BB7 Telugu: రతిక రోజ్.! టాపర్ ఆఫ్ ది వీక్.!
Rathika Rose
BB7 Telugu Rathika Rose.. బిగ్ బాస్ తెలుగు రియాల్టీ సీజన్ సెవెన్ తొలి వారం గడిచింది. వీకెండ్ ఎపిసోడ్స్ నేడు, రేపు జరుగుతాయి. ఇంతవరకూ ఎవరూ హౌస్ మేట్స్ కాదు.. కంటెస్టెంట్లేనని చెబుతున్నాడు బిగ్ బాస్.
మరి, కంటెస్టెంట్ల నుంచి ఎవర్నయినా ఎలిమినేట్ చేస్తారా.? అది రేపు తెలుస్తుంది. నామినేషన్ల లిస్టు రెడీ.! ఎలిమినేషన్ వుండొచ్చు, వుండకపోవచ్చు. కొత్త కంటెస్టెంట్లు కూడా రావొచ్చు.
ఇక, వారం రోజుల బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు సీజన్ సెవెన్‌కి సంబంధించి.. టాపర్ లిస్ట్ తీస్తే, అందులో మొదటి స్థానం రతిక రోజ్‌దే అవుతుంది. రతిక అంటే మల్టీ టాలెంటెడ్.
BB7 Telugu Rathika Rose.. క్వీన్ రతిక..
బిగ్ బాస్ రియాల్టీ షోకి ఏ స్థాయి కంటెంట్ కావాలో అదంతా ఇచ్చేస్తోంది రతిక. కంటతడి పెడుతోంది.. నవ్విస్తూ వుంది.. డాన్సులు చేస్తోంది.. స్ట్రాంగ్‌గా కన్పిస్తోంది.. వెరసి, రతిక ఓ కంప్లీట్ ప్యాకేజ్.
అందుకేనేమో, రతికని మిగతా కంటెస్టెంట్స్ చాలా ఈజీగా టార్గెట్ చేసేస్తున్నారు. ఇమ్యూనిటీకి సంబంధించిన టాస్కుల క్రమంలో రతికని మిగతా కంటెస్టెంట్స్ టార్గెట్ చేసిన తీరు చూస్తోంటే, టాప్ ఫైవ్.. కాదు కాదు, టాప్ త్రీలో రతిక వుంటుందేమోనన్న అభిప్రాయం కలగకమానదు.
Also Read: Tamannaah Bhatia: పెళ్ళెప్పుడు.! ఆ ఒక్కటీ అడక్కు.!
బిగ్ బాస్ హౌస్‌లో ఏదైనా జరగొచ్చు. టాప్ ప్లేస్ నుంచి అదఃపాతాళానికి పడిపోవడం పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే, రతిక మెంటల్లీ బాగా ప్రిపేర్ అయినట్లే వుంది.!
అన్నట్టు, గ్లామర్ విషయంలోనూ, మిగతా ఫిమేల్ కంటెస్టెంట్లందరికీ గట్టి పోటీ ఇస్తోంది రతిక రోజ్. సోషల్ మీడియాలోనూ రతికకి మద్దతుగా ఓ పెద్ద టీమ్ పనిచేస్తున్నట్లే వుంది.!