కారు లాంటి విమానం.! ఎగిరే ‘విద్యుత్’ ట్యాక్సీ.! వచ్చేస్తోంది.!

 కారు లాంటి విమానం.! ఎగిరే ‘విద్యుత్’ ట్యాక్సీ.! వచ్చేస్తోంది.!

Flying Taxi

Electric Flying Taxi.. మన కారు గాల్లో అలా అలా ఎగురుతూ వుంటే ఎంత బావుంటుంది.! ట్రాఫిక్ సమస్యే వుండదు కదా.!

నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతిసారీ, సగటు ‘కారు జీవి’కి ఇదే భావన కలుగుతుంటుంది.! ఏమో, త్వరలోనే అలా మన కార్లూ గాల్లో ఎగురుతాయేమో.!

హ్యుందాయ్ సంస్థ, కొత్తగా.. సరికొత్తగా ఎగిరే ట్యాక్సీని ఆవిష్కరించింది. ఓ నలభై యాభై కిలోమీటర్ల దూరం ప్రతిరోజూ ప్రయాణించేవారికి ఈ ట్యాక్సీ ఉపయోగపడుతుందట.

గంటకు దాదాపు 200 కిలోమీటర్ల వేగంతో ఈ విద్యుత్ శక్తి ఆధారాత ట్యాక్సీ దూసుకెళుతుంది. 1500 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుందట.

Electric Flying Taxi.. పైలట్టూ.. ఓ నలుగురు ప్రయాణీకులూ.!

కారు డ్రైవర్ (అదేనండీ పైలట్) సహా నలుగురు ప్రయాణీకులు ఈ ట్యాక్సీలో ప్రయాణించొచ్చు. ఎనిమిది రోటర్లు ఈ ట్యాక్సీని గాల్లో ఎగిరేలా చేస్తాయ్.

హెలికాప్టర్ తరహాలో వర్టికల్ ల్యాండింగ్, టేకాఫ్ ఈ ట్యాక్సీ ప్రత్యేకత. శబ్ద తీవ్రత కూడా పెద్దగా వుండదట. ప్రయాణీకుల భద్రత విషయంలో అస్సలేమాత్రం రాజీ పడలేదని హ్యుందయ్ సంస్థ చెబుతోంది.

హుందాయ్ గ్రూపుకి చెందిన అడ్వాన్స్‌డ్ ఎయిర్ మొబిలిటీ కంపెనీ సూపర్ నల్ ఈ ట్యాక్సీని తయారు చేసింది.

2024 కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో వేదికగా ఈ ట్యాక్సీ మోడల్‌ని హ్యుందయ్ మోటర్స్ ఆవిష్కరించింది.

Also Read: Covid JN1 Variant: భయపడొద్దంటే.! ప్రాణాలు పోయినా ఫర్లేదా.!

పేరుకు ట్యాక్సీయేగానీ, నిజానికి ఇది కారు కాదు. కారు లాంటి విమానం.! అంతర్జాతీయ స్థాయి విమానయాన ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఎగిరే ట్యాక్సీలో ఫీచర్స్ వుంటాయట.

అంతా బాగానే వుందిగానీ, రోడ్డు మీద పెరిగినట్లే, గాల్లోనూ ట్రాఫిక్ పెరిగిపోతేనో.! మనం మనుషులం కదా.. అస్సలు తగ్గేదే లే.! ఎక్కడైనా ట్రాఫిక్ సమస్యలు సృష్టించేయగలం.!

ఇప్పటికే కుప్పలు తెప్పలుగా పెరుగుతున్న విమాన సర్వీసులతో ఎయిర్ ట్రాఫిక్ కూడా ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఎగిరే ట్యాక్సీలు కూడా అంటే, ఎగిరే కార్లు అందరికీ అందుబాటులోకి వచ్చేస్తే అంతే సంగతులు.!

కాదేదీ ట్రాఫిక్కుకి అనర్హం మరి.!

Digiqole Ad

Related post