బాక్సాఫీస్‌ నయా బాద్‌ షా విజయ్‌ దేవరకొండ

 బాక్సాఫీస్‌ నయా బాద్‌ షా విజయ్‌ దేవరకొండ

‘గీత గోవిందం’ సినిమా సరికొత్త రికార్డుల్ని సృష్టించే దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పటికే ఈ సినిమా 60 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది ‘షేర్‌’ వసూళ్ళ పరంగా. గ్రాస్‌ లెక్కలైతే 100 కోట్లు దాటేశాయ్‌. తాజాగా ఈ సినిమా నైజాంలో 19 కోట్ల మార్క్‌ని దాటేయడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అగ్రహీరోలకే ఈ ఫీట్‌ సాధించడం ఆషామాషీ విషయం కాదు. కొంతమంది అగ్ర హీరోలకు మాత్రమే ఇప్పటిదాకా ఈ రికార్డ్‌ సాధ్యమయ్యింది. అలాంటిది విజయ్‌ దేవరకొండ సింపుల్‌గా ఈ రికార్డ్‌ని కొల్లగొట్టేశాడు.

నైజాం బాద్‌షా

నాని హీరోగా రూపొందిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో, హీరో స్నేహితుడి పాత్రలో కన్పించిన విజయ్‌ దేవరకొండ, ఆ తర్వాత ‘పెళ్ళిచూపులు’ సినిమాతో సోలో హీరోగా తొలి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా సంచలన విజయాన్ని అందించింది విజయ్‌కి. తెలంగాణ డిక్షన్‌తో విజయ్‌ దేవరకొండ తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాకి తమిళనాడు, కర్నాటకల్లోనూ, బాలీవుడ్‌లోనూ బోల్డంతమంది అభిమానులు పుట్టుకొచ్చేశారు. ముఖ్యంగా తెలంగాణ డిక్షన్‌లో విజయ్‌ చెప్పే డైలాగులకి అంతా ఫిదా అయిపోయారు. అందుకే అతన్ని నైజాం బాద్‌ షా అంటున్నారంతా.

‘గీత గోవిందం’తో రూటు మార్చేశాడు

యారోగెంట్‌.. అనే ఇమేజ్‌ ‘అర్జున్‌రెడ్డి’ (Arjun Reddy) తో విజయ్‌ దేవరకొండకు (Vijay Devarakonda) వచ్చేసింది. అయితే ‘క్యూట్‌ అండ్‌ హ్యాండ్సమ్‌’ లుక్‌తో చేసిన ‘గీత గోవిందం’ సినిమాతో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) ఇమేజ్‌ పూర్తిగా మారిపోయింది. మన పక్కింటి కుర్రాడేనని అంతా విజయ్‌ దేవరకొండని ఇప్పుడు అభిమానిస్తున్నారంటే అదంతా ‘గీత గోవిందం’ (Geetha Govindam) సినిమాలోని అతని క్యారెక్టరైజేషన్‌ పుణ్యమే. పరశురామ్‌ దర్శకత్వంలో బన్నీ వాస్‌ నిర్మించిన ‘గీత గోవిందం’ సినిమా వసూళ్ళ ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది. 2018 జెన్యూన్‌ హిట్స్‌లో ‘గీత గోవిందం’ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.

బాక్సాఫీస్‌ షేకయిపోవాల్సిందే

ఇకపై బాక్సాఫీస్‌కి మరో కొత్త నాయకుడొచ్చాడని తెలుగు సినీ పరిశ్రమ భావిస్తోంది. ఓపెనింగ్స్‌, వసూళ్ళకు సంబంధించిన సరికొత్త రికార్డులు ఇకపై విజయ్‌ దేవరకొండ పేరు మీద కూడా రిజిస్టర్‌ కాబోతున్నాయి. ‘నోటా’ (NOTA) సినిమా తెలుగుతోపాటు, తమిళ ఆడియన్స్ నుంచీ మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది విడుదలకు ముందు. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పట్ల తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో భారీ అంచనాలేర్పడ్డాయంటే విజయ్ దేవరకొండ ఇమేజ్ ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.

కృషి, పట్టుదల కలిస్తే విజయ్‌ దేవరకొండ

సక్సెస్‌ ఆషామాషీగా వచ్చేయదు. ఆ సక్సెస్‌ని నిలబెట్టకోవడమూ ఆషామాషీ కాదు. ఈ సంగతి విజయ్‌ దేవరకొండకి బాగా తెలుసు. అందుకే, ‘రౌడీస్‌’ (Rowdies) గా తాను ముద్దుగా పిలుచుకునే తన అభిమానులకు ఏం కావాలో, తాను ఎలాంటి సినిమాలు చేయాలో అతనికి బాగా తెలుసు. చేసే ప్రతి సినిమా విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. వసూళ్ళ హంగామా గురించి పెద్దగా పట్టించుకోని ఈ యంగ్‌ హీరో, చేసే ప్రతి సినిమా కొత్తగా వుండాలని కోరుకుంటుంటాడు. అదే అతన్ని ఇప్పుడు ఈ స్థాయిలో నిలబెట్టింది.

ట్యాక్సీవాలా, కామ్రేడ్‌.. ఇంకా!

‘నోటా’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. దాంతోపాటుగా ‘కామ్రేడ్‌’ (Comrade) సినిమా ఒకటుంది. ‘ట్యాక్సీవాలా’ కూడా విడుదలకు సిద్ధంగానే వుంది.  ఇంకా లైన్‌లో చాలా సినిమాలే వున్నాయి. ‘అర్జున్‌ రెడ్డి’తో హిట్‌ కొట్టాక, ‘మహానటి’ సినిమాలో కీలక పాత్రలో కన్పించాడంటే కెరీర్‌ పట్ల విజయ్‌ దేవరకొండకి ఎంత చక్కటి ‘విజన్‌’ వుందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ డిక్షన్‌లో పక్కా ‘తెలంగాణ’ అన్పించేలా వున్నా, మనోడికి ప్రాంతాలకతీతంగా అభిమానులున్నారు. దటీజ్‌ విజయ్‌ దేవరకొండ.

యంగ్‌ హీరోల్లో నెంబర్‌ వన్‌ అనేయొచ్చు

స్టార్‌ హీరోల సరసన చేరిపోయాక, యంగ్‌ హీరోల్లో నెంబర్‌ వన్‌గా విజయ్‌ దేవరకొండని అభివర్ణించేయడం వింతమీ కాదు. అనూహ్యంగా బాక్సాఫీస్‌ షేకింగ్‌ స్టార్‌ అయిపోయిన విజయ్‌ దేవరకొండ, ఇకపై అగ్ర హీరోలకూ గట్టి పోటీ ఇవ్వబోతున్నాడు. అక్టోబర్‌లో ‘నోటా’ సినిమా విడుదల కానుంది. దసరా సీజన్‌ కావడంతో, పెద్ద సినిమాలు బరిలోకి దిగుతాయ్‌. ‘అరవింద సమేత’ వాటిల్లో ముఖ్యమైనది. విజయ్‌ పోటీ పడబోయేది యంగ్‌ టైగర్‌తో. గ్యాప్‌ కాస్త ఎక్కువే వున్నా, ‘గీత గోవిందం’ ప్రభంజనాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ‘అరవింద సమేత’ (Aravinda Sametha) కి ‘నోటా’ టఫ్‌ ఫైట్‌ ఇచ్చే అవకాశం లేకపోలేదనిపిస్తుంది.

Digiqole Ad

Related post

Leave a Reply