HanuMan సక్సెస్ సీక్రెట్ ఇదీ.!
HanuMan Movie Success Secret.. తేజ సజ్జ అనే అప్‌కమింగ్ హీరో నటించిన సినిమా ‘హనుమాన్’.! దీన్ని ఇంగ్లీషులో ‘హను..మ్యాన్’గా సంబోదిస్తున్న సంగతి తెలిసిందే.
సినిమా విడుదలైంది.. సంచలన విజయాన్ని అందుకుంది. విడుదలకు ముందు బాలారిష్టాలు ఎదుర్కొంది ‘హనుమాన్’ సినిమా.
పెద్ద సినిమా.. చిన్న సినిమా.. అంటూ గీత గీసి మరీ, ‘హనుమాన్’ సినిమాకి అన్యాయం చేశారు పరిశ్రమ పెద్దల ముసుగులో కొందరు.!
HanuMan Movie Success Secret.. గెలుపోటములు దైవాధీనం..
చివరికి ఏమయ్యింది.? ‘హనుమాన్’ సినిమా ఈ సంక్రాంతి సీజన్‌లో మిగతా సినిమాలన్నీ కలిసి వసూలు చేసినదానికంటే ఎక్కువ వసూలు చేసింది.
ఇది తెలుగు సినిమా విజయం.! తెలుగు సినీ పరిశ్రమలో కుట్ర పూరిత వ్యవహారాలు నడిపినవారి ఓటమి.!
అసలు ‘హనుమాన్’ సినిమాకి ఇంతటి విజయం ఎలా సాధ్యమయ్యింది.? చివరి అరగంట, థియేటర్లలో కూర్చున్న ప్రేక్షకుల్ని సీటులోంచి కదలనివ్వలేదు దర్శకుడు.
వరలక్ష్మీ శరత్‌కుమార్ యాక్షన్ మోడ్‌లోకి రావడం, ఆ తర్వాత హనుమంతుడు వెండితెరపై వెలిగిపోవడం.. అంతే, వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయారు ప్రేక్షకులు.
ఇది మామూలు అన్యాయం కాదు..
సినిమా బావుంది.. చాలా బావుంది.. ఇవన్నీ ఓ యెత్తు.! ‘హనుమాన్’ సినిమాకి విడుదల విషయంలో పెద్ద అన్యాయమే జరిగిందన్న విషయానికీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు.
థియేటర్ల నుంచి బయటకు వస్తున్నవారంతా, ‘ఇంత మంచి సినిమాని నాశనం చేయాలని ఎలా అనుకున్నారు.?’ అంటూ చర్చించుకోవడం గమనార్హం.
అలా మౌత్ టాక్, ‘హనుమాన్’ సినిమాని వేరే లెవల్‌కి తీసుకెళ్ళింది. సంక్రాంతి అంటే ఒక్క సినిమానే కాదు.. నాలుగైదు సినిమాలు, అంతకు మించి వచ్చినా సమస్య ఏమీ వుండదు.
కంటెంట్ వుంటే.. ఎవడూ ఆపలేడు..
సినిమాల్లో కంటెంట్ వుంటే, పది సినిమాల్ని అయినా ప్రేక్షకులు ఆదరించే పరిస్థితి వుంటుంది. కొందరి చేతుల్లో థియేటర్లు మగ్గిపోవడం వల్లే ఈ దుస్థితి.
Also Read: రష్మిక డీప్ ఫేక్.! ‘దొంగ’ దొరికాడహో.!
అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఎలాగైతే ఆపలేరో, మంచి సినిమాని సైతం కుట్ర పూరిత వ్యవహారాలతో ఎంతటి సినీ ఉద్ధండులైనా ఆపలేరు.
చివరగా.. హనుమంతుడు చిరంజీవి.! ఔను, అందుకేనేమో మెగాస్టార్ చిరంజీవి నుంచి సంపూర్ణ మద్దతు ఈ ‘హనుమాన్’కి దక్కింది.! జై చిరంజీవ.!