Power Star Pawan Kalyan

ఫీల్‌ ది పవర్‌: కోటి కొల్లగొట్టిన ‘పవనిజం’

181 0

పవన్‌ కళ్యాణ్‌.. (Power Star Pawan Kalyan) ఆ పేరులోనే ‘పవర్‌’ కనిపిస్తుంటుంది. ఆ పవర్‌ని ఫీలవడమెలాగో పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకి బాగా తెలుసు. సినిమా హిట్టయినా, ఫ్లాపయినా.. ఆ ‘పవర్‌’ అలా అలా పెరుగుతూనే వుంటుంది తప్పదు.

పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయినా పవన్‌ కళ్యాణ్‌, తన లక్ష్యం వైపు వేయాలనుకున్న అడుగుని వెనక్కి తీసుకోలేదు. అభిమానులూ అంతే, తమ అభిమాన నటుడ్ని, అభిమాన నాయకుడిగా మరింత అభిమానిస్తున్నారు తప్ప, నిరాశ చెందడంలేదు.

నిన్నటి ఓటమి, రేపటి విజయానికి తొలి మెట్టు.. అనే భావనతోనే జనసైన్యం కన్పిస్తోంది. తమ అభిమాన నటుడు, నాయకుడి పుట్టినరోజుని ఓ పండగలా చేసుకుంటోన్న అభిమానులు, సోషల్‌ మీడియాని తమ అభిమానంతో పోటెత్తించేస్తున్నారు.

పవనిజం దెబ్బకి సోషల్‌ మీడియా హోరెత్తిపోతోంది. ట్వీట్లు సునామీలా దూసుకొస్తున్నాయ్‌. అక్షరాలా కోటి ట్వీట్లు పడ్డాయి ‘హ్యాపీ బర్త్‌ డే పవన్‌ కళ్యాణ్‌’ అంటూ. మరోపక్క, జనసేన పార్టీకి (Jana Sena Party) విరాళాలు సైతం పోటెత్తాయి.. ఆ స్థాయిలో అభిమానులు తమకు తోచిన మొత్తాన్ని డొనేట్‌ చేస్తూ వచ్చారు పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు వేడుకల నేపథ్యంలో.

అభిమానం మరింత ముందడుగు వేసింది.. సెలబ్రిటీలూ అభిమానుల్లా మారిపోయారు. మెగా కుటుంబం నుంచి చరణ్‌, వరుణ్‌, తేజు, అల్లు అర్జున్‌.. పవన్‌ కళ్యాణ్‌కి శుభాకాంక్షలు అందించడం మామూలే. హరీష్‌ శంకర్‌ నుంచి సాయి రాజేష్‌ (కొబ్బరి మట్ట) వరకూ.. పవన్‌ కళ్యాణ్‌ మీద ఓ రేంజ్‌లో తమ అభిమానాన్ని చాటేసుకున్నారు సోషల్‌ మీడియా వేదికగా.

బాబా సెహగల్‌ పవన్‌ కళ్యాణ్‌ కోసం రూపొందించిన స్పెషల్‌ పాటతో వీడియో చేసి, సోషల్‌ మీడియాలో వుంచాడు. పవన్‌ కళ్యాణ్‌తో పనిచేసిన నటీనటులు, పనిచేయాలనుకున్నవారు.. ఆయన పుట్టినరోజు నేపథ్యంలో శుభాకాంక్షలు అందిస్తూ సోషల్‌ మీడియాని ఉర్రూతలూగించేశారనడం అతిశయోక్తి కాదేమో.

‘రాజకీయాలు సరే.. మా కోసం ఒక్క సినిమా చెయ్యవా అన్నయ్యా..’ అంటూ ప్రేమతో అడుగుతోన్న అభిమానుల కోసమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) ఓ సినిమా చేస్తే బావుంటుందేమో. సినిమా చేస్తే మాత్రం ఆ ‘పవర్‌’ ఇంకోలా వుంటుందన్నది నిర్వివాదాంశం.

Related Post

రౌడీస్‌కి విజయ్‌ దేవరకొండ స్వీట్‌ వార్నింగ్‌

Posted by - October 3, 2018 0
అభిమానం జుగుప్సాకరంగా మారుతున్న రోజులివి. నచ్చిన హీరోని అభిమానించే అభిమానులు, ఆ హీరోకి అపోనెంట్‌ ఎవరన్నా వున్నారని భావిస్తే, అత్యంత హేయంగా, అసహ్యకరంగా సోషల్‌ మీడియా వేదికగా…
KGF, Maari 2, Zero

ప్రివ్యూ: మారి-2, కెజిఎఫ్‌, జీరో

Posted by - December 20, 2018 0
స్ట్రెయిట్‌ తెలుగు సినిమాలు ‘అంతరిక్షం’, ‘పడి పడి లేచె మనసు’తోపాటుగా, ‘కెజిఎఫ్‌’ (కన్నడ), ‘మారి-2’ (తమిళ్‌) తెలుగులోకి డబ్‌ అయి, డిసెంబర్‌ 21నే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి (KGF…

కౌశల్‌ది వేట, వాళ్ళది దొంగాట

Posted by - September 25, 2018 0
సైలెంట్‌గా కూర్చున్న కౌశల్‌ని కెలికి మరీ, రచ్చకు కారణమయ్యింది దీప్తి నల్లమోతు. దీప్తి అడిగిన ప్రశ్నకు కౌశల్‌ సమాధానమిస్తే, ‘నీలో మెచ్యూరిటీ లెవల్స్‌ చాలా తక్కువ’ అంటూ…
Savyasachi Review, Savyasachi Preview,

ప్రివ్యూ: ‘సవ్యసాచి’ ఒక్కడేగానీ.!

Posted by - November 1, 2018 0
‘సవ్యసాచి’ అంటే అర్జునుడు అని. ఇక్కడ ఈ ‘సవ్యసాచి’ ఒక్కడే.. కానీ, ఇద్దరు. ఒక్కడేంటి, మళ్ళీ ఇద్దరేంటి.! అదే ‘సవ్యసాచి’ సినిమా. తల్లి గర్భంలో రెండు కవల…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *