ఇంజనీరింగ్: సీఎస్ఈ మాత్రమే ఎందుకు.?

 ఇంజనీరింగ్: సీఎస్ఈ మాత్రమే ఎందుకు.?

Engineering Why Only CSE.. ఇంజనీరింగ్.. ఈ పేరు చెప్పగానే, అందరికీ ముందుగా గుర్తుకొస్తోంది ‘కంప్యూటర్ సైన్సెస్ ఇంజనీరింగ్’.. అదేనండీ సీఎస్ఈ.!

అసలు ఇంజనీరింగ్ అంటే ఏంటి.? సీఎస్ఈ తప్ప, ఇంజనీరింగ్‌లో ఇంకేమీ లేవా.? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్.. వీటి పరిస్థితేంటి.?

మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్.. ఇలాంటివాటిపై ఎందుకు విద్యార్థుల్లో, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది.

ప్రశ్నలైతే చాలానే వున్నాయ్.! సమాధానాలూ వున్నాయ్.! కానీ, సమస్యకు పరిష్కారం దొరకడంలేదు.

తెలుగు రాష్ట్రాల్లో సీఎస్ఈ మేనియా..

తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది (2024), ఇంకా ఎక్కువ సీట్లు ‘సీఎస్ఈ’ కోసం కేటాయిస్తున్నారు. అదే సమయంల, మిగతా బ్రాంచ్‌లకు సీట్ల కోత తప్పట్లేదు.

సీఎస్ఈ తప్ప, వేరే బ్రాంచ్ ఎంచుకునే విద్యార్థులంటే చిన్న చూపు కనిపిస్తోంది సమాజంలో.! ఇదో వింత పోకడ.

Engineering

ఉత్త సీఎస్ఈ ఎందుకు.? ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ – మెషీన్ లెర్నింగ్ అయితేనే బెటర్.. అంటూ, కొందరు సాధారణ ‘సీఎస్ఈ’ని కూడా చిన్న చూపు చూస్తున్నారు.

కోర్ బ్రాంచ్ (ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ వంటివి) గురించి ఏ తల్లిదండ్రులైనా, విద్యార్థులైనా ఆరా తీస్తే, అవెందుకు.. సీఎస్ఈ అయితే, ‘ప్లేస్‌మెంట్స్’ బావుంటాయ్.. అని ఇంజనీరింగ్ కళాశాలలు బ్రెయిన్ వాష్ చేసేస్తున్నాయ్.

Engineering Why Only CSE.. ఉద్యోగ.. ఉపాధి అవకాశాల మాటేమిటి.?

సరే, సీఎస్‌ఈనే బెస్ట్ అనుకుందాం.. మరి, అందరూ సీఎస్ఈ అంటే, లక్షలాది మంది సీఎస్ఈ చేసిన ఇంజనీర్లకు ఆ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయా.? ప్చ్.. లేవ్.!

Also Read: జోకర్ మాయ్య: ఈవీఎమ్.. ఎలాన్ మస్క్.. ఇదో ఫన్నీ టాస్క్.!

సాఫ్ట్‌వేర్ రంగం చాలాకాలంగా సంక్షోభంలో వుంది. దాన్ని ‘మేడిపండు’ అని పోల్చవచ్చునేమో. సీఎస్ఈ చేసి, సరైన ఉద్యోగం లేక, వ్యవసాయం చేసుకుంటున్నవాళ్ళెందరో కనిపిస్తున్నారు.

అంతెందుకు, కానిస్టేబుల్ ఉద్యోగాలకీ ఇంజనీరింగ్ చేసినవాళ్ళు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. సీఎస్ఈ పరిస్థితే ఇలా వుంటే, మిగతా బ్రాంచ్‌ల గురించి మాట్లాడుకోవాల్సిన పనే లేదు.

అవగాహన ఎక్కడ.?

అసలు ఇంజనీరింగ్ ఎందుకు.? అన్న అవగాహన విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో లేకుండానే.. నడిచిపోతోంది వ్యవహారం.

లక్షలు పోస్తే, ఇంజనీరింగ్ కళాశాలల్లో కోరుకున్న బ్రాంచ్ దొరుకుతున్నప్పుడు.. పరిస్థితి, ఇదిగో ఇలానే తగలడుతుంది.!

Engineering CSE
Engineering CSE

నిజానికి, ఏ బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ చేసినా, ‘స్కిల్’ అనేది వుంటే, ఆయా రంగాల్లో రాణించడానికి ఎవరికైనా మెరుగైన అవకాశాలే వుంటాయ్.

ఎవరూ, సీఎస్ఈ వద్దని చెప్పరు.. కానీ, సీఎస్ఈతోపాటు మిగతా బ్రాంచ్‌లకీ సమాన ప్రాధాన్యత వుండాలి. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు రావాలి.

ఇంజనీరింగ్ కళాశాలలెలాగూ మారవ్. ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాలి.

Digiqole Ad

Related post