మకి ఏదైనా సాధ్యమే.

Related Post

రాజశేఖర్‌ ‘కల్కి’లో గ్లామరే గ్లామర్‌!

Posted by - October 30, 2018 0
చాలాకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ప్రముఖ నటుడు డాక్టర్ రాజశేఖర్‌కి (Doctor Rajasekhar) ‘పిఎస్‌వి గరుడ వేగ’ (PSV Garuda Vega) కావాల్సినంత ఆక్సిజన్‌ ఇచ్చింది.…
Ram Charan Box Office Emperor

బాక్సాఫీస్‌ ఎంపరర్‌ రామ్‌చరణ్‌.. ఎనీ డౌట్స్‌.?

Posted by - August 18, 2019 0
హీరోగా ఓ పక్క సినిమాలు చేస్తూనే, ఇంకోపక్క నిర్మాతగా సంచలనాలు సృష్టించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ, రామ్‌చరణ్‌.. (Box Office Emperor Ram Charan) రెండు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *