జోకర్ మాయ్య: ఈవీఎమ్.. ఎలాన్ మస్క్.. ఇదో ఫన్నీ టాస్క్.!

 జోకర్ మాయ్య: ఈవీఎమ్.. ఎలాన్ మస్క్.. ఇదో ఫన్నీ టాస్క్.!

Elon Musk EVM India.. మీకు తెలుసా.? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు ట్యాంపరింగ్‌కి గురయ్యాయట.! వాటిని ఎవరో హ్యాకింగ్ చేసేశారట.! ఓటీపీ ద్వారా ఫలితాన్ని మార్చేశారట.!

ఇంతకీ ఎవరు చెప్పారు.? ఎవరూ చెప్పలేదు, వాళ్ళే అనుకున్నారు.! ఎవరు వాళ్ళు.. ఇంకెవరు, ఓడినోళ్ళు.!

అయినా, ఇదేమన్నా కొత్త కథా.? ఓడిన ప్రతిసారీ, తమ చేతకానితనాన్ని ఒప్పుకోలేని రాజకీయ నాయకులు, పార్టీలు.. చెప్పే పాత కథే ఇది.!

ఓడినోడు ఈవీఎంల మీద పడి ఏడుస్తాడు.. వాడే, మళ్ళీ గెలిచాక ఈవీఎంలలో లోపాలేం లేవని అంటాడు.! ఓడితే, ఈవీఎంలది పాపం.. గెలిస్తే, వాడి ఘనత అన్నమాట.!

Elon Musk EVM India.. మస్క్ మాయ్యకి ఏమొచ్చింది.?

అర్థమయ్యిందా రాజా.? ఇంతకీ, ఈ లొల్లిలోకి మస్క్ మాయ్య.. అదేనండీ, ఎలాన్ మస్క్ (Elon Musk) ఎందుకు వచ్చినట్లు.?

ఈవీఎంలు హ్యాకింగ్ అయ్యే అవకాశముందంటూ తన, ఎక్స్.. అదేనండీ, ఒకప్పటి ట్విట్టర్ వేదికగా, తాజాగా ఓ బాంబు పేల్చాడు ఎలాన్ మస్క్.

చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశాడట.! ఏంటీ, ప్రతిపక్ష నేతగా అది ఆయనకి సాధ్యమయ్యే పనేనా.? సాధ్యమైతే, ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, 2019 ఎన్నికల్లోనే చేస్తాడు కదా.?

Mudra369

మధ్యలో ఈ బోడిగాడెవడు.? అని, చాలామంది విసుక్కుంటున్నారు. నిజమే మరి.! భారత ఎన్నికల వ్యవస్థ మీద, ఎవడో బోడిగాడు ఓ కామెంట్ పాస్ చేసేస్తే ఇలాగే కౌంటర్ ఎటాక్ వస్తుంది.

నేరుగా భారత ఎన్నికల వ్యవస్థ మీద ఎలాన్ మస్క్ కామెంట్స్ చేయలేదుగానీ, ఈవీఎం హ్యాకింగ్ మీద మస్క్ మాయ్య వేసిన కామెంట్లు, పరోక్షంగా భారత ఎన్నికల వ్యవస్థ మీదనే.!

మళ్ళీ బ్యాలెట్టుకి పోదామా రాజా.?

సపోజ్.. ఫర్ సపోజ్.. ఈవీఎంలు వద్దు, పేపర్ బ్యాలెట్టుకే మళ్ళీ వెళదామా.? అంటే, ఒకప్పటి రిగ్గింగ్ పాపాల్ని అంత తేలిగ్గా ఎలా మర్చిపోగలం.?

బ్యాలెట్ బాక్సుల్ని ఎత్తుకుపోవడం, వాటిల్లో ఇంకు పోసెయ్యడం.. అబ్బో, నానా ఛండాలం జరిగేది ఒకప్పుడు. సరే, ఇప్పుడు ఈవీఎంల కాలంలోనూ అక్రమాలున్నాయ్ కదా.. అంటే, అది మళ్ళీ వేరే చర్చ.

ఏం, ప్రధాని నరేంద్ర మోడీ చెయ్యలేకనా.? బీజేపీ ఎందుకు నానా తంటాలూ పడి, మిత్రపక్షాల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తోంది.? ఈవీఎం హ్యాకింగ్ చేయగలిగితే, మొత్తం అన్ని సీట్లలోనూ బీజేపీనే గెలిచేది కదా.?

Mudra369

చూశాం కదా, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ప్రజా ప్రతినిథి, ఈవీఎంని నేలకేసి కొట్టాడు నిర్లజ్జగా.! ‘ఆ చెత్త వెధవకీ తెలుసు, అలాంటి ఈవీఎంలలో జనం ఓట్లు వేస్తే తాను గెలిచానని..’ అంటూ జనం చీత్కరించుకోవడం కూడా తిలకించాం.!

Also Read: మేతావి ‘మేత’స్సు.. సమాజానికి అత్యంత హానికరం.!

కేంద్ర ఎన్నికల సంఘం అయితే, ఈవీఎం ట్యాంపరింగ్‌కి అసలు ఆస్కారమే లేదని ఇంకోసారి తేల్చిపారేసింది. ఇప్పుడిక మస్క్ మాయ్య పరిస్థితేంటి.?

కామెడీగాడు, ఎలాన్ మస్క్ మాటలకి భారత ప్రజాస్వామ్యంలో విలువ, పాడూ.. ఏమీ వుండదు.! కాకపోతే, అనవసరమైన హైప్ ఇచ్చారంతే.. నెటిజనం అతనికి.!

Digiqole Ad

Related post