వయసు తగ్గించే ‘అవకాడో’ గురించి మీకు తెలుసా.?

 వయసు తగ్గించే ‘అవకాడో’ గురించి మీకు తెలుసా.?

Avocado

Avocado Health Benefits..‘అవకాడో..’ ఈ పండు గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. రిచ్ ఫ్రూట్‌గా ఈ పండును అభివర్ణించొచ్చేమో.

అన్నట్లు, రియల్ ఎస్టేట్ కమర్షియల్ యాడ్స్‌లో భాగంగా ఈ పండు గురించి తెగ చెబుతున్నారండోయ్. అసలు మ్యాటర్ ఏంటంటే.!

కొద్దిగా రిచ్చే అయినా ఈ పండుతో వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు కూడా అంతే రిచ్అటండోయ్. ఇంతకీ అవకాడో పండు తినడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

Avocado Health Benefits.. నిత్య యవ్వనంగా కనిపించాలంటే.!

అవకాడోలో సహజంగా వుండే పండ్లలో వుండే మాదిరి విటమిన్లు, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా వుంటాయ్. అయితే, అధిక బరువుకు కారణమైన కేలరీలు ఈ పండులో చాలా తక్కువగా వుంటాయ్.

అందుకే ఊబకాయం వున్నవాళ్లూ, బరువు తగ్గాలనుకున్న వాళ్లూ ఈ పండును అధికంగా తీసుకుంటే స్లిమ్ అండ్ స్లీకీ ఫిజిక్ మీ సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా యాంటీ ఏజింగ్ లక్షణాలు ఈ పండులో అధికంగా వుండడం వల్ల వయసు ఎక్కువ వున్నవాళ్లు సైతం తక్కువ వయసున్న వాళ్లలా కనిపిస్తారట.

వయసుతో పాటూ వచ్చే చర్మంపై ముడతలు అవకాడో పండు తినే వారిలో తక్కువగా కనిపిస్తాయట. ఆర్ధరైటిస్ సమస్యల నివారణకు వాడే మందుల్లోనూ అవకాడో పండును విరివిగా వినియోగిస్తారు.

అందుకే ఈ పండును తరచూ తీసుకునే వారిలో కీళ్ల నొప్పులు.. వయసుతో పాటూ వచ్చే మోకాలి నొప్పులు దరి చేరవని నిపుణులు చెబుతున్నారు.

ఈ పండు తొక్కలు తీసి ఎండబెట్టి.. కొబ్బరి నూనెలో కలిపి శరీరానికి మర్దన చేస్తే చర్మంపై వుండే మచ్చలు, ముఖంపై మొటిమలు, బ్లాక్ హెడ్స్ వంటివి తొలిగిపోతాయ్.

గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా వుండాలంటే అవకాడో పండును ఖచ్చితంగా తినాలని చెబుతున్నారు. అలాగే డయాబెటిస్ వున్నవాళ్లు అవకాడో పండు తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో వుంటాయ్.

Also Read: Spinach Health Benefits.. పాలకూరతో మతిమరుపుకు చెక్.!

సింగిల్ సీడ్ కలిగి, మందపాటి తొక్క కలిగిన ఈ పండును పచ్చిగా ముక్కలు చేసుకుని తినొచ్చు. లేదంటే జ్యూస్, మిల్క్ షేక్స్ కూడా చేసుకుని ఇష్టంగా ఆరగించేయొచ్చు.

Digiqole Ad

Related post