అయోద్య రాములోరి దర్శనం ఉచితమే! దేవాలయాలన్నిటిలో?

 అయోద్య రాములోరి దర్శనం ఉచితమే! దేవాలయాలన్నిటిలో?

Ayodhya Rama Jana Bhoomi

Ayodhya Rama Free Darshan.. అయోద్యలో రాములోరు కొలువుదీరారు.! అహాహా.. ఏమి అద్భుతమిది.! నిన్న ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో రాములోరి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగిన సంగతి తెలిసిందే.

నేటి నుంచి సాధారణ భక్తులను రాములోరి దర్శనానికి అనుమతినిస్తున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్య చేరుకున్నారు రాములోరి దర్శన భాగ్యం కోసం.

మామూలుగా అయితే, దేవాలయాల్లో వీఐపీ దర్శనాలు, వీవీఐపీ దర్శనాలూ.. ప్రత్యేక దర్శనాలంటూ, టిక్కెట్లు పెట్టేసి, క్యాష్ చేసుకోవడం చూస్తుంటాం.

కానీ, అయోద్య రాములోరి దేవాలయంలో ఆ పరిస్థితి వుండకపోవచ్చు. ప్రస్తుతానికైతే దర్శనం అందరికీ ఉచితమేనని అయోద్య శ్రీరామ తీర్ధ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది.

అదిరింది కదూ.! నిజానికి, ఏ దేవాలయంలోనూ దర్శనం పేరు చెప్పి, భక్తుల నుంచి వసూళ్ళు చేయకూడదు.!

Ayodhya Rama Free Darshan.. భక్తులయందు వీఐపీ భక్తులు వేరయా..

దేవుడి ముందర అందరూ సమానమే.! కానీ, ఏం చేస్తాం.? ప్రభుత్వాలు, దేవాలయాల్ని ఆదాయ వనరులుగా చూస్తున్నాయ్.

అంతేనా, రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రాలుగానూ దేవాలయాల పాలక మండళ్ళను మార్చేశాయి ప్రభుత్వాలు.

ఈ నేపథ్యంలో భక్తుల జేబులకు చిల్లు పెడుతూ, దేవాలయాల మాటున ఆర్జనకు ప్రభుత్వాలు అలవాటుపడ్డాయ్.

అయోద్యకు శ్రీరాముడు తిరిగొచ్చాడు.. దేశంలో చాలా మార్పులు చూడబోతున్నాం.. అని ప్రధాని నరేంద్ర మోడీ నిన్న ప్రకటించిన దరిమిలా, అయోధ్య తరహాలోనే మిగతా దేవాలయాల్లోనూ దర్శనం ఉచితమే అవ్వాలి.!

అవుతుందా మరి.? అవ్వాలని.. అయి తీరాలని.. భక్తి ఏ మాత్రం అమ్ముడుపోయే వస్తువు కాదని నిరూపితమవుతుందని ఆశిద్దాం.!

Digiqole Ad

Related post