ఇంటర్‌లో బైపీసీ చేస్తే ఇంజనీరింగ్ చెయ్యొడమెలా.?

 ఇంటర్‌లో బైపీసీ చేస్తే ఇంజనీరింగ్ చెయ్యొడమెలా.?

Students Education Engineering Medicine

Engineering With BiPC.. ఇంజనీరింగ్ చెయ్యాలంటే, ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ చదవాలి.! వైద్యం వైపు వెళ్ళాలంటే మాత్రం, అదే ఇంటర్మీడియట్‌లో బైపీసీ చేయాల్సి వుంటుంది.!

ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ ఇంటర్మీడియట్‌లో బైపీసీ చేస్తే, ఇంజనీరింగ్ చేయడానికి అవకాశమే వుండదా.?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, తెలిసే అన్నారో.. పొరపాటున అన్నారోగానీ, ఇంజనీరింగ్ చెయ్యాలంటే బైసీపీ చదవాలనేశారు తాజాగా.

దాంతో, ఇప్పుడీ బైపీసీ ఇంజనీరింగ్ అంశం తెలుగునాట చర్చనీయాంశంగా మారింది. బైపీసీ చేస్తే, ఇంజనీరింగ్ చెయ్యకూడదన్న రూల్ లేదు. కాకపోతే, కొన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్‌కి ఆ అవకాశం వుండదంతే.

ఇంటర్మీడియట్‌లో బైపీసీ చేసినా, ఇంజనీరింగ్ చేయొచ్చు.. బయో టెక్నాలజీ తదితర ఇంజనీరింగ్ బ్రాంచ్‌లపై ఆసక్తివున్నవారికి ఈ అవకాశం వుంటుంది.

Engineering With BiPC.. ఇంటర్మీడియట్‌లో ఏ గ్రూపు చదివినా..

నిజానికి, ఇంటర్మీడియట్‌లో ఏ గ్రూపు చదివినా, ఆ తర్వాత ఎలాంటి చదువైనా చదివేందుకు వీలు కల్పించేలా, ప్రత్యమ్నాయ విధానాల్ని అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది.

ఇంటర్ బైపీసీలో పూర్తి చేసినవారికి, ఆ తర్వాత మ్యాథ్స్ బ్రిడ్జి కోర్సుతో ఇంజనీరింగ్ చదువుకునేందుకు వీలు కల్పించడం.. ఓ ఆలోచన.

Education Students Engineering With BiPC
Education Students Engineering With BiPC

అలాగే, ఇంటర్ ఎంపీసీ చదివినవాళ్ళకి.. వైద్య వృత్తి వైపుకు మళ్ళేందుకు అవసరమైన రీతిలో బ్రిడ్జి కోర్సు నేర్పిస్తే మంచిదన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచం చాలా చాలా మారింది.. మారుతూనే వుంది. విద్యావ్యవస్థలో ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు వస్తూనే వున్నాయ్.

కాలం మారుతోంది..

డ్యూయల్ డిగ్రీలు.. మిక్స్‌డ్ సబ్జెక్టులు.. చెప్పుకుంటూ పోతే చాలానే.! మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న కోర్సులు.. విద్యార్థుల మెదళ్ళను మరింత పదునుగా మార్చుతున్నాయి.

దురదృష్టమేంటంటే, పదో తరగతి తర్వాత ఏం చేయాలన్నదానిపై.. స్కూల్ దశలో పిల్లలకు ఎలాంటి అవగాహనా వుండటంలేదు.

Also Read: Pranitha Subhash బాపుగారి బొమ్మే.! బుట్టబొమ్మలా.!

స్కూళ్ళలో, విద్యార్థులకి ఉన్నత విద్యపై కనీసపాటి అవగాహన కల్పిస్తే.. వారి భవిష్యత్తు అత్యద్భుతంగా మారుతుంది. కానీ, విద్యార్థులకు కావొచ్చు.. వారి తల్లిదండ్రులకు కావొచ్చు.. కన్‌ఫ్యూజన్ తప్ప, క్లారిటీ వుండటంలేదు.

విద్య అనేది వ్యాపారంగా మారిపోవడం వల్లే ఈ దుస్థితి. ఫీజుల మీద పెట్టే శ్రద్ధ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో పెట్టడంలేదు విద్యా సంస్థలు.

Digiqole Ad

Related post