Table of Contents
Balakrishna Pawan Kalyan Assembly.. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, మరో సినీ నటుడు కొణిదెల పవన్ కళ్యాణ్.. ఇద్దరూ కలిసి ‘అన్‌స్టాపబుల్’ అనే టాక్ షోలో సందడి చేసిన సంగతి తెలిసిందే.
ఇటు బాలకృష్ణ కావొచ్చు, అటు పవన్ కళ్యాణ్ కావొచ్చు.. ఇద్దరూ కేవలం సినీ నటులు మాత్రమే కాదు, రాజకీయ నాయకులు కూడా.
ఒకరేమో, అప్పటికి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. ఆయనే నందమూరి బాలకృష్ణ. ఇంకొకరు, సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా పవన్ ఓడిపోయారు. అది వేరే చర్చ.
Balakrishna Pawan Kalyan Assembly.. సినిమా వేరు.. రాజకీయం వేరు..
ఔను, సినిమాలు వేరు, రాజకీయం వేరు.! అనుకోవడానికి బాగానే వుంటుందిది. కానీ, తెలుగునాట రాజకీయాలకీ, సినిమాలకీ విడదీయరాని సంబంధం వుంది.
స్వర్గీయ ఎన్టీయార్ సినీ నటుడే, తెలుగునాట రాజకీయాల్లో తిరుగులేని సంతకం ఆయన చేశారు. అదెప్పటికీ చెరిగిపోదు కూడా.!
బాలకృష్ణ అయినా, పవన్ కళ్యాణ్ అయినా.. సినిమాలు చేస్తూనే, రాజకీయాల్లో కొనసాగారు. ఒకప్పుడు ఈ ఇద్దరూ రాజకీయ ప్రత్యర్థులే.! కానీ, నేరుగా తలపడింది లేదు.
స్నేహం చిగురించింది..
అయితే, నందమూరి బాలకృష్ణకీ పవన్ కళ్యాణ్‌కీ మధ్య స్నేహం చాన్నాళ్ళ నుంచీ వుందట. మరి, బ్లడ్డు.. బ్రీడు.. అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యల సంగతేంటి.? అది మళ్ళీ వేరే వ్యవహారం.
ఇద్దరూ కలిసి అన్‌స్టాపబుల్ టాక్ షోలో సందడి చేశారు. మనసు విప్పి మాట్లాడుకున్నారు.. అలా ఇరువురి అభిమానుల మధ్యా సఖ్యతకు ఈ కార్యక్రమం ఉపయోగపడింది.
కట్ చేస్తే, టీడీపీ – జనసేన పొత్తు..
ఒకే వేదికపై పవన్ కళ్యాణ్, బాలకృష్ణ కలిసి కనిపించారు.. రెండు పార్టీలూ, బీజేపీతో కలిపి కూటమిగా ఏర్పడి, ఇటీవలి ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందుకోవడం చూశాం.
ఓ వైపు నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కొడితే, జనసేనాని పవన్ కళ్యాణ్ తన పార్టీకి 100 పర్సంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు.. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
Also Read: ఫర్నిచర్ దొంగతనమా.? కోడెలకైనా.. జగన్‌కైనా ఏంటా ఖర్మ.?
ఇప్పుడేమో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.! ఇంకోపక్క, హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఈ ఇద్దరూ అసెంబ్లీలో పలకరించుకున్నారు.
శాసనసభలో శాసనసభ్యుల పదవీ ప్రమాణ స్వీకారం సందర్భంగా బాలయ్య, పవన్ కలుసుకోవడం.. భలే కిక్ ఇస్తోంది చూసినవారికి. ఈ అన్‌స్టాపబుల్ కాంబినేషన్.. నిజంగానే సమ్‌థింగ్ వెరీ వెరీ స్పెషల్.