Ayodhya Rama Janma Bhoomi.. రాములోరు కొత్తగా అయోద్యకు చేరడమేంటి.? భగవంతుడు సర్వాంతర్యామి కదా.! కానీ, ఇక్కడ కథ వేరు.!
చాలాకాలం క్రిందట బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన అప్పట్లో చాలామందిని కలచివేసింది. మరి, అంతకు ముందున్న రామాలయం కూల్చివేత ఇంకెంతమందిని కలచివేసి వుండాలి.?
ఇప్పుడంటే మనం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుంటున్నాం. రాజ్యాంగం గురించి చర్చించుకుంటున్నాం. హక్కులంటున్నాం, బాధ్యతలంటున్నాం.. న్యాయస్థానాలంటున్నాం.!
Ayodhya Rama Janma Bhoomi.. అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు..
ఒకప్పటి పరిస్థితులు వేరు.! అత్యంత పాశవికంగా దండయాత్రలు జరిగేవి. భారతదేశాన్ని ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఎందరో నర రూప రాక్షకులు నాశనం చేయాలని చూశారు. చాలామంది చాలా వరకు నాశనం చేశారు కూడా.!
అలా నాశనమైనవాటిల్లో గొప్ప గొప్ప దేవాలయాలున్నాయ్.! మన చారిత్రక సంపద దోపిడీకి గురయ్యింది.! సగటు భారతీయుడు ఆలోచించాల్సింది ఈ వినాశనం గురించి కూడా.!
దేవుడు ఒక్కడే.! ఒక్కో మతానిదీ ఒక్కో విశ్వాసం.! అందరూ కలిసి మెలిసి వుండటమే గొప్పతనం.. అదే మానవత్వం.. అదే దైవకార్యం కూడా.!
అసాంఘీక శక్తుల దుష్ట పన్నాగం.!
బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత.. చాలా కాలం గడిచాకగానీ, వివాదం సమసిపోలేదు. ఇంకా ఏదో రూపంలో వివాదం రాజేద్దామని కొన్ని అసాంఘీక శక్తులు ప్రయత్నిస్తూనే వున్నాయ్.
అయోద్య అంటే రామ జన్మభూమి.! ఆ రామ జన్మభూమిలో శ్రీరాముడు, బాల రాముడిగా దేవాలయంలో కొలువు దీరనున్నాడు.. అదీ విగ్రహ రూపంలో.!
Also Read: ఎందుకొచ్చిన ఎగ్జిట్ పోల్.? ఎవర్ని ఏమార్చడానికి.?
ఇది హిందువులందరికీ అతి పెద్ద పండగ.! కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఆ పండుగ సంబరాల్ని చూస్తున్నాం.! ఇన్నేళ్ళు పట్టిందా ఈ సంబరానికి.? అన్న ప్రశ్న మదిలో మెదిలితే, మనసంతా భారంగా మారిపోతుంటుంది.!
రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు.. రాజకీయమే చేయాలి.. చేస్తారు, చేస్తాయి కూడా.! కానీ, ప్రజలుగా మనమేం చేయాలి.?
మన మత ధర్మాన్ని మనం పాటించాలి.! పరమత సహనం.. భారతదేశం గొప్పతనం.! ఇతర మతాల్ని గౌరవిద్దాం.!
కులాలు, మతాలు, ప్రాంతాలు వేరైనా.. మనమంతా మనుషులం.! సాటి మనిషికి సాయం చేయడమే దైవం.! హాని తలపెట్టడం రాక్షసత్వం.!
జై శ్రీరాం.!
– yeSBee