Ganesh Laddu Hyderabad.. ఏటా జరిగే వినాయక చవితి ఉత్సవాల్లో సెంటరాఫ్ ఎట్రాక్షన్ అంటే, అది గణపతి లడ్డూ వేలం పక్రియ.. అని చెప్పక తప్పదు.!
గణపతి లడ్డూ వేలం అనగానే, అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది హైద్రాబాద్‌లోని బాలాపూర్.!
ఎన్నో ఏళ్ళుగా బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ప్రక్రియ జరుగుతూ వస్తోంది. ప్రతియేటా సరికొత్త రికార్డులు సృష్టిస్తుంటుంది బాలాపూర్ గణేష్ లడ్డూ.. వేలం పాటలో.!
ఆ లడ్డూని ఎవరు దక్కించుకుంటే, వారికి అష్టైశ్వర్యాలూ సిద్ధిస్తాయనీ, ఆయురారోగ్యాలు కలుగుతాయన్న నమ్మకం బలంగా వుంటోంది.. అది ప్రతియేడాదీ మరింత బలపడుతోంది కూడా.!
పాతిక లక్షల నుంచి అరవై లక్షల వరకూ.!
ఈ ఏడాది.. అంటే, 2022లో బాలాపూర్ గణేష్ లడ్డూ దాదాపు పాతిక లక్షల రూపాయలు పలికింది. ఇదే ఇప్పటికి సరికొత్త రికార్డ్.. అనుకున్నారంతా.
కానీ, ఇంతలోనే సీన్ మారింది.! హైద్రాబాద్‌లోనే ఆల్వాల్ పరిధిలోని కానాజిగూడలోని మరకత లక్ష్మీగణపతి లడ్డూ వేలం ప్రక్రియలో ఏకంగా లడ్డూ ధర దాదాపు 46 లక్షలు పలికింది.
మరో చోట అయితే, లడ్డూ ధర మరింతగా పెరిగిపోయింది. 60 లక్షల రూపాయల ధర పలికింది గణేష్ లడ్డూ.

రంగారెడ్డి జిల్లా గండిపేట పరిధిలోని సన్‌సిటీ కీర్తి రిచ్‌మండ్ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ప్రాంగణంలో నెలకొల్పిన వినాయక మంటపంలో లడ్డూని వేలం వేయగా, 60 లక్షల రూపాయలు లభించాయ్.
ఆర్వీ ఛారిటీస్ ఈ వేలంలో పాల్గొని, లడ్డూని దక్కించుకుంది. వేలం ద్వారా వచ్చిన సొమ్ముని, పలు ఎన్జీవోలకు అందించనున్నామని నిర్వాహకులు తెలిపారు.
Ganesh Laddu Hyderabad.. లడ్డూ వేలం వెనుక గొప్ప ఆశయం..
లడ్డూ వేలం ప్రక్రియ వెనుక గొప్ప ఆశయమే వుంది. ఆయా కాలనీలు, గ్రామాల అభివృద్ధి కోసం, స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చేందుకోసం ఈ నిధుల్ని వెచ్చించడం అభినందించగ్గ విషయమే.!
Also Read: అనసూయ ‘కర్మ’.! ‘అర్జున్ రెడ్డి’ పాపం ‘లైగర్’ని వెంటాడిందా.?
గణపతి బప్పా మోరియా.! ప్రతి యేడాదీ లడ్డూ వేలంలో రికార్డలు కొనసాగించనీయవయా.!