హేయ్ అవంతిక.! నీలో చాలా విషయం వుందే.!

 హేయ్ అవంతిక.! నీలో చాలా విషయం వుందే.!

Avantika Dassani

Avantika Dassani: ఎవరీ అవంతిక.? ఇప్పుడీ అవంతిక గురించిన చర్చ ఎందుకు.? ఎందుకంటే, ఈ అవంతిక ఓ ప్రముఖ నటి కుమార్తె. ఆ ప్రముఖ నటి యావత్ సినీ పరిశ్రమని ఒకప్పుడు ఓ ఊపు ఊపేసింది. అదీ ఒకే ఒక్క సినిమాతో. ఆమె నవ్వు అలాంటిది మరి.!

తల్లికి తగ్గ తనయ.. అనిపించుకోవాలి కదా.? అందుకే, ఆ ప్రముఖ నటి కుమార్తె కూడా నటనలో చాలా శ్రద్ధగా పాఠాలు నేర్చుకున్నట్టుంది. నిజానికి, తల్లి నటన విషయంలోనే కొన్ని అనుమానాలున్నాయి చాలామందికి. కానీ, కుమార్తె విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాల్లేవు.!

ఎవరా తల్లి.? ఎవరా కుమార్తె.?

పరిచయం అక్కర్లేని పేరది.. ఔను, భాగ్యశ్రీ (Bhagyasree) అంటే కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో అయితే, ‘ప్రేమపావురాలు’ సినిమా హీరోయిన్. హిందీలో అయితే, ‘మైనే ప్యార్ కియా’.! సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘మైనే ప్యార్ కియా’ అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ.. ఓ మాస్టర్ పీస్.

అయితే, ఎందుకోగానీ, ‘మైనే ప్యార్ కియా’ సంచలన విజయాన్ని సాధించినా, దేశవ్యాప్తంగా నటిగా తన పేరు మార్మోగిపోయినా, ఆ తర్వాత చాలా తక్కువ సినిమాలకే పరిమితమయ్యింది.

Avantika Dassani.. తల్లిని మించిన తనయ.!

‘మిథ్య’ (Mithya) అనే ఓ వెబ్ సిరీస్‌తో అవంతిక దాసాని పేరు మార్మోగిపోతోందిప్పుడు. హిందీతోపాటు, వివిధ భాషల్లో ఈ వెబ్ సిరీస్, అందరి ఇళ్ళలోకీ వచ్చేసింది. వెబ్ సిరీస్ కథ, కాకరకాయ.. ఏంటన్నది వేరే చర్చ.

కానీ, ‘మిథ్య’లో అవంతిక నటనకు అంతా ఫిదా అయిపోతున్నారు. రియా రాజ్‌గురు పాత్రలో అవంతిక నటనకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఓ టీనేజీ అమ్మాయి, ఓ పెళ్ళయిన జంట మధ్యలో దూరి.. ఆ జంటని విడగొట్టడమేకాక, ఒకర్ని హత్య చేస్తుంది కూడా.

Also Read: ఏ‘కాంత’ సేవకు పిలిచిన ఆ హీరో ఎవరబ్బా.?

బోల్డన్ని భావోద్వేగాలకు అవకాశమున్న రియా రాజ్‌గురు పాత్రలో అవంతిక అత్యద్భుతంగా నటించింది.

గ్లామర్ విషయంలో మొహమాటాలతోనే భాగ్యశ్రీ సినిమా ఛాన్సులు వదిలేసుకుందని అంటారు. కానీ, భాగ్యశ్రీ కుమార్తె అవంతిక మాత్రం తొలి వెబ్‌సిరీస్‌తోనే గ్లామర్ మాత్రమే కాదు.. లిప్ లాక్ సీన్స్‌కి కూడా సై అనేసింది.

అందం, అభినయం.. వీటికి తోడు లక్కు కూడా కలిసొస్తే.. వెండితెరపై వెలిగిపోయేందుకు బోల్డంత అవకాశముంది అవంతికకి.

భాగ్యశ్రీ టాలీవుడ్ మీద కూడా ఫోకస్ పెట్టిన దరిమిలా, తన కుమార్తెనూ టాలీవుడ్‌కి పరిచయం చేస్తుందేమో వేచి చూడాలి.!

Digiqole Ad

Related post