Pawan Kalyan Harish Shankar

పవన్‌ కళ్యాణ్‌ తర్వాతే ఏదైనా: హరీష్‌ శంకర్‌

115 0

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కి (Power Star Pawan Kalyan) దర్శకుడు హరీష్‌ శంకర్‌ (Harish Shankar) ఎంత పెద్ద వీరాభిమాని అనేది అందరికీ తెల్సిన విషయమే. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గతంలో ‘గబ్బర్‌ సింగ్‌’ సినిమా వచ్చింది. ఇటీవలే ఈ కాంబినేషన్‌లో (Pawan Kalyan Harish Shankar PSPK28) మరో సినిమా ఖరారయ్యింది.

#PSPK28 సినిమా అనౌన్స్‌మెంట్‌ వచ్చి చాలా రోజులే అయ్యింది. ఇటీవలే ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్‌ (Devi Sri Prasad) పేరుని హరీష్‌ శంకర్‌ ప్రకటించిన విషయం విదితమే. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాని నిర్మిస్తోంది.

కాగా, హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించనున్నట్లు 14 రీల్స్‌ సంస్థ ప్రకటించింది. నిర్మాత రామ్ ఆచంట, త్వరలోనే ఈ సినిమా వివరాల్ని వెల్లడిస్తామని అంటున్నారు. కరోనా వైరస్‌ (Corona Virus Covid19) నేపథ్యంలో వచ్చిన లాక్‌డౌన్‌ ముగిశాక హరీష్‌ శంకర్‌తో (Harish Shankar) చేయబోయే సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడవుతాయన్నది నిర్మాత రామ్ ఆచంట చెబుతున్న విషయం.

మరోపక్క, పవన్‌ కళ్యాణ్‌ (PSPK) అభిమానులు కొందరు హరీష్‌ – పవన్‌ కాంబోపై కొంత ఆందోళన వ్యక్తం చేశారు సోషల్‌ మీడియా వేదికగా. దాంతో, హరీష్‌ తనదైన స్టయిల్లో వివరణ ఇచ్చాడు.

‘ఏ కొత్త ప్రాజెక్ట్‌ అయినా, పవన్‌ కళ్యాణ్‌ సినిమా తర్వాతే. మీలా నేనూ పవన్‌ కళ్యాణ్‌ అభిమానినే. పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) అభిమానిగా, పవన్‌ కళ్యాణ్‌ సినిమా (Pawan Kalyan Harish Shankar PSPK28) కోసం ఎదురుచూస్తున్నాను. కథ రెడీ అవుతోంది. పవన్‌ సినిమా తర్వాతనే మిగతా సినిమాల గురించి ఆలోచిస్తాను..’ అని హరీష్‌ శంకర్‌ స్పష్టతనిచ్చాడు.

ఇదిలా వుంటే, పవన్‌ సరసన హీరోయిన్‌.. అంటూ మలయాళ ముద్దుగుమ్మ మానస రాధాకృష్ణన్‌ (Manasa Radhakrishnan) పేరు తెరపైకొచ్చిన విషయం విదితమే. అయితే, ఆ గాసిప్స్‌ని హరీష్‌ శంకర్‌ (Harish Shankar) ఖండించాడు కూడా.

Related Post

Valmiki Gaddhalakonda Ganesh

‘వాల్మీకి’ టైటిల్‌ ఛేంజ్.. ‘సైరా’ పరిస్థితేంటి.?

Posted by - September 19, 2019 0
ఏ రాజకీయం ‘వాల్మీకి’ (Valmiki Title Changed As Gaddhalakonda Ganesh) సినిమాని దెబ్బ కొట్టాలనుకుంది.? ‘వాల్మీకి’ టైటిల్‌ విషయమై జరిగిన, జరుగుతున్న రచ్చ వెనుక వున్నదెవరు.?…

‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్‌ టాక్‌ ‘దద్దరిల్లిపోయింది’

Posted by - January 11, 2020 0
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తాజా సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్‌ టాక్‌ (Sarileru Neekevvaru Review FDFS) ‘దద్దరిల్లిపోయింది’. అవును, అందరి నోటా ఒకటే మాట.. సినిమా…
Ala Vaikunthapurramuloo Review

ప్రివ్యూ: అల వైకుంఠపురములో.. స్టైలిష్‌ విన్నర్‌

Posted by - January 11, 2020 0
ఆయన స్థాయి వేరు.. ఆయన స్థానం వేరు.. అందుకే ఆయన్ని అందరూ ‘గురూజీ’ (Guruji Trivikram) అని అభిమానిస్తుంటారు. హీరోలకి అభిమానులు వుండడం సర్వసాధారణమే (Ala Vaikunthapurramuloo…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *