Gangleader Review

ప్రివ్యూ: నానీస్‌ ‘గ్యాంగ్‌ లీడర్‌’.. లెక్క తేల్చేదెంత.!

233 0

హీరో నాని 50 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్‌ అవుతాడా.? లేదా.? ‘గ్యాంగ్‌ లీడర్‌’ (Gangleader Review) సినిమాపై అంచనాలివీ. ‘జెర్సీ’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న నాని, ఈసారి అంతకన్నా పెద్ద హిట్‌ కొట్టాలనే కసితో వున్నాడు. సినిమా కథ కూడా ‘కసి’తో కూడుకున్నదే.

అయితే, ఆ ‘కసి’కి కాస్తంత ఫన్‌ జోడించారు. రివెంజ్‌ స్టోరీనే.. కాకపోతే, ఆ రివెంజ్‌ తీర్చుకునేది ఐదుగురు లేడీస్‌. ‘పుట్టుక నుంచి చావుదాకా.. కంప్లీట్‌ ప్యాకేజీలా వున్నట్టున్నారు..’ అంటాడు నాని (Natural Star Nani) ఓ డైలాగ్‌లో. ఆ డైలాగ్‌ ఎందుకన్నాడో తెలుసు కదా.?

రివేంజ్‌ తీర్చుకునే ఆ ఐదుగురికీ మనోడు గ్యాంగ్‌ లీడర్‌ (Gang Leader). ఇంతకీ రివెంజ్‌ ఎవరి మీద.? ఇంకెవరి మీద, ఆర్‌ఎక్స్‌100 హీరో కార్తికేయ మీద. అతనేం చేశాడు పాపం.?

ఇతనే ఈ సినిమాలో విలన్‌. రివెంజ్‌ రైటర్‌ అయిన పెన్సిల్‌ పార్థసారధి (నాని), ఆ ఐదుగురు లేడీస్‌ తీర్చుకోవాల్సిన రివెంజ్‌కి స్కెచ్‌ వేస్తాడు.

నిజానికి, వాళ్ళే.. తమ రివెంజ్‌ తీర్చుకోవడానికి నానిని ఆశ్రయిస్తారు. మరి, పెన్సిల్‌ పార్థసారధి చెప్పినట్లు వాళ్ళంతా నడుచుకోవాలి కదా.? విలన్‌ని టార్చర్‌ పెట్టడం సంగతేమోగానీ, పెన్సిల్‌ పార్థసారధికి మాత్రం అడుగడుగునా ఇబ్బందులు కలిగిస్తారు.. తమకు తెలియకుండానే.

ఒక్క మాటలో చెప్పాలంటే.. సరదాతో కూడిన టార్చర్‌ అనుకోవచ్చు. సినిమాలో అంతా ఫన్‌ అనుకుంటే పొరపాటే. కావాల్సినంత యాక్షన్‌ వుంది. అన్నట్టు, ఆ యాక్షన్‌ కోసమే భారీగా ఖర్చు చేశారు. ఆ ఖర్చు వ్యవహారాన్ని ప్రస్తుతానికి దాచేశారు.

ట్రైలర్‌లో, టీజర్‌లో.. అంతా నార్మల్‌గా చూపించే ప్రయత్నం చేశారు. సినిమాలో ఆ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ చూసి ఎవరైనా షాకవ్వాల్సిందేనట. ఓ మంచి సినిమా.. ఓ కమర్షియల్‌ సినిమా.. అన్నీ ఈ సినిమాలో కుదిరాయని నాని చెబుతున్నాడు.

దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ (Vikram K Kumar) ఈ సినిమాని ఓ వెండితెర అద్భుతంగా తీర్చిదిద్దాడన్నది నిర్మాతలు చెబుతున్న మాట.

నిజమేనా.? ‘నానీస్‌ గ్యాంగ్‌ లీడర్‌’గా (Nani’s Gang Leader) మారిన ‘గ్యాంగ్‌ లీడర్‌’ (Gangleader Review) బాక్సాఫీస్‌ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుంది.? 50 కోట్ల క్లబ్‌లో చేరి, నేచురల్‌ స్టార్‌ నాని.. స్టార్‌డమ్‌ పరంగా మరో మెట్టు పైకెక్కుతాడా.? వేచి చూడాల్సిందే.

Related Post

Charan Vinaya Vidheya Rama

‘మెగా’ కానుక: ‘వినయ విధేయ రామ’

Posted by - November 6, 2018 0
అభిమానులకి మెగా కానుక అందింది దీపావళి పండక్కి. ఓ రోజు ముందుగానే ఈ దీపావళి కానుకని ఇచ్చేశారు నిర్మాత డి.వి.వి. దానయ్య. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌చరణ్‌…
rajinikanth, shankar, akshay kumar, amy jackson,

600 కోట్ల సాంకేతిక అద్భుతం.!

Posted by - November 5, 2018 0
రజనీకాంత్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘2.0’ సినిమా కోసం సుమారు 600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. ఈ విషయాన్ని ట్రైలర్‌ లాంఛ్‌ సందర్భంగా సాక్షాత్తూ సూపర్‌…
Sye Raa Review

‘సైరా’ ఫస్ట్‌ రివ్యూ: సినిమా ఎలా వుందంటే.!

Posted by - September 26, 2019 0
అక్టోబర్‌ 2న విడుదల కానున్న ‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Narasimha Reddy Review) సినిమా ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది. అదేంటీ, అప్పుడే రివ్యూ వచ్చేయడమేంటి.? అసలు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *