వేల కోట్ల రాజకీయం: ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం!
Electoral Bonds Political Corruption.. రాజకీయమంటే సేవ.! అది ఒకప్పటి మాట.! ఇప్పుడేమో, రాజకీయమంటే లాభసాటి వ్యాపారం.!
రాజకీయాల్లో వచ్చినంత లాభం మరే ఇతర వ్యాపారంలోనూ రాదన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన.! పైకి గట్టిగా చెప్పలేరుగానీ, రాజకీయ నాయకులందరి మాటా ఇదే.!
భారతీయ జనతా పార్టీకి 6,500 కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్ బాండ్లు లభిస్తే, కాంగ్రెస్ పార్టీ వాటా దాదాపు 1100 కోట్లు.
పశ్చిమబెంగాల్‌లో అధికారంలో వున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో లభించాయ్.
Electoral Bonds Political Corruption.. తెలుగు రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి..
తెలుగు రాష్ట్రాల్లో భారత్ రాష్ట్ర సమితి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెరో 380 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లను పొందాయ్.! టీడీపీ వాటా 145 కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్ బాండ్లు.!
రాజకీయాల్లో పారదర్శకత కోసమే ఈ ఎలక్టోరల్ బాండ్లను తీసుకొచ్చామని కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ చెబుతోంది.
దేశంలో పేద ప్రజలున్నారేమోగానీ.. పేద రాజకీయ నాయకులుండరు.! పేద రాజకీయ పార్టీలు అసలే వుండవ్.!
ఎందుకుంటాయ్.? అవినీతిని ఇదిగో, ఇలాంటి మార్గాల్లో వ్యవస్థీకృతం చేసేసి.. అందినకాడికి దోచుకుంటోంటే.. పేదలతో రాజకీయాలు తప్ప, పేద రాజకీయ పార్టీలు.. పేద రాజకీయ నాయకులు.. అన్న ప్రస్తావనే దండగ.!
Mudra369
కానీ, సర్వోన్నత న్యాయస్థానం ఎలక్టోరల్ బాండ్లను రాజ్యాంగ విరుద్ధమైన వ్యవహారంగా తేల్చి పారేసింది. తక్షణం ఈ ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారాన్ని నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
రాజకీయం అన్నాక ఖర్చులుంటాయ్.. రాజకీయ పార్టీలన్నాక ఖర్చులు తప్పవు కదా.! సో, నిధుల సమీకరణ చేసుకోవాల్సిందే.
గెలిచేటోడికీ.. ఓడేటోడికీ..
ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో, కార్పొరేట్ శక్తుల దగ్గర్నుంచి, ఓ మోస్తరు వ్యాపారవర్గాల వరకు.. తాయిలాలు ఇచ్చుకుంటూ వెళతాయ్.
చిత్రమేంటంటే, గెలుస్తుందనుకున్న పార్టీకి వంద ఇస్తే, గెలిచే అవకాశం లేదన్న పార్టీకి పదో, పాతికో ఇస్తుంటారు. కోట్లలో సుమీ.!
Also Read: పెళ్ళిళ్ళు.. రాజకీయ పొత్తులు.! పాత్రికేయ వ్యభిచారులు.!
అంటే, గెలిచే పార్టీతోపాటు.. ఓడే పార్టీకి సైతం నిధులు ఇస్తుంటారన్నమాట బాగా బలిసినోళ్ళు. ఇదే రాజకీయమంటే.! వందల కోట్ల విరాళాలు ఎందుకు ఇస్తుంటారబ్బా.?
ఇంకెందుకు.? తమకు అనుకూలంగా ప్రాజెక్టులు వస్తాయని కార్పొరేట్ శక్తులు పన్నే పన్నాగమిది.! అర్థమయ్యింది కదా.. అదీ అసలు సంగతి.
అంతా ధనస్వామ్యమే..
ఇంకెక్కడ ప్రజాస్వామ్యం.? ఇక్కడున్నదంతా రాజకీయ ధనస్వామ్యమే కదా.! అన్నట్టు, ఎలక్టోరల్ బాండ్ల ప్రక్రియలో, ఎవరు విరాళాలు ఇస్తున్నదీ బయటపడే అవకాశం లేదు.
అంటే, ఇవన్నీ సీక్రెట్ విరాళాలన్నమాట. ఇంతకన్నా మోసం ఇంకేముంటుంది.? అందుకే, సర్వోన్నత న్యాయస్థానం ఈ మొత్తం వ్యవహారం విషయమై కేంద్రానికి మొట్టికాయలు వేసింది.
సార్వత్రిక ఎన్నికల ముందర దేశంలో అత్యంత కీలకమైన.. సంచలనాత్మక వ్యవహారమిది.! 6,500 కోట్ల రూపాయలంటే, ఓ పెద్ద ప్రాజెక్టు కట్టేయొచ్చు!
వెయ్యి కోట్లంటే.. అబ్బో, అది చిన్న విషయమేమీ కాదు.! రాజకీయ పార్టీలు ప్రజల కోసం పని చెయ్యాలి.. కార్పొరేట్ శక్తులు విదిల్చే బిచ్చం కోసం పనిచేస్తే ఎలా.?