ఏంటి వినాయక్.! నువ్వింకా బతికే వున్నావా.?

 ఏంటి వినాయక్.! నువ్వింకా బతికే వున్నావా.?

Chiranjeevi Vassishta Vinayak

Director Vinayak Health Condition.. అరరె.! ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ బతికే వున్నాడే.! ఇప్పుడెలా.? కొన్ని మీడియా సంస్థలు ఇలాగే గింజుకుంటున్నాయ్.

ఎలాగైతేనేం, దర్శకుడు వి.వి. వినాయక్ బాగానే వున్నాడు. ఎట్టకేలకు బయటకు వచ్చిన ప్రముఖ దర్శకుడు.! అంటూ నీరసంగా వార్తలు రాసేసుకున్నాయి సదరు మీడియా సంస్థలు.

గాలి పోగేసిన రోత రాతలతో చంపేశాం కదా.? ఆ రోత రాతల్లో తాము చంపేసిన సెలబ్రిటీ, ఎక్కడన్నా తారసపడితే ఓర్చుకోలేనంత అధమ స్థాయికి మీడియా ముసుగేసుకున్న మాఫియా దిగజారిపోయింది.

Mudra369

నిజమే.! చావుకి మీడియాలో వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.! హత్య అంటే సరిపోదు, దారుణ హత్య.. అత్యంత కిరాతకంగా జరిగిన హత్య.. అని బిగ్ బ్రేకింగులు ఇచ్చేసుకోవాలి.

రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వార్తలు, హత్యలకు సంబంధించిన వార్తల్ని మీడియాలో చూసి కొందరు పైశాచికానందం పొందుతుంటారు.

మీడియాకి ఎందుకీ పైశిచాకంనదం..

అదే పైశిచాకానందం, మీడియా సంస్థలకీ పట్టుకుంది. అందుకే, నేర పూరిత కథనాలకు మీడియా స్పెషల్ స్పేస్ కేటాయిస్తోంది.

ఇక, సెలబ్రిటీల అనారోగ్య సమస్యల మీద మీడియాకి ఎంత ప్రత్యేక శ్రద్ధ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

షూటింగ్ స్పాట్‌లో లైట్ల తీవ్రత వల్ల కావొచ్చు.. ఎక్కువ టేక్‌ల వల్ల కావొచ్చు.. నటీమణులెవరైనా నీరసించి పడిపోతే, వాళ్ళకి ‘కడుపొచ్చింది’ అంటూ గాలి వార్తలు ప్రచారంలోకి తెచ్చే మాఫియా, మీడియా ముసుగులో వెకిలితనం ప్రదర్శిస్తోంది.

Mudra369

ఏదన్నా అనారోగ్య సమస్యతో ఏ సెలబ్రిటీ అయినా ఆసుప్రతికి వెళితే చాలు.. అడ్డగోలుగా కథనాలు వండి వడ్డించేయడమే.

కొన్ని మీడియా సంస్థలైతే తొందరపడి, తమ వార్తల్లో ఆయా సెలబ్రిటీల్ని చంపేస్తుంటాయి. ఎందుకీ పైత్యం.? అంటే, ఇది పైత్యం కాదు.. పైశిచాకనందం.

వి.వి. వినాయక్ విషయంలోనే కాదు, గతంలో సునీల్ విషయంలో కూడా ఇదే జరిగింది. సీనియర్ నటులు చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు.. చెప్పుకుంటూ పోతే, లిస్టు పెద్దదే వుంటుంది.. అంతా, మీడియా తన పైశిచాకనందాన్ని ప్రదర్శించింది.

Director Vinayak Health Condition.. మనిషన్నాక అనారోగ్య సమస్యలు తప్పవ్ కదా.!

మనిషన్నాక కడుపు నొప్పో.. కాలు నొప్పో.. రావడం సహజమే కదా.! మానసిక సమస్యల సంగతి సరే సరి.! చిన్న పిల్లలకే బీపీలు, షుగర్లు.! క్యాన్సర్ల సంగతి సరే సరి.

అత్యాధునిక వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయ్. అదే సమయంలో, వేగంగా సన్నబడేందుకూ రకరకాల చికిత్సల్ని ఆశ్రయిస్తున్నారు సెలబ్రిటీలు.

Also Read: ఎర్నలిస్ట్ కాంతమ్.. ఎన్ని వందల కోట్ల నెత్తుటి కూడు తిన్నావ్.?

ఈ సన్నబడే ప్రక్రియలో కొన్ని అనారోగ్య సమస్యలు సెలబ్రిటీల్ని ఇబ్బంది పెడుతున్నమాట వాస్తవం. ఇతరత్రా అనారోగ్య సమస్యలతోనూ సెలబ్రిటీలు సామాన్యుల్లానే ఇబ్బందులు పడుతుంటారు.

అంతమాత్రాన, తీవ్ర అనారోగ్యం.. మృత్యువుతో పోరాడుతున్న.. అంటూ సెలబ్రిటీల్ని మీడియా ఈ దిక్కుమాలిన గాసిప్పులతో వేధించడమేంటో.!

సాధారణ వైద్య చికిత్సల నిమిత్తం సినీ ప్రముఖులెవరైనా ఆసుపత్రికి వెళితే గుండె పోటుతో చనిపోయారనే దుష్ప్రచారాలు చేయడం పాత్రికేయ వ్యభిచారానికి వెన్నతో పెట్టిన విద్యలా మారిపోయింది.

Mudra369

సదరు సెలబ్రిటీలు తమ కుటుంబానికి చెందినవారని ఒక్కసారి అనుకుంటే, ఈ దరహా పైశాచికానందం.. ఏ ‘వార్త’లోనూ కనిపించదు.

చివరగా: హెడ్డింగ్ అంత దారుణంగా పెట్టినందుకు పాఠకులు క్షమించాలి.! మీడియాలో ఈ పైశాచికానందాన్ని ప్రస్తావించే క్రమంలోనే.. ఇలా ‘గీత’ దాటాల్సి వచ్చింది.

Digiqole Ad

Related post