రామ్ చరణ్‌తో జాన్వీ కపూర్.! ఖాయమైనట్టేనా.?

Janhvi Kapoor
Janhvi Kapoor Opposite Ramcharan.. అప్పుడెప్పుడో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాని మళ్ళీ రీమేక్ చేస్తారనీ, కాదు కాదు దానికి సీక్వెల్ తీస్తారనీ ప్రచారం జరిగింది.
చిరంజీవి (Mega Star Chiranjeevi), శ్రీదేవి ఓ జంటగా నటిస్తే, రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కూడా నటిస్తుందని.. రెండు జంటలూ తెరపై మెరిసిపోతాయనీ.. గుసగుసలు వినిపించాయి.
నిజానికి, ఈ ప్రాజెక్టుకి సంబంధించి తెరవెనుకాల చర్చోపచర్చలు గట్టిగానే జరిగాయి కూడా. కానీ, శ్రీదేవి (Sridevi) మరణంతో.. ఆ ఆలోచనలు పటాపంచలైపోయాయ్.
ఏమో, సమీప భవిష్యత్తులో శ్రీదేవితో పని లేకుండానే చిరంజీవి, రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ వస్తుందేమో.!
Janhvi Kapoor Opposite Ramcharan.. ఈసారైనా.. అది నిజమయ్యేనా.?
ఆ సంగతి పక్కన పెడితే, రామ్ చరణ్ (Global Star Ram Charan) సరసన జాన్వీ కపూర్ త్వరలో నటించబోతోందిట. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాతో ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చనుందట.

తొలి సినిమా ‘ఉప్పెన’తో విమర్శకుల ప్రశంసల్నీ కమర్షియల్ విజయాన్నీ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సన. రెండో సినిమానీ మెగా కాంపౌండ్‌లోనే చేస్తున్నాడు బుచ్చిబాబు.
పైగా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సినిమా చేయడమంటే చిన్న విషయం కాదు మరి.!
అదేంటీ, రవీనా టాండన్ కుమార్తె రషా తదానీని కదా, ఈ సినిమా కోసం తొలుత స్క్రీన్ టెస్ట్ చేసింది.? అంటే, ఏమో.. ఇప్పుడైతే జాన్వీ కపూర్ సీన్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతానికైతే, ఈ సినిమా కోసం ‘కాస్టింగ్ కాల్’ పిలుపునిచ్చారు.. సినిమాలో కొన్ని ఇతర పాత్రల కోసం నటీనటుల్ని ఎంపిక చేసేందుకు.
Also Read: సిగ్గు లేదా? క్యాన్సర్‌తో పబ్లిసిటీ స్టంట్స్ చేస్తావా.?
జాన్వీ కపూర్‌తో స్క్రీన్ టెస్ట్ త్వరలో చేస్తారట. రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) – జాన్వీ కపూర్.. ఇద్దరూ ఈ స్క్రీన్ టెస్ట్‌లో పాల్గొనే అవకాశం వుందంటున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీయార్ హీరోగా తెరకెక్కుతున్న ‘దేవర’ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు తెరపై తెరంగేట్రం చేయనున్న సంగతి తెలిసిందే.
