ఐపీఎల్ 2019 : Cricket Ka Asli Majaa

1575 0

Cricket is not just a sport, it becomes entertaining sport with T20 Cricket. especially with IPL, mania of cricket reaches its new top. Vivadala sangathi pakkana pedite, Indian Premiere League (IPL 2019 Cricket Ka Asli Maja) ki dakkuthunna aadharana roju rojukee perugutondi tappa thaggadamledu.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కొత్త సీజన్‌ షురూ అవుతోంది. కళ్లు చెదిరే ఎంటర్‌టైన్‌మెంట్‌.. నరాలు తెగే ఉత్కంఠ.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (Indian Premiere League) సొంతం. బరిలో ఎన్ని జట్లున్నా, ప్రధానంగా కొన్ని జట్ల మధ్యే గట్టి పోటీ జరుగుతుంటుంది.

అలాంటి గట్టి జట్లలో సన్‌రైజర్స్‌ (Sun Risers), రాయల్‌ ఛాలెంజర్స్‌ (Royal Challengers), సూపర్‌ కింగ్స్‌ (Super Kings) ముంబయ్‌ ఇండియన్స్‌ (Mumbai Indians) గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి.

రాయల్‌ ఛాలెంజర్స్‌ కాస్తంత వెనకబడినట్లు కనిపిస్తున్నా, కోహ్లీ (Virat Kohli) కారణంగా ఆ జట్టుకి బోలెడంత ఫాలోయింగ్‌ ఉంది. రాజస్థాన్‌ రాయల్స్‌ కావచ్చు, కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ (Kolkata knight Riders) కావచ్చు, పంజాబ్ జట్టు కావొచ్చు, ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ (ఢిల్లీ క్యాపిటల్ గా ఈసారి పేరు మార్చుకుంది) కావచ్చు.. ఏ జట్టునీ తక్కువగా అంచనా వేయలేం.

క్షణ క్షణానికీ మారిపోయే ఈక్వేషన్స్ (IPL 2019 Cricket Ka Asli Maja)

మ్యాచ్‌ మ్యాచ్‌కీ ఈక్వేషన్స్‌ మారిపోతాయి. దాదాపుగా ప్రతీ రోజూ సూపర్బ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ క్రికెట్‌ అభిమానులకు దొరుకుతుంది.

ఈ సారి ఎవరు గెలుస్తారు.? అని ఇప్పుడే చెప్పడం కష్టం కానీ.. ఆయా జట్ల అభిమానులు మాత్రం తమ జట్టే గెలుస్తుందని ఘంటా పథంగా చెబుతున్నారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కి సంబంధించి స్టార్‌డమ్‌ క్షణక్షణానికీ మారిపోతుంటుంది.

భారీ సిక్సర్‌ కొడితే ఒక లెక్క. బిగ్‌ వికెట్‌ తీస్తే ఇంకో లెక్క. మైండ్‌ బ్లోయింగ్‌ క్యాచ్‌ పడితే మరో లెక్క. మెరుపు వేగంతో రన్‌ అవుట్‌ చేస్తే అది ఇంకో లెక్క. స్టంప్‌ అవుట్‌ కావచ్చు, కవర్‌ డ్రైవ్‌ కావచ్చు, స్పిన్‌ బౌలింగ్‌ కావచ్చు, ఫాస్ట్‌ బౌలింగ్‌ కావచ్చు.. ప్రతీదీ ప్రత్యేకమే.

ఎన్ని పరుగులు కొట్టారు. ఎన్ని వికెట్లు తీశారు.? వికెట్‌ వికెట్‌కీ లెక్కలు మారిపోతాయ్‌. బ్యాటు నుండి రాలే ప్రతీ పరుగూ మ్యాచ్‌పై ఉత్కంఠని పెంచేస్తుంది. ఒకదాన్ని మించిన మ్యాచ్‌ ఇంకోటి. అది తక్కువ.. ఇది ఎక్కువ అనే బేధాల్లేవ్‌. ప్రతీ మ్యాచ్‌ అత్యద్భుతమే.

పొట్టి క్రికెట్ కాదు, గట్టి క్రికెట్ (IPL 2019 Cricket Ka Asli Maja)

‘పొట్టి క్రికెట్‌’అనగానే బంతిని బలంగా బాదేవాడే మొనగాడు అనే విషయం గుర్తొస్తుంది. కానీ బంతితో మ్యాజిక్‌ చేయడం తెలిసిన వీరులూ ఉన్నారిక్కడ. ధోనీ, కోహ్లీ అన్నదమ్ముల్లా కలిసి టీమ్‌ ఇండియాకి ఆడితే ఇచ్చే కిక్‌ కన్నా, వీళ్లిద్దరూ ప్రత్యర్థులుగా తలపడితే వచ్చే కిక్కే వేరప్పా.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL 2019 Cricket Ka Asli Maja) ప్రత్యేకత ఇది. ఆస్ట్రేలియా, భారత్‌ మధ్య మ్యాచ్‌ జరిగితే ఆస్ట్రేలియా ఆటగాళ్లు త్వరగా ఔట్‌ అయిపోవాలని కోరుకుంటాం. కానీ ఐపీఎల్‌లో అదే ఆటగాడు అదరగొట్టేయాలని ఆశిస్తాం. దాదాపుగా చాలా మంది క్రికెటర్స్‌కి ఇదే అభిమానం ఐపీఎల్‌ ద్వారా భారత్‌లో లభిస్తోంది.

వెస్టిండీస్‌ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ అయితే ఐపీఎల్‌ ద్వారా సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ని సంపాదించుకున్నాడు. చెప్పుకుంటూ పోతే ఐపీఎల్‌ కథలు చాలానే ఉన్నాయి. భారీ సిక్సర్లు, వికెట్లు ముక్కలయ్యే క్లీన్‌ బౌల్డులు, బ్యాట్స్‌మెన్‌ని ముప్పు తిప్పలు పెట్టే బౌలర్లు. బౌలర్లను ఉతికి ఆరేసే బ్యాట్‌మెన్స్‌.. వాట్‌ నాట్‌ ప్రతీదీ విశేషమే.

సినిమా తర్వాత.. క్రికెట్టే ముందు.. (IPL 2019 Cricket Ka Asli Maja)

ధియేటర్స్‌లో సినిమాల ప్రదర్శన పక్కన పెట్టి ఐపీఎల్‌ మ్యాచ్‌ల్ని ప్రదర్శించేది ఈ క్రేజ్‌ కారణంగానే. పుట్టింది, పెరిగింది.. జార్ఖండ్‌లో అయినా, ధోనీ (Mahendra Singh Dhoni)ని తమిళ క్రికెట్‌ అభిమానులు తమ వాడిగా మార్చేసుకున్నారంటే అది ఐపీఎల్‌ వల్లనే సాధ్యమైంది. ‘నేను తమిళుడిగా మారిపోయా..’ అని ధోనీ పలు సందర్భాల్లో చెప్పాడు. చాలా మంది క్రికెటర్స్‌ది ఇదే పరిస్థితి.

కౌంట్‌డౌన్‌ (IPL 2019 Cricket Ka Asli Maja) ప్రారంభమైంది. భీభత్సమైన ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఎదురు చూస్తున్నారు. గత రికార్డులు బద్దలైపోవాలి. కొత్త రికార్డులు పుట్టుకురావాలి. కొత్త స్టార్లు అవతరించాలి. ఇప్పుడున్న స్టార్లు మరింతగా వెలిగిపోవాలి. గెట్‌ రెడీ టూ విట్‌నెస్‌ స్పెక్టాక్యులర్‌ క్రికెట్‌ ఈవెంట్‌.

అప్‌డేట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఆర్టికల్స్‌ ఆన్‌ ‘ఐపీఎల్‌’ ఎప్పటికప్పుడు మీ ‘ముద్ర 369. కామ్‌’లో.

Related Post

happy birthday ms dhoni

ఎమ్మెస్‌ ధోనీ: సూపర్ కింగ్‌ ఆఫ్‌ ఇండియన్‌ క్రికెట్‌..

Posted by - July 7, 2020 0
మహేంద్ర సింగ్‌ ధోనీ (MS Dhoni King Of Indian Cricket), కోట్లాది మంది క్రికెట్‌ అభిమానులకి దేవుడు. ‘క్రికెట్‌ గాడ్‌’ అనే అరుదైన గుర్తింపుని సంపాదించుకున్న…

భారత్‌ వర్సెస్‌ పాక్‌: క్రికెట్‌ కాదది యుద్ధం.!

Posted by - June 15, 2019 0
టీమ్‌ ఇండియా (Team India) ఎప్పుడు, ఎక్కడ పాకిస్థాన్‌తో (Pakistan)  తలపడినా (India Vs Pakistan World Cup 2019), అక్కడ పరిస్థితులు యుద్ద వాతావరణాన్ని తలపిస్తాయి.…

యువీరత్వం: విజేతను ఓడించిన రాజకీయం

Posted by - June 11, 2019 0
2011 వరల్డ్‌ కప్‌ (2011 world cup) పోటీల్ని భారత క్రికెట్‌ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే, సుదీర్ఘ కాలం తర్వాత టీమిండియాని వరించిన వన్డే వరల్డ్‌…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *