చంద్రయానం.! చందమామని అందుకుందాం.!
ISRO Chandrayaan 3
ISRO Chandrayaan 3 Project ఇస్రో చంద్రయాన్.! భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు ఇది.
‘చందమామ రావే.. జాబిల్లి రావే..’ అని చిన్నప్పుడు ప్రతి ఒక్కరికీ తల్లి పాడిన జోలపాట గుర్తుండే వుంటుంది. కానీ, చందమామ రాదు.. చందమామ దగ్గరకే మనం వెళ్ళాలి.
వెళుతున్నాం.. ఆల్రెడీ వెళ్ళాం.. మళ్ళీ మళ్ళీ వెళుతూనే వుంటాం. చంద్రుడి మీద మనిషి కాలు మోపి చాలాకాలమే అయ్యింది.
కానీ, మధ్యలో ప్రయోగాలు ఆగిపోయాయ్.. మళ్ళీ మొదలయ్యాయ్. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కూడా తానేం తక్కువ కాదంటోంది.
ISRO Chandrayaan 3 Project.. చంద్రయానం.. అత్యంత కఠినం..
చంద్రయాన్.. ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికే రెండు దశల్ని చూశాం. మొదటిది ‘చంద్రయాన్-1’. రెండోది ‘చంద్రయాన్-2’. ఇప్పుడు ‘చంద్రయాన్-3’.!

చంద్రుడి మీదకు రోవర్‌ని దించే ప్రక్రియ చేపట్టింది ‘చంద్రయాన్-2’. కానీ, రోవర్ ల్యాండింగ్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆ ప్రాజెక్టు పాక్షిక విజయాన్నే అందుకున్నట్లయ్యింది.
అందుకే, ఈసారి మరింత పకడ్బందీగా ‘చంద్రయాన్-3’ ప్రయోగం చేస్తోంది ఇస్రో. ఈ ప్రయోగం విజయవంతమైతే.. ఇస్రో చరిత్రలో అదో అద్భుతం కానుంది.
ముందు ముందు.. మనం కూడా.!
భారతీయ వ్యోమగాములు.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ద్వారా.. మనం తయారు చేసుకున్న రాకెట్ల ద్వారా చంద్రుడి మీద అడుగు మోపే రోజెంతో దూరంలో లేదు.
Also Read: వైరల్ వీడియో.! జింకలు పాముల్ని తింటాయా.?
అలా జరగాలంటే, ‘చంద్రయాన్-3’ విజయవంతమవ్వాలి. అవుతుంది కూడా.! బాహుబలి రాకెట్ సిద్ధంగా వుంది.. కౌంట్ డౌన్.. లిఫ్ట్ ఆఫ్.. అంతే, ఆకాశంలోకి రాకెట్ దూసుకుపోతోంది.
కొన్ని రోజులపాటు, భూమి చుట్టూ తిరిగే ‘చంద్రయాన్-2’ మాడ్యూల్.. ఆ తర్వాత చంద్రుడివైపుకు దూసుకెళుతుంది.
ముందే చెప్పుకున్నట్లు.. చంద్రయానమంటే అంత తేలిక కాదు.! సంక్లిష్టమైన ప్రక్రియలెన్నో దాటుకుని ముందుకెళ్ళాల్సి వుంటుంది.
ఫెయిల్యూర్.. కొత్త పాఠాల్ని నేర్పిస్తుంది.. నేర్పించింది కూడా.! ఆ నేర్చుకున్న పాఠాల నేపథ్యంలో, ఈసారి మరింత పట్టుదలతో.. చంద్రుడి వైపు దూసుకెళ్ళబోతున్నాం.
ఇస్రో ప్రయోగం విజయవంతమవ్వాలనీ.. ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త సంతకం ఇస్రో చెయ్యాలనీ ఆశిద్దాం.