తప్పెవరిది.? శ్రీలీలదా.? దర్శకులదా.?
Danger Bells For Sreeleela.. రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ అయిపోయింది శ్రీలీల.! తొలి సినిమా నిరాశపర్చింది.! అదే ‘పెళ్ళి సందడి’.!
ఆ తర్వాత ‘ధమాకా’ సినిమాతో శ్రీలీల అనూహ్యమైన స్టార్‌డమ్ సంపాదించుకుంది. ఇంతకీ, ఆ సినిమాలో శ్రీలీల చేసిందేముందబ్బా.? అనడక్కండి.. అదంతే.!
శ్రీలీల అందంగా వుంటుంది.. డాన్సులు బాగా చేస్తుంది.! అందంగా వుండటమొక్కటే క్వాలిఫికేషన్ కాదు హీరోయిన్ అవడానికి. డాన్సులు కూడా కాదు.!
నటన.. కానీ, అది శ్రీలీలలో మచ్చుకైనా కనిపించదు.! ఏదో అలా అలా మేనేజ్ చేసేస్తుందంతే.! చాలామంది హీరోయిన్లతో పోల్చితే, శ్రీలీలను మరీ అంతగా తీసెయ్యలేం.
Danger Bells For Sreeleela.. పిచ్చితనం.. పిల్లతనం.. ఇంకెన్నాళ్ళు.?
కానీ, శ్రీలీల అంటే తెరపై పిచ్చితనం.. అనే భావనలో వున్నారు దర్శకులు. అనిల్ రావిపూడి, కాస్త భిన్నమైన పాత్రలో శ్రీలీలను ‘భగవంత్ కేసరి’ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు.
అంతే.! అంతకు మించి ఇప్పటిదాకా ఇంకేమీ చేసింది లేదు శ్రీలీల నటిగా.! ‘ఆదికేశవ’ సినిమా చూసినా, ‘గుంటూరు కారం’ సినిమా చూసినా, ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా చూసినా.. అన్నిట్లోనూ ఒకటే రొట్ట కొట్టుడు.
శ్రీలీల డాన్సులు చూస్తే, భలే కష్టపడుతోంది కదా.. అనిపిస్తుంది. అంతలా కష్టపడి డాన్స్ చేయాల్సిన పనేముంది.? అన్లేం.!
డాన్స్ వేస్తే ఈజ్ కనిపించాలి.. కష్టం కనిపించకూడదు.! శ్రీలీల ఈ విషయంలో కాస్త జాగ్రత్త పడితే మంచిది. సాయి పల్లవి చాలా మంచి డాన్సర్.. ఆమె డాన్స్‌లో అందం వుంటుంది.
బోర్.. బోర్.. బోర్..
నిజానికి, శ్రీలీల డాన్సుల్లో అందం కనిపించడం లేదు.! ఇటు నటనలోనూ శ్రీలీల పరమ బోర్ కొట్టించేస్తోంది.
బ్యాక్ టు బ్యాక్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులకు సంతకం చేసేసింది. అవన్నీ వచ్చేస్తున్నాయ్.. పోతున్నాయ్.!
ఛాన్సులు రావడం గొప్ప కాదు, నటిగా ఏం ముద్ర వేయగాలిగాం అన్నది ముఖ్యమిక్కడ. శ్రలీల ఆ విషయంలో జస్ట్ జీరో అనిపించుకుంటుందా.?
Also Read: ప్రియమ్.! అందాల ‘ప్రకాశ’మ్.! గ్లామరస్ ‘వారియర్’.!
ఇంకా చాలా వయసుందామెకి. లోటుపాట్లను సరిచేసుకుంటే, మంచి నటిగా ప్రూవ్ చేసుకోవచ్చు.
దర్శకులూ, కేవలం శ్రీలీలకి వచ్చిన స్టార్‌డమ్‌ని మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా, ఆమెతో మంచి మంచి సినిమాలు చేయిస్తే.. వాళ్ళకే మంచిది.