Young Tiger NTR.. ఆ ప్రభంజనమెప్పుడో.!

 Young Tiger NTR.. ఆ ప్రభంజనమెప్పుడో.!

Happy Birthday Young Tiger NTR The King Of Masses

తెలుగు తెరకు సంబంధించి ‘అన్నగారు’ అంటే స్వర్గీయ నందమూరి తారకరామారావు మాత్రమే. తెలుగు రాజకీయాలకు సంబంధించి ‘అన్న’ అంటే నందమూరి తారకరామారావు మాత్రమే. ఆ స్వర్గీయ నందమూరి తారకరామారావు అంశ.. అదేనండీ, యంగ్ టైగర్ ఎన్టీయార్ (Happy Birthday Young Tiger NTR The King Of Masses) పేరు కూడా ఓ ప్రభంజనమే.

రాజకీయ తెరపై జస్ట్ ఓ అతిథి పాత్ర మాత్రమే కొన్నాళ్ళ క్రితం పోషించిన యంగ్ టైగర్.. అదేనండీ, జూనియర్ నందమూరి తారకరామారావు, పూర్తిస్థాయిలో రాజకీయాల్లో సందడి చేసేదెప్పుడు.? అని అభిమానులు ఎదురుచూడటం సబబే. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘రాజకీయాలు మనకొద్దు..’ అనే సూచనే ఆయన వైపు ఎక్కువగా వెళుతోంది అభిమానుల నుంచి.

ఔను, రాజకీయాలకు ఇది సమయం కానే కాదు యంగ్ టైగర్ ఎన్టీయార్ విషయంలో. తెలుగు తెరపై తనదైన ముద్ర వేసిన యంగ్ టైగర్, అగ్ర కథానాయకుల్లో ఒకరిగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇంకో పదేళ్ళ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీయార్ రాజకీయాల గురించిన ఆలోచన చేయొచ్చేమో. లేదంటే, ఈలోగానైనా అన్నీ ఆలోచించుకుని రాజకీయ రంగంలోకి దూకొచ్చేమో.

సినిమా సినిమాకీ నటుడిగా తన స్థాయిని పెంచుకుంటూ వెళుతోన్న జూనియర్ ఎన్టీయార్, బుల్లితెరపైనా తనదైన సంతకాన్ని చాలా ఘనంగానే పెట్టేశాడు బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా. ఇంకోసారి అంతకు మించిన ఘనమైన రికార్డుల కోసం ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ అంటూ రాబోతున్న విషయం విదితమే.

ఇటు సినిమాలు, అటు బుల్లితెర.. వీటితోపాటు రాజకీయమా.? ఏమో, కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. యంగ్ టైగర్ ఎన్టీయార్.. (Happy Birthday Young Tiger NTR The King Of Masses) ఏ విషయంలోనైనా ఆచి తూచి అడుగేస్తాడు.. రాజకీయాలపైనా ఆయనకంటూ ఖచ్చితమైన అవగాహన వుండే వుంటుంది. అన్ని లెక్కలూ పక్కగా వేసుకుని యంగ్ టైగర్ రాజకీయాల్లోకొచ్చే సమయం కోసం వేచి చూడాల్సిందే.

హ్యాపీ బర్త్ డే టు యంగ్ టైగర్ ఎన్టీయార్.. జూనియర్ నందమూరి తారకరామారావుకి జన్మదిన శుభాకాంక్షలు.. Happy Birthday To Young Tiger NTR.

Digiqole Ad

Related post