పొలిటికల్ ‘సైకిల్’: రాజకీయ నాయకులే.! శతృవులు కానే ‘కారు’.!

Chandrababu KTR
Chandrababu KCR KTR Politics.. రాజకీయం అంటే ఏంటి.? రాజకీయమంటే ప్రజా సేవ.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, కొందరు రాజకీయ నాయకులు రాజకీయానికి అర్థం మార్చేశారు.
ప్రస్తుత రాజకీయాల్లో రాజకీయమంటే కక్ష పూరిత వ్యవహారం.! ఆధిపత్య పోరు.! కులాల కుమ్ములాట. ప్రాంతాల మధ్య చిచ్చు. మతాల మధ్య రచ్చ.! ఇలా తయారైంది.
అందరూ అలాగే వున్నారా.? అంటే, చాలామంది అలాగే వున్నారు. కానీ, అలా వుండకూడదు. ఏం చేస్తాం.. రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయ్.!
Chandrababu KCR KTR Politics.. కేసీయార్‌కి చంద్రబాబు పరామర్శ..
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి సర్జరీ జరిగింది. తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స చేశారు వైద్యులు.
ఈ నేపథ్యంలో రాజకీయ వైరం పక్కన పెట్టి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీయార్‌ని ఆసుపత్రికి వెళ్ళి మరీ పరామర్శించారు.
తాజాగా, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా కేసీయార్‌ని ఆసుపత్రిలో పరామర్శించి, బాగోగులు తెలుసుకున్నారు.
చంద్రబాబు – కేసీయార్ మధ్య రాజకీయ వైరం గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఇద్దరి మధ్యా వ్యక్తిగత కక్షలున్నట్లు చెలరేగిపోయారు.
కాలం అన్ని గాయాల్నీ మాన్పుతుందని అంటారు. ఇప్పుడు అదే జరిగిందేమో.! రాజకీయాల్లో కావాల్సింది కూడా ఇదే.
కేటీయార్.. చంద్రబాబు.. ఖుషీ ఖుషీ..
పైన ఫొటోలో చూస్తున్నారు కదా.. తెలంగాణ మాజీ మంత్రి కేటీయార్, టీడీపీ అధినేత చంద్రబాబు.. ఎంత ఖుషీగా కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నారో.!
తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత ఇలాగే వుండాలి. రాజకీయ విమర్శలు తప్పు కాదు.! రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఖండనీయం.! వ్యక్తిగత విమర్శలు అత్యంత హేయం.!
కేసీయార్, చంద్రబాబు అనే కాదు.. వైఎస్ జగన్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా.. మరో రాజకీయ నాయకుడైనా.. అందరం తాము రాజకీయాల్లో వున్నది ప్రజా సేవ కోసమేనన్న సోయతో వుండాలి.!
