‘భగవంత్ కేసరి’ నుంచీ కాజల్‌ని లేపేశారా.?
Bhagavanth Kesari Kajal Dumped.. చందమామ కాజల్ అగర్వాల్ టైమ్ అస్సలు బాగా లేదనిపిస్తోంది. ‘ఆచార్య’ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే.
కట్ చేస్తే.. ఈ సినిమా కథకి హీరోయిన్ అవసరం లేదన్న కారణం చూపించి.. మధ్యలోనే ఆమె పాత్రను లేపేశారు. పాపం.! అప్పుడే కాజల్ చాలా ఫీలయ్యింది.
అది ఇంకా మర్చిపోకుండానే మరో స్టార్ హీరో సినిమాతో కాజల్‌కి అవమానం జరిగింది. అదే ‘భగవంత్ కేసరి’. ఈ సినిమాలో బాలకృష్ణకి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.
Bhagavanth Kesari Kajal Dumped.. కాజల్ జాడే లేదాయె.!
అలాగే, ఈ సినిమాలో శ్రీలీల ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్న సంగతీ తెలిసిందే. ఇంతవరకూ ‘భగవంత్ కేసరి’ నుంచి చాలా పోస్టర్లూ, గ్లింప్స్, టీజర్స్, సాంగ్ ప్రోమోస్.. ఇలా పలు ప్రచార చిత్రాలు విడుదలయ్యాయ్.
కానీ, ఎక్కడా కాజల్ జాడ కాన రాలేదింతవరకూ. శ్రీలీల హంగామానే కనిపిస్తోంది కానీ, ఒక్క చోట కూడా కాజల్ కనిపించింది లేదు.
దాంతో, ఈ సినిమాలోనూ కాజల్ క్యారెక్టర్ లేపేశారన్న టాక్ వినిపిస్తోంది. నిజానికి ఈ సినిమాలో శ్రీలీల, బాలకృష్ణకు కుమార్తెగా నటిస్తుంది.
అంటే, కాజల్, శ్రీలీలకి తల్లి పాత్ర అవుతుంది.. అంత పెద్ద తరహా పాత్రలో కాజల్ ఎలా నటించి వుంటుంది.. అంటూ మొదట్లో ప్రచారం జరిగింది.
ఇప్పుడేమో.. మొత్తానికి కాజల్ (Kajal Aggarwal) క్యారెక్టరే లేపేశారంటూ ప్రచారం జరుగుతోంది.
కాజల్‌కే ఎందుకిలా.! మొన్నచిరంజీవి, ఇప్పుడు బాలయ్య.!
మొన్నా మధ్య సోషల్ మీడియాలో ఓ వీడియో హల్‌చల్ చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడితో పాటూ, శ్రీలీల, కాజల్ అగర్వాల్ మంచి జోరుగా డాన్స్ చేసిన వీడియో అది.
బహుశా షూటింగ్ గ్యాప్‌లో తన హీరోయిన్లతో అనిల్ రావిపూడి హుషారుగా డాన్స్ చేసి వుంటాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యిందప్పుడు.
ఇక లేటెస్ట్‌గా అందుతోన్న సమాచారం ప్రకారం, సినిమా ఫైనల్ అవుట్ పుట్‌లో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) క్యారెక్టర్ మొత్తానికి లేపేశారంటూ గుసగుసలాడుకుంటున్నారు.
అయితే, కొన్ని చిన్నా చితకా క్యారెక్టర్లు ఫైనల్ అవుట్ పుట్‌కి వచ్చేసరికి ఎడిటింగ్‌లో భాగంగా లేచిపోవడం సర్వసాధారణమే.!
కానీ, హీరోయిన్ క్యారెక్టర్.. అందులోనూ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) వంటి ఓ స్టార్ హీరోయిన్‌కే ఇలా జరిగితే.!
ఇది చాలా టూ మచ్.! పెళ్లయ్యి, ఓ బిడ్డకి తల్లయ్యాకా కూడా కాజల్ అగర్వాల్ కెరీర్‌లో బిజీగానే వుంది.. స్టార్ హీరోలతో అందునా, ప్రెస్జీజియస్ ఆఫర్లు పొందుతూ బాగానే క్లిక్ అవుతోందనుకున్నారంతా.!
Also Read: కలర్స్ స్వాతి డివోర్స్ గోలేంటి.?
ఇంతలోనే ఇలా.! బ్యాక్ టు బ్యాక్ దెబ్బలు తగులుతుంటే ఎలా.! మరి, ఈ ప్రచారంలో నిజమెంతో తెలీదు కానీ, మరో క్రేజీ ప్రాజెక్ట్ కమల్ హాసన్‌తో ‘ఇండియన్ 2’లోనూ కాజల్ నటిస్తోంది.
ఆయన ఏకంగా విశ్వ నటుడాయె.! మరి కాజల్ (Kajal Aggarwal)కి ఆ ప్రాజెక్ట్ భవిష్యత్ ఏంటో.!