రివ్యూ: డియర్‌ కామ్రేడ్‌

359 0

సినిమా టైటిల్‌: డియర్‌ కామ్రేడ్‌ (Dear Comrade Review Rating)
నటీనటులు: విజయ్‌ దేవరకొండ, రష్మిక మండన్న, శృతి రామచంద్రన్‌, సుహాస్‌, చారు హాసన్‌, ఆనంద్‌ తదితరులు.
సినిమాటోగ్రఫీ: సుజిత్‌ సారంగ్‌
సంగీతం: జస్టిన్‌ ప్రభాకరన్‌
ఎడిటింగ్‌: శ్రీజిత్‌ సారంగ్‌
రచన, దర్శకత్వం: భరత్‌ కమ్మ
నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌
నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, మోహన్‌ చెరుకూరి, యష్‌ రంగినేని
విడుదల తేదీ: 26 జులై 2019
రేటింగ్‌: 3/5

ముందుగా..

అతి తక్కువ కాలంలోనే యూత్‌ ఐకాన్‌గా మారిపోయాడు విజయ్‌ దేవరకొండ. సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌కి చాలా చేరువైపోయిన విజయ్‌ దేవరకొండ నుంచి ఏ సినిమా వచ్చినా, ఆ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో వుండడం చాలా కామన్‌ అయిపోయింది. ‘అర్జున్‌ రెడ్డి’ ఛాయలు కన్పిస్తుండడం, ‘గీత గోవిందం’ కాంబినేషన్‌.. వెరసి, ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేశాయి. రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కూడా జరిగిపోయింది. తెలుగుతోపాటు కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదలయిన ‘డియర్‌ కామ్రేడ్‌’ ఎలాంటి టాక్‌ సంపాదించుకుందో తెలుసుకుందాం పదండిక..

కథేంటి.? (Dear Comrade Review Rating)

హీరో చైతన్యకి కోపమెక్కువ. విప్లవ భావాలున్న వ్యక్తి. అతని ముద్దు పేరు బాబీ. ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తాడు. ఈ క్రమంలో ఎవరితోనైనా గొడవకి వెనుకాడడు. ఆ ఆటిట్యూడ్‌ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెడుతుంటుంది. మరోపక్క, అపర్ణాదేవి అలియాస్‌ లిల్లీ (రష్మిక మండన్న)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమె ఓ క్రికెటర్‌.

లిల్లీ చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి వుంటుంది. బాబీతో ప్రేమలో పడుతుందిగానీ.. అతని రగ్‌డ్‌ ఆటిట్యూడ్‌ని తట్టుకోలేకపోతుంది. ఇద్దరి మధ్యా దూరం పెరిగిపోతుంది, విడిపోతారు కూడా. కొంత కాలం తర్వాత లిల్లీ జీవితంలోకి బాబీ వస్తాడు. కానీ, అప్పటికే ఆమె సమస్యల్లో ఇరుక్కుంటుంది. మరి, బాబీ ఆమెను ఆదుకున్నాడా.? బాబీ తన మనస్తత్వాన్ని మార్చుకున్నాడా.? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎవరెలా చేశారు.? (Dear Comrade Review Rating)

విజయ్‌ దేవరకొండ, అర్జున్‌ రెడ్డి సినిమాలో ఆటిట్యూడ్‌ కా బాప్‌ (Dear Comrade Review Rating) అనిపించేశాడు. సో, ఇందులో అతను కొత్తగా చేసిందేమీ లేదని అన్పించడం మామూలే. అయితే, అదొక్కటే కాదు.. ప్రతి భావాన్నీ చాలా అద్భుతంగా పండించాడు. ఆన్‌ స్క్రీన్‌ విజయ్‌ దేవరకొండ ఎనర్జీ సూపర్బ్‌. ఆ ఎనర్జీ ఇందులో కూడా కన్పిస్తుంది. తానెలా వుంటే యూత్‌కి కనెక్ట్‌ అవుతాడో విజయ్‌ దేవరకొండకి బాగా తెలుసు. అందుకే, ఎంచుకునే సినిమాలపై తన ముద్ర వుండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వరుస విజయాలు అందుకుంటున్నాడు కూడా. భిన్న రకాలైన షేడ్స్‌ వున్న పాత్రలో విజయ్‌ ఒదిగిపోయిన వైనం ఆకట్టుకుంటుంది.

హీరోయిన్‌ రష్మిక మంచి నటి. ఆ విషయం ఆమె నటించిన పలు సినిమాలతో ప్రూవ్‌ అయ్యింది. ఈ సినిమా కోసం తాను చేయాల్సిందంతా చేసింది. అయితే, పాత్రని దర్శకుడు డిజైన్‌ చేసిన తీరుని, అందులో రష్మికనీ పోల్చి చూస్తే.. ఆమె ఇంకా బెటర్‌గా చేసి వుంటే బావుండేదేమో అన్పిస్తుంది. విజయ్‌తో ఆల్రెడీ చేసి వుండడంతో ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అయ్యింది. తెరపై విజయ్‌కి సరిజోడీగా కనిపించింది రష్మిక.

ఇదిలా వుంటే రష్మిక అక్క పాత్రలో శృతి రామచంద్రన్‌ బాగా చేసింది. సంజయ్‌ స్వరూప్‌, శ్రీకాంత్‌ అయ్యర్‌, ఆనంద్‌ తదితరులు తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు. మిగతా పాత్రధారులంతా సినిమా గమనంలో తమదైన ముద్ర వేసేందుకు ప్రయత్నించారు.

టెక్నికల్‌ సపోర్ట్‌..

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, సినిమాటోగ్రఫీతోపాటు మ్యూజిక్‌ కూడా బాగా స్కోర్‌ చేసింది. సినిమాటోగ్రఫీ అయితే టాప్‌ క్లాస్‌. పాటలు వినడానికే కాదు, తెరపై చూడ్డానికీ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ సినిమా మూడ్‌కి తగ్గట్టుగా వుండి సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ సహా అన్ని విభాగాలూ దర్శకుడికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించాయి.

అయితే ఎడిటింగ్‌ విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని వుండాల్సింది. సాగతీతగా అన్పించే సన్నివేశాలకు కత్తెర వేటు సరిగ్గా పడి వుంటే, సినిమా ఇంకాస్త రేసీగా సాగేదేమో. ఓవరాల్‌గా టెక్నికల్‌ సౌండ్‌ గట్టిగానే వుంది ఈ సినిమాకి. నిర్మాణపు విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదు. సినిమాలో డైలాగ్స్‌ చాలా చోట్ల ప్రేక్షకుడ్ని కట్టి పడేస్తాయి. యాక్షన్‌ సీక్వెన్సెస్‌ బావున్నాయి.

ప్లస్సులు
విజయ్‌ దేవరకొండ, రష్మిక మండన్న.. ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ
కథా నేపథ్యం, సంగీతం, సినిమాటోగ్రఫీ

మైనస్‌లు
సాగతీత అన్పించే సన్నివేశాలు
కథనం

విశ్లేషణ (Dear Comrade Review Rating)

ఇలాంటి సినిమాలు తెలుగు తెరకు కొత్త కాదు. కోపిష్టి అయిన హీరోతో వేగలేక హీరోయిన్‌ సతమతమవడం, ఆ తర్వాత హీరోయిన్‌, హీరోలో మార్పు కోసం ప్రయత్నించడం.. హీరోయిన్‌ని హీరో అర్థం చేసుకోవడం.. ఇవన్నీ చాలా సినిమాల్లో చూశాం. ఇంచుమించు ఈ సినిమాలో కూడా అలాంటి పరిస్థితే హీరో, హీరోయిన్ల మధ్య వస్తుంది. దానికి ఓ బర్నింగ్‌ ఇష్యూని జోడించాడు దర్శకుడు. ప్లాట్‌ ఇంట్రెస్టింగ్‌గా వున్నా, అసలు కథని సెకెండాఫ్‌ చివరి వరకూ దాచి పెట్టడంలో ఆంతర్యమేంటో అర్థం కాదు. అదే సినిమాకి పెద్ద మైనస్‌ అయ్యింది.

విప్లవ భావాలున్న వ్యక్తి, సగటు సరదా కుర్రాడిలా ఎలా వ్యవహరిస్తాడు? అన్న లాజిక్‌ని మర్చిపోవడం కష్టంగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్లు విడిపోవడానికి బలమైన భావోద్వేగభరితమైన సన్నివేశాలు చూపించలేకపోయాడు దర్శకుడు. కథనం విషయంలో దర్శకుడు వేసిన తప్పటడుగులు సినిమాకి మైనస్‌గా మారాయి. మేజర్‌ ఇష్యూని డీల్‌ చేసే క్రమంలో, దాని తాలూకు ఇంపాక్ట్‌ మొదటి నుంచీ సినిమాలో వుండేలా చూసుకుంటే.. ఇంకా డెప్త్‌ కన్పించేది.

ఫస్టాఫ్‌లో అలా అలా నడిచిపోయిన సినిమా, సెకెండాఫ్‌లో కొంత స్లో అయినట్లనిపిస్తుంది.. అసలు కథ మొదలయ్యాక, కథలో వేగం కనిపించినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందనిపిస్తుంది. విజయ్‌ దేవరకొండ, రష్మికల నటన, ఇద్దరి మధ్యా ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ, వీరిద్దరికీ యూత్‌లో వున్న క్రేజ్‌.. ఇవే ఈ సినిమా ఫలితాన్ని డిసైడ్‌ చేస్తాయి.

ఫైనల్‌ టచ్‌: డియర్‌ కామ్రేడ్‌.. కొంచెం సాగతీత బ్రదర్‌.!

Related Post

రౌడీ హీరో.. బాక్సాఫీస్ బంగారు కొండ.!

Posted by - May 9, 2019 0
విజయ్‌దేవరకొండ.. (Vijay Deverakonda Rowdy Hero) చిన్న సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. పెద్ద సంచలనంతో స్టార్‌ హీరోగా ఎదిగాడు. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ అనే పేరు…
2 point 0 review

రివ్యూ అండ్‌ రేటింగ్‌: 2.0 విజువల్‌ ఫీస్ట్

Posted by - November 29, 2018 0
సినిమా టైటిల్‌: 2.0 నటీనటులు: రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌, అమీ జాక్సన్‌, సుధాన్షు పాండే, ఆదిల్‌ హుస్సేన్‌, కళాభవన్‌ షాజాన్‌, రియాజ్‌ ఖాన్‌ తదితరులు. సినిమాటోగ్రఫీ: నిరవ్‌ షా…

టీజర్‌ రివ్యూ: ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’

Posted by - October 29, 2018 0
మాస్‌ మహరాజ్‌ రవితేజ (Mass Maharaj Raviteja) హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ని…

‘డాంగ్‌ డాంగ్‌..’ మహేష్‌, తమన్నా కుమ్మేశారంతే..

Posted by - December 29, 2019 0
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) సినిమా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానున్న…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *