ఫీల్‌ ది పవర్‌: జనసేన గెలుపు మొదలైంది!

412 0

సినీ అభిమానులకు ఆయన పవర్‌ స్టార్‌. పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan Janasena Party) అభిమానులం అని చెప్పుకునే క్రమంలో ఓ ప్రత్యేకమైన పవర్‌ని ఫీలవుతుంటారు అభిమానులు. ఆయన మాట్లాడితే స్టైల్‌. ఆయన డాన్స్‌ చేస్తే స్టైల్‌. ఆయన ఫైట్‌ చేస్తే స్టైల్‌. ఆయన డైలాగ్‌ చెప్తే స్టైల్‌.

ఆ స్టైల్‌లో ఏదో మత్తుంటుంది. ఆ మత్తుకి బానిసలైపోయారు సినీ అభిమానులు. దానికే ‘పవనిజం’ అని పేరు పెట్టుకున్నారు. మిగతా హీరోల అభిమానులతో పోల్చితే, పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు చాలా ప్రత్యేకం. సక్సెస్‌నీ, ఫెయిల్యూర్‌నీ ఒకేలా తీసుకోగలిగే కమిట్‌మెంట్‌ పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల సొంతం.

సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ అభిమానులు.. ఆయన ‘పవర్’ని అలాగే ఫీలవుతున్నారు.. పవనిజంలోని నిజాన్ని ఆస్వాదిస్తున్నారు.. అడుగడుగునా ఆయనకు అండదండలందిస్తున్నారు. పవన్ కారణంగా లబ్ది పొందినోళ్ళంతా, ఆయన రాజకీయాల్లోకి రాగానే.. తమ నిజస్వరూపం చూపించేసుకున్నారు. నిస్వార్ధమైన అభిమానమే, ఇప్పుడు పవన్ వెంట వుంది.

సినిమాల్లో ‘పవర్‌’ ఇదీ!  Pawan Kalyan Janasena Party

తన సినిమాల ప్రమోషన్‌ని పవన్‌ కళ్యాణ్‌ (Power Star Pawan Kalyan) ఎప్పుడూ అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఏదో మాయ మాటలు చెప్పేసి, ఆడియన్స్‌ని ధియేటర్స్‌కి రప్పించేద్దాం అనే ఆలోచన ఆయన ఎప్పుడూ చేయలేదు.

సినిమా కోసం కష్టపడి పని చేసినా, సినిమా బాగుంటే, పబ్లిసిటీతో పని లేదు అని గట్టిగా నమ్మే వ్యక్తి ఆయన. ఆ నమ్మకం అభిమానుల్ని ఆలోచింపచేసింది. కట్టి పడేసింది. సినిమా హిట్‌ అయితే ఏంటీ.? ఫట్‌ అయితే ఏంటీ.? ఆయన ఎప్పటికీ పవర్‌స్టార్‌ (PSPK) అని అభిమానులు ఫిక్స్‌ అయిపోయారు.

పవన్‌ గెలుపు లెక్క ఏంటంటే.. Pawan Kalyan Janasena Party

‘యుద్ధంలో గెలవడం అంటే శుత్రవుని చంపడం కాదు, ఓడించడం..’ అని ‘జల్సా’ (Jalsa) సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ ఓ డైలాగ్‌ చెప్తాడు. ఒక్క మనిషిని గెలిచినా అది గెలుపే. అలాంటిది కోట్లాదిమంది అభిమానుల మనసుల్ని గెలుచుకున్నాడాయన. ఇది యుద్ధం కాదు. అభిమానం, ప్రేమ.. అంతకుమించి.

ఏ రాజకీయ పార్టీ అయినా మనకు గెలుపు ముఖ్యం కాదు అని.. ఈ రోజుల్లో చెప్పగలదా.? ఛాన్సే లేదు. చావో రేవో అని మాత్రమే ఎన్నికల బరిలో దిగుతాయి రాజకీయ పార్టీలు. కానీ పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan Janasena Party) తాను నమ్మిన సిద్ధాంతాన్నే రాజకీయాల్లోనూ కొనసాగిస్తున్నారు.

మార్పు, గెలుపుకి సూచిక

‘మార్పు మొదలైంది. అదే మన గెలుపుకు సూచిక. అసెంబ్లీలో మన గెలుపు కనిపిస్తుంది.. అని పవన్‌ కళ్యాణ్‌ చెప్పడం అంటే మామూలు విషయం కాదు. ఎన్ని సీట్లు వస్తాయనేది నేను మాట్లాడను.. అది నా పని కాదు.. మార్పు మొదలైంది అన్న చోటే మన గెలుపు మొదలైంది..’ అని జనసేన ముఖ్య నేతలకూ, కార్యకర్తలకూ వాస్తవాన్ని కుండ బడ్దలుకొట్టేశారు పవన్‌ కళ్యాణ్‌.

జనసేన లక్ష్యం వ్యవస్థలో మార్పు. ఆ మార్పు వచ్చేదాకా జనసేన రాజకీయ పోరాటం కొనసాగుతుందని పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan Jana Sena Party) చెప్పారు.

జన సైన్యమే పవర్‌ Pawan Kalyan Jana Sena Party

జనసేన భావజాలాన్ని జనంలోకి తీసుకెళ్లే క్రమంలో పవన్‌ కళ్యాణ్‌ వ్యవహార శైలినీ, కట్టూ, బొట్టునీ, ఆఖరికీ ఆయన సింప్లిసిటీని కూడా వెటకారం చేశారు కొందరు. పాపం వాళ్లెవరికీ తెలీదు ఆఫ్‌ స్క్రీన్‌ పవర్‌ స్టార్‌ అలాగే ఉంటారు. రాజకీయాల్లోకి వచ్చి కొత్త వేషధారణేమీ ఆయన చూపించలేదు.

పవన్‌ కళ్యాణ్‌ ఏంటో ఆయన్ని అభిమానించేవారికి బాగా తెలుసు. అందుకే జనసైనికులు జనసేనానితో కలిసి రాజకీయ పోరాటం చాలా ఉధృతంగా చేశారు. మీడియా అండ దండలు లేకపోయినా, సోషల్‌ మీడియానే అస్త్రంగా మలచుకుని జనసేన భావజాలాన్ని జనంలోకి తీసుకెళ్లారు.

నిన్ను గెలిపించేవాడికోసం..

అవును, జనసేన కోరుకున్న మార్పు (Pawan Kalyan Jana Sena Party) మొదలైంది. జనసేనని లెక్కల్లోకి తీసుకోని వారు కూడా ఇప్పుడు జనసేన ప్రభావమెంత.? ఆ జనసేన కారణంగా మనకు కలిగే నష్టమెంత.? అని లెక్కలేసుకుంటున్నారంటే, జనాన్ని గెలిపించాలన్న జనసేన ఆశయం తొలి అడుగు ఘనంగా వేసినట్లే కదా.

ఆ తొలి అడుగు ఎంత ఘనం అన్నది నిర్ణయించేది ఎన్నికల్లో జనసేన గెలవబోయే సీట్లు కాదు, జనసేనకు పడే ఓట్లు. ఒక్కో ఓటు ఒక్కో ఆయుధం. కుళ్లిపోయిన వ్యవస్థలో మార్పు కోసం ప్రజల ఆరాటం.. ఇదీ జనసేన లక్ష్యం. ‘నీ ఓటు ఇంకొకడ్ని గెలిపించడానికి కాదు, నిన్ను గెలిపించేవాడి కోసం’ అన్న జనసేన నినాదం.. ఈ ఎన్నికల్లో ఎంతమందిని గెలిపించినా, ఆ గెలుపు అపూర్వం, అద్వితీయం!

Related Post

Pawan Kalyan, Jana Sena Party, Telangana

తెలంగాణలో జనసేన: పవన్‌ వ్యూహమిదేనా.!

Posted by - November 19, 2018 0
ముందస్తు ఎన్నికలు రావడంతో తెలంగాణలో పోటీ చేయడానికి తగినంత సమయం లేకుండా పోయింది జనసేన పార్టీకి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌, కష్టతరమైన నిర్ణయం…

2019 ఎలక్షన్స్ రిజల్ట్స్: లైవ్‌ అప్‌డేట్స్‌

Posted by - May 23, 2019 0
ఆంధ్రప్రదేశ్‌ (2019 Elections Results Live Updates) కొత్త ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. మే 30వ తేదీన వైఎస్‌ జగన్‌ పదవీ ప్రమాణ…

మహా వెన్నుపోటు: Truth Is Here

Posted by - February 22, 2019 0
తన తండ్రి నుండి సినీ వారసత్వం (Truth Behind Back Stab of NTR) అందిపుచ్చుకున్న నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఈ ఏడాది వరుసగా రెండు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *