Beauty And Weight Lifting.. చెట్టులెక్కగలవా ఓ నరహరి.. పుట్టలెక్కగలవా ఓ నరహరి.. అంటూ పాత తెలుగు సినిమాలో ఓ మాంఛి పాటొకటుంటుంది.!
ఆకాశంలో సగం.. అన్నింటా సగం.! ఏం, మహిలామణులకేం తక్కువ.? మగాళ్ళతో సమానంగా, ఆ మాటకొస్తే అంతకు మించి.. మగువలు ఏమైనా చేయగలరు.!
సిక్స్ ప్యాక్ అంటే ఒకప్పుడు మగాళ్ళకే.! కానీ, ఇప్పుడు అమ్మాయిలూ పోటీ పడుతున్నారు.! సర్లెండి, సిక్స్ ప్యాక్.. జీరో సైజ్ ఫిజిక్.. వాటి గోలెందుకు ఇప్పుడు.?
నిజమే.. బరువులు ఎత్తేస్తున్నారు భలేగా.!
బరువులు ఎత్తడం ఓ కళ.! అందుకే కదా, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు.! మగాళ్ళతోపాటు మహిళలూ పోటీపడుతున్నారు.. ఈ పోటీల్లో.!

అవి, బరువులు ఎత్తే పోటీలు.! ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది, నాజూకు భామలు.. పట్టుదలతో బరువులు ఎత్తడం గురించి.!
అందం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందంటారు. ఆ ఆత్మవిశ్వాసం మరింత పెంపొందించుకునేందుకు, మగువలు బరువులెత్తేస్తున్నారిప్పడు.
Beauty And Weight Lifting.. జిమ్ముల్లో అతివల కష్టాలు..
చాలా చాలా కష్టపడి బరువులు ఎత్తేస్తారు అతివలు జిమ్‌లకు వెళ్ళి మరీ. సరైన ట్రైనర్ పర్యవేక్షణలో బరువులెత్తితే మంచిదే. అది ఆరోగ్యం కూడా.!
కానీ, ఏ చిన్న పొరపాటు జరిగినా, అది ప్రాణమ్మీదకు తీసుకురావొచ్చు. సో, జర జాగ్రత్త. బరువులు ఎత్తేస్తే సరిపోదు.. దానికి తగ్గ బలాన్ని సంతరించుకోవాలి… మగాళ్ళైనా, మహిళామణులైనా.!
సరైన ఆహారం.. మంచి ట్రైనర్ పర్యవేక్షణ.. ఇవన్నీ వుంటే, బరువులు ఎత్తడం కళ మాత్రమే కాదు.. ఆ ప్రక్రియ కళకళ్ళాడుతుంది కూడా.!
Also Read: Lahari Shari Butterfly Tattoo: పచ్చబొట్టు సౌందర్య ‘లహరి’.!
ఓ సమంత.. ఓ రకుల్ ప్రీత్ సింగ్.. చెప్పుకుంటూ పోతే, చాలామంది అందాల భామలు, బరువులు ఎత్తడంలో తమవైన సొంత రికార్డుల్ని ఎప్పటికప్పుడు బ్రేక్ చేసుకుంటూ వెళ్ళారు.
బరువులు ఎత్తడం మంచిదే.. అందం, ఆరోగ్యం కూడా.! కాకపోతే, పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోకండేం.! ఎండాకాలం.. ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి బరువులెత్తేటప్పుడు.!
ఏ చిన్న అసౌకర్యం కలిగినా, బరువులెత్తడం మానేసి, వైద్యుల్ని సంప్రదించడం అస్సలు మర్చిపోవద్దు.!