Janhvi Kapoor Ulajh Confidential..జాన్వీ ‘ఉలజ్’ టాప్ సీక్రెట్.!
Janhvi Kapoor Ulajh Confidential.. ‘ప్రతీ మొహం ఓ కథ చెబుతుంది. ప్రతీ కథ ఓ ఉచ్చు..’ అంటూ కొన్ని పోస్టర్లను తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.
ఇంతకీ ఏంటీ పోస్టర్లు.? ఏమా కథ.? తెలుసుకుందాం పదండిక..
బాలీవుడ్‌లో జాన్వీ కపూర్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉలజ్’కి సంబంధించి జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన పోస్టర్లు ఇవి. జాన్వీ ఏ పాత్ర పోషించినా ఆమె పాత్ర చాలా ఇంటెన్స్‌గా వుంటుంది.
అలాగే ఈ సినిమాలోనూ సమ్‌థింగ్ వెరీ స్పెషల్ అనేలా వుందనిపిస్తోంది ఆమె లుక్స్ చూస్తుంటే. చాక్లెట్ కలర్ బ్లేజర్ ధరించింది.
చేతిలో ‘కాన్ఫిడెన్షియల్’ అని రాసున్న ఫైల్ వుంది. జాన్వీ కపూర్ ధరించిన బ్లేజర్‌కి ఇండియన్ ఫ్లాగ్ కూడా అతికించి వుంది.
Janhvi Kapoor Ulajh Confidential.. సినిమాలో జాన్వీ దేశభక్తి.!
ఇదంతా చూస్తుంటే, దేశభక్తి బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోన్న సినిమానే ‘ఉలజ్’ అని తెలుస్తోంది. ఇందులో దేశభక్తి మెండుగా వున్న కుటుంబం నుంచి వచ్చిన యంగ్ డిప్లమాట్‌గా జాన్వీ కపూర్ కనిపించనుంది.
గుల్షన్ దేవయ్య, రాజేష్ తైలాంగ్, రోషన్ మాధియో, మీయాంగ్ చాంగ్ తదితరులు ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.
గతంలోనూ ‘గుంజన్ సక్సేనా’ వంటి పలు దేశభక్తి సంబంధిత సినిమాల్లో జాన్వీ కపూర్ నటించిన సంగతి తెలిసిందే. లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ఈ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
జాన్వీ కపూర్ అక్కడ అలా ఇక్కడ ఇలా.!
నిన్న మొన్నటివరకూ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) అంటే, కేవలం బాలీవుడ్ హీరోయిన్ మాత్రమే. ఇకపై సౌత్‌లోనూ ఆమె హవా స్టార్ట్ కానుంది.
అన్నట్టు, బాలీవుడ్‌లో ఎక్కువగా హీరోయిన్ సెంట్రిక్ మూవీస్‌కే ప్రాధాన్యత ఇచ్చిన జాన్వీ కపూర్ ఇంతవరకూ ఒక్క స్టార్ హీరో సినిమాలోనూ కనిపించలేదక్కడ.
కానీ, సౌత్‌లో ఎంట్రీతోనే గ్లోబల్ స్టార్స్‌తో స్ర్కీన్ షేర్ చేసుకుంటోంది. బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకు సైన్ చేసింది.
‘దేవర’ సినిమా కోసం యంగ్ టైగర్ ఎన్టీయార్‌తో జత కడుతోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ లుక్స్‌కి సంబంధించి ఆల్రెడీ కొన్ని పోస్టర్లు రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
సెప్టెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటూ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలోనూ జాన్వీ కపూర్ నటిస్తోంది. బుచ్చిబాబు సన ఈ సినిమాకి దర్శకుడు.