అస్త్ర శస్త్రాలతో జనసేనాని సర్వ సన్నద్ధం

619 0

ఐదేళ్ల రాజకీయ ప్రస్థానం జనసేన పార్టీ (Jana Sena Party) అధినేత పవన్‌ కళ్యాణ్‌కి (Pawan Kalyan) ఏం నేర్పింది.? అని ఆరా తీస్తే చాలా విషయాలు, విశేషాలు (Pawan Kalyan Jana Sena Party) కనిపిస్తాయి. తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి గతంలో వర్తాసు పలికాడనే విమర్శలు పవన్‌ మీద గట్టిగానే వినిపిస్తున్నాయి.

రాజకీయాల్లో పరిస్థితులకు తగ్గట్లు వ్యూహాలు మార్చుకోవాల్సిందే. ఈ విషయంలో జనసేనాని ఖచ్చితమైన రాజకీయ ఆలోచనలతో ముందుడుగు వేస్తున్నారు. దాదాపు ఐదేళ్ల పాటు జనసేన పార్టీలో పవన్‌ కళ్యాణ్‌ ఒక్కడే కనిపించాడు.

కానీ ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ ఒక్కడు కాదు. లక్షలాది మంది జనసైనికులున్నారు. పదుల సంఖ్యలో ముఖ్య నేతలున్నారు. ఎన్నికల సమయంలో నేతలు పార్టీలోకి రావడం మామూలే. అదే జనసేన బలం అనుకోవడానికి లేదు. ‘

ఆయా రామ్‌ గయా రామ్‌..’ సంస్కృతి ఆంధ్ర్రప్రదేశ్‌ రాజకీయాల్లో (Pawan Kalyan Jana Sena Party) చాలా గట్టిగా కనిపిస్తుంది. ఇది అర్ధం చేసుకోలేనంత అమాయకులేం కారు పవన్‌ కళ్యాణ్‌. కొందర్ని నాయకులుగా తయారు చేసిన పవన్‌, ఇతర పార్టీల్లోంచి వచ్చిన ఇంకొందర్ని పార్టీలో చేర్చుకోవడం ద్వారా సగటు రాజకీయ వ్యూహకర్తగా మారారు.

విశాఖ – లక్ష్మినారాయణ, నర్సాపురం – నాగబాబు Pawan Kalyan Jana Sena Party

సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ (CBI Ex JD Lakshmi Narayana) చేరికతో జనసేన పార్టీకి కొత్త బలం వచ్చినట్లయ్యింది. నిజాయితీగల అధికారిగా లక్ష్మినారాయణకు మంచి పేరుంది. ఆయన్ను విశాఖ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దింపుతున్నారు జనసేనాని. తద్వారా ఉత్తరాంధ్రకి జనసేన ఇస్తున్న ప్రాధాన్యతను ఆయన ఇంకోసారి ప్రత్యేకించి తెలియజేసినట్లయ్యింది.

ఉత్తరాంధ్రలో లక్ష్మినారాయణకు మంచి ఫాలోయింగ్ వుంది. ఉద్యోగ విరమణ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో పర్యటించారాయన.. ప్రత్యేకించి ఉత్తరాంధ్ర వెనుకబాటు తనంపై గళం విప్పారు లక్ష్మినారాయణ (VV Lakshminarayana).

అంతే కాకుండా, తన సోదరుడు నాగబాబుతో (Nagababu) నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గానికి పోటీ చేయించడం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీకి పవన్‌కళ్యాణ్‌ కొత్త ఊపు తెచ్చారు. చిరంజీవి కుటుంబానికి సొంతూరు ఈ నియోజకవర్గంలో భాగమే కావడం గమనార్హం. నాగబాబు చేరికతో, జనసేన పార్టీకి మెగా బలం వచ్చిందని పార్టీ శ్రేణులు అంటున్నాయి.

రెండు చోట్ల పవన్ కళ్యాణ్ పోటీ.. Pawan Kalyan Jana Sena Party

ఇంకోపక్క, విశాఖ జిల్లాలోని గాజువాక (Gajuwaka) నుంచీ, పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం (Bhimavaram) నుంచీ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు పవన్‌కళ్యాణ్‌. గాజువాక నుంచి పవన్ పోటీ చేయడానికి ప్రత్యేకమైన కారణాలే వున్నాయి. సినీ రంగంలోకి పవన్ రావడం వెనుక, విశాఖ జిల్లా పాత్ర చాలా ఎక్కువ.

విశాఖ జిల్లాలోనే నటనలో పాఠాలు నేర్చుకున్నారు పవన్ కళ్యాణ్. అందుకే, పవన్ సినిమాల్లో ఉత్తరాంధ్ర మాట, పాట కనిపిస్తుంటాయి ఎక్కువగా. సీఎం అభ్యర్థులు ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయడా చాలా చాలా అరుదు. ఆ లెక్కన, పవన్ పెద్ద రిస్క్ చేశారని చెప్పక తప్పదు.

వ్యూహాత్మక పొత్తులు, అదిరే ఎత్తుగడలు..

పొత్తుల విషయానికి వస్తే, అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారాయన. చివరి నిమిషంలో బహుజన సమాజ్‌ పార్టీతో పొత్తును ప్రకటించారు జనసేనాని. ఎవరూ ఊహించని విషయమిది. అసలు ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో ఉనికి అనేదే లేదు. మరోపక్క వామపక్షాలతోనూ జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంది. తన బలమేంటో పవన్‌కి బాగా తెలుసు.

ఒంటరిగా వెళ్లి చతికిలపడడం కన్నా, చిన్న బలాన్నైనా అవసరమొచ్చినప్పుడు అందుకుని నిలదొక్కుకోవాలన్న రాజకీయ విజ్ఞతను ప్రదర్శించారు జనసేనాని. నిజానికి పవన్‌ కళ్యాణ్‌ కారణంగా వామపక్షాలు, బీఎస్పీ ఎంతోకొంత లాభపడే అవకాశముంది. అదే సమయంలో కొన్ని నియోజక వర్గాల్లో ఆ పార్టీల బలం జనసేనకు కలిసొచ్చే అవకాశమూ లేకపోలేదు. ఒక్కోసారి 100, 200 ఓట్లు కూడా ఫలితాల్ని మార్చేస్తాయి.

ఇదిలా ఉంటే అసెంబ్లీ సీట్లతో పాటు, లోక్‌సభ సీట్లనూ వామపక్షాలకు కేటాయించి అందర్నీ ఆశ్చర్యపరిచారు పవన్‌ కళ్యాణ్‌. ఈ కేటాయింపుల వెనక ఆయా పార్టీల్లో జనసేన పట్ల బలమైన నమ్మకం కలిగించే ఉద్దేశ్యముంది. దాదాపు 146 సీట్లలో జనసేన పోటీ చేస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ లెక్క.

కింగ్ అవుతారా? కింగ్ మేకర్ అన్పించుకుంటారా? Pawan Kalyan Jana Sena Party

ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణాలోని లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ జనసేన, వామపక్షాలు, బీఎస్పీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకుని, అధికారం దక్కించుకోగలం.. అన్న నమ్మకం జనసేన పార్టీలో కనిపిస్తోంది. అది వీలు కాని పక్షంలో కర్ణాటక మోడల్‌ కలిసొచ్చి కింగ్‌ మేకర్‌గా జనసేనాని సత్తా చాటే అవకాశమూ లేకపోలేదు.

ఎలా చూసినా, ఈక్వేషన్స్‌ జనసేనకు సానుకూలంగానే కనిపిస్తోంది. గెలిస్తే మంచి పాలన ఇస్తాం. గెలవకపోతే ప్రజల తరపున ఇంకా గట్టిగా నిలబడతాం.. ఇదీ జనసేన (Pawan Kalyan Jana Sena Party) నినాదం. ఎన్నికలకు ముందర ఇంత ధైర్యం ప్రదర్శించే సత్తా పవన్‌ కళ్యాణ్‌కి కాక ఇంకెవరికి ఉంది.?

ఓ వైపు వైఎస్సార్‌ సీపీ, ఇంకోవైపు టీడీపీ.. రెండు పెద్ద పార్టీల్ని ఢీ కొడుతున్న జనసేనాని ఈ ఎన్నికల తర్వాత రాజకీయాల్లో ఎలాంటి భూమిక పోషిస్తారో వేచి చూడాల్సిందే.

Related Post

kcr

కేసీఆర్‌.. ‘కింగ్‌’ ఆఫ్‌ తెలంగాణ

Posted by - December 11, 2018 0
100 సీట్లలో గెలుస్తాం.. అని చెప్పి, 88 సీట్లకే పరిమితమయ్యారని ఎవరైనా అనగలరా.? తెలంగాణ రాష్ట్ర సమితి (Telangana Rashtra Samithi) అంతటి అద్భుత విజయం సాధించింది.…

జగన్ @ 3000 – కోట్లాది ఆశీస్సులతో..

Posted by - September 24, 2018 0
2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అధికారం దక్కుతుందా.? లేదా.? అన్నది వేరే విషయం. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై నమోదైన అక్రమాస్తుల కేసు సంగతీ వేరే విషయం. కానీ,…

వైఎస్‌ జగన్‌పై దాడి: ఏది నిజం.?

Posted by - October 30, 2018 0
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి ‘సస్పెన్స్‌’ కొనసాగుతోంది. నిందితుడు శ్రీనివాస్‌ని పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడి బ్యాంక్‌ అకౌంట్లను పరిశీలించడంతోపాటు, కాల్‌…

జనసేన కవాతు: పోటెత్తుతున్న జన గోదారి

Posted by - October 15, 2018 0
గోదారి ఉప్పొంగుతోంది. జనసేన పార్టీ ‘కవాతు’కి పిలుపునిచ్చిన దరిమిలా ఉభయ గోదావరి జిల్లాలు ఒక్కటవుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాల్ని కలిపే కాటన్‌ బ్యారేజీని ఆనుకుని వున్న…

టీడీపీలోకి యంగ్‌ టైగర్‌ గ్రాండ్‌ ఎంట్రీ.?

Posted by - September 5, 2018 0
సినిమాల్ని కాదనుకుని యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వస్తాడా.? ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోవచ్చుగానీ, తెలుగుదేశం పార్టీలోకి గ్రాండ్‌ ఎంట్రీ అయితే ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. తెలుగుదేశం పార్టీని…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *