కొబ్బరి నీళ్ళు తాగితే కిడ్నీ సమస్యలా? నిజమేంటంటే.!
Sonal Chauhan Coconut
Coconut Water Kidney Diseases.. కొబ్బరి నీళ్ళు తాగారో మీ కిడ్నీలు మటాష్.! కొన్ని యూ ట్యూబ్ ఛానళ్ళలో ఈ తరహా థంబ్ నెయిల్స్ దర్శనమిస్తున్నాయ్.!
అసలేంటి కథ.? కొబ్బరి నీళ్ళు తాగితే, కిడ్నీలు పాడైపోతాయా.? అనారోగ్యం సంభవిస్తే, ముందుగా కొబ్బరి నీళ్ళనే కదా వైద్యులు సూచిస్తారు.?
ఔను, కొబ్బరి నీళ్ళు శరీరానికి శక్తినిస్తాయి. ఎండ వేడిమికి విలవిల్లాడుతున్నప్పుడు.. విరేచనాలతో శరీరం సత్తువను కోల్పోయినప్పుడూ.. కొబ్బరి నీళ్ళే దివ్యౌషధం.!
కొబ్బరి నీళ్ళతో కిడ్నీలకు ఎలాంటి సమస్యా లేదుగానీ..
నిజమేంటంటే, కొబ్బరి నీళ్ళ కారణంగా కిడ్నీలకు ఎలాంటి హానీ జరగదు. ఈ విషయాన్ని వైద్య నిపుణులు కుండ బద్దలుగొట్టి మరీ చెబుతున్నారు.
అయితే, కొబ్బరి నీళ్లతో ఓ చిక్కుంది. కిడ్నీలు పాడైనవారు కొబ్బరి నీళ్ళకు దూరంగా వుండాలి. నిజానికి, ఏ నీళ్ళకైనా దూరంగా వుండాల్సిందే.
ఏదైనా, వైద్య నిపుణులు చెబుతారు.. ఏది మంచిది.? ఏది చెడు.? అన్నది. కిడ్నీలో రాళ్ళు ఏర్పడితే, కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా వుండమని చెబుతారు.
టమాటా కావొచ్చు, పాలకూర కావొచ్చు.. కిడ్నీలో ఏర్పడే రాళ్ల రకాన్ని బట్టి, వాటి వాడకం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు.
Coconut Water Kidney Diseases.. వైరల్ కంటెంట్.. జనం బెంబేలు..
అసలు విషయం వేరు, యూ ట్యూబ్ థంబ్ నెయిల్స్‌లో కనిపించేది వేరు.! ఇలాంటి థంబ్ నెయిల్స్ కారణంగా గబుక్కున కంగారుపడిపోవడం మానవ సహజం.
ఏ చిన్న అనారోగ్య సమస్య అయినా, వైద్యుడ్ని సంప్రదించడం ఉత్తమం. ఎలాంటి అనుమానం వున్నా, వైద్యుడితో మాట్లాడి, ఆయా అనుమానాలకు నివృత్తి చేసుకోవాలి.
కొబ్బరి నీళ్ళలో వుండే లవణాల్ని, పాడైపోయిన కిడ్నీలు ఫిల్టర్ చేయలేవు. తద్వారా కిడ్నీ బాధితులు కొబ్బరి నీళ్ళు తాగితే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
అంతే తప్ప, కొబ్బరి నీళ్ళ వల్ల కిడ్నీ జబ్బులు రావన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సి వుంటుంది.
అధిక బరువు, డయాబెటిస్ అలాగే హైపర్ టెన్షన్.. ఇలాంటివన్నీ కిడ్నీ సమస్యలకు ప్రధాన కారణాలు. జంక్ ఫుడ్ కూడా ప్రమాదకరమే.!
కల్తీ కల్తీ కల్తీ…
తల్లిపాలని మాత్రమే కల్తీ చేయలేం.. అన్నది ఒకప్పటి మాట.! మనం తినే తిండి కలుషితమైపోయినప్పుడు.. మన శరీరం కూడా కలుషితమైపోయినట్టే కదా.!
Also Read: ఆకాశమంత ప్రేమ.! ఒక్క రోజు సరిపోద్దా.?
అలాగే, కొబ్బరి చెట్లకీ రకరకాల మందులు వేసి పెంచేస్తున్నాం. వాటిల్లో ప్రమాదకరమైన పెస్టిసైడ్స్ కూడా వుంటున్నాయ్. వాటి కారణంగా, కొబ్బరి నీళ్ళు కూడా కలుషితమవుతున్నాయన్నదాంట్లో వాస్తవం లేకపోలేదు.!
అందుకే, అతి సర్వత్ర వర్జయేత్.! ఏదైనా మితంగానే.. పరిమితంగానే వాడాల్సి వుంటుంది.