మెయిన్సూ.. అడ్వాన్సుడూ.! ఇదేం చెడుగుడు.?
JEE Mains Advanced Mudra369One.. తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా.? ఇదేం జీవితం.! దేశంలో అత్యున్నత విద్యా సంస్థల్లో విద్యనభ్యసిస్తే.. ఆ కిక్కే వేరప్పా.!
ఏం చేద్దాం మరి.? ఇంకేం చేస్తావ్.. నీకైతే వయసైపోయింది.! నీ పిల్లల్ని అయినా, ఐఐటీ, ఎన్ఐటీ వంటి విద్యా సంస్థల్లో చదివించడానికి ట్రై చెయ్.!
కానీ, ఎలా.? ఓ తండ్రి ధర్మ సందేహమిది.! ఆర్థిక పరిస్థితేమో సహకరించదు.! కానీ, ఎల్కేజీ నుంచే ఐఐటీ ఫౌండేషన్.. అంటూ కిండర్‌గార్టెన్లూ ఊరిస్తున్నాయ్.!
కాదు కాదు.. బ్లాక్‌మెయిల్ చేస్తున్నాయ్.! మట్టీ మశానం.. ఏవేవో పేర్లు పెట్టేసి, స్కూళ్ళలో అధిక ఫీజులు వసూలు చేసేస్తున్నారు. తప్పదు, చెల్లించి తీరాల్సిందే.!
సంపాదించేది వాళ్ళ కోసమే..
పిల్లల భవిష్యత్తు కోసమే కదా.. ఏం చేసినా.? రెక్కల కష్టాన్ని తీసుకెళ్ళి ప్రైవేటు స్కూళ్ళలో ధారపోయడమే.!
అక్కడేదో చెప్పడం మాత్రమే కాదు.. ఇంటికొచ్చాక కూడా హోం వర్క్ వాయింపు.! పిల్లల్ని వాయించేస్తున్నదీ సరిపోదు, తల్లిదండ్రుల్ని స్కూలుకి పిలిచి మరీ బుర్ర తినేస్తున్నారు.!
ప్చ్.. స్కూళ్ళకు వెళుతోన్న పిల్లల సగటు తల్లిదండ్రుల దయనీయ స్థితి ఇది. ఏటీ, మీవోడి స్కూల్లో ఐఐటీ ఫౌండేషన్ లేదా.? అంటూ ఇరుగు పొరుగు నుంచి వచ్చే ప్రశ్నలు.
JEE Mains Advanced Mudra369One.. బోడి సలహాలే అసలు సమస్య..
వుంది మొర్రో.. ఇదిగో ఇంత మొత్తంలో పీజు కడుతున్నాం.. అని చెప్పినాగానీ, అది సరిపోదు.! సాయంత్రం ట్యూషన్‌కి పంపెయ్.! అనే బోడి సలహాలు.
ట్యూషన్ సెంటర్లు కూడా మొదలెట్టేశాయ్.. ఐఐటీకి తగ్గట్టుగా ట్యూషన్లలో బోధన.. అని.! సరిపోయింది సంబరం.!
కాదేదీ దోపడీకి అనర్హం.! ఎల్కేజీకే వేలల్లో కాదు, లకారం ఫీజులు చెల్లించాల్సి వస్తున్న రోజులివి. దానికి అదనంగా ట్యూషన్ల దోపిడీ.
Also Read: Mummy Cat Baby Monkey: పిల్లి కడుపున కోతి! జీవన సిత్తరం!
ఏసీ గదుల్లో విద్యాబోధన.! అసంటూ పిల్లలకి డి-విటమిన్ లభిస్తే కదా.? సూర్యుడు కనిపించడు.. చంద్రుడూ కనిపించే పరిస్థితి వుండదు.!
ఎలాగోలా కష్టపడితే చాలు.. ఆ తర్వాత జీవితమంతా హ్యాపీనే.. అంటూ, పిల్లల్ని ఓ రకమైన మాయలోకి నెట్టేయడం.! ఒత్తిడి తట్టుకోలేక పిల్లలు ఏమన్నా చేస్కుంటే, గుండె పగిలేలా ఏడవడం.!
మెయిన్సూ.. అడ్వాన్సుడూ.! కథ ఇక్కడితో అయిపోలేదు. ఇంకా వుంది.
పిల్లల్ని ఎలా చదివించాలో అన్న సంగతి పక్కన పెట్టి, ఎలా చదివించకూడదో.. తదుపరి ‘కథనం’లో తెలుసుకుందాం.!