Kajal Agarwal Tamannah Bhatia

కాజల్‌, తమన్నా.. గ్లామర్.. అంతకు మించి

196 0

హీరోలు పెద్దయెత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు.. మరి హీరోయిన్లు ఎక్కడ.? ఉత్తరాది నుంచి వస్తారు.. అవకాశాలు కొల్లగొట్టేస్తారు.. పెద్దయెత్తున రెమ్యునరేషన్లు అందుకుంటారు.. కనీసం, తమ సినిమాల ప్రమోషన్ల విషయాన్నీ పట్టించుకోరు.! ఇలా చాలా విమర్శలే వెల్లువెత్తాయి హీరోయిన్ల (Kajal Agarwal Tamannah Bhatia) మీద.

కరోనా వైరస్‌ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ ఒక్కతాటిపైకొచ్చి.. ‘కరోనా క్రైసిస్‌ ఛారిటీ’ పేరుతో సినీ కార్మికుల్ని ఆదుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు.

కొందరు అటు దేశానికీ, ఇటు తెలుగు రాష్ట్రాలకీ, ఇంకోపక్క తెలుగు సినీ పరిశ్రమకీ విడివిడిగా విరాళాలు ప్రకటిస్తే.. ఇంకొందరు తమకు తోచిన విధంగా విరాళాలు ప్రకటించారు. మరికొందరు, ప్రత్యక్షంగా సాయం చేసేందుకు తమవంతుగా కృషి చేస్తున్నారు.

హీరోయిన్ల విషయానికొస్తే, అందరికన్నా ముందుంది లావణ్య త్రిపాఠి. మొన్నీమధ్యనే కాజల్‌ అగర్వాల్‌ 2 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. తాజాగా తమన్నా, మూడు లక్షల రూపాయల విరాళాన్ని ‘కరోనా క్రైసిస్‌ ఛారిటీ’ కోసం ( Kajal Agarwal Tamannah Bhatia ) ప్రకటించడం గమనార్హం.

Lavanya Tripathi

ఇంకా చాలామంది హీరోయిన్లు ముందుకు రావాల్సి వుంది. అయితే, విరాళం ఇవ్వడం.. ఇవ్వకపోవడమన్నది వారి వారి వ్యక్తిగత అంశం. ఇస్తే, అది వారి హుందాతనాన్ని పెంచుతుంది. అదే సమయంలో, ఇవ్వాల్సిందే.. అని ఒత్తిడి చేయడం కూడా ఏమాత్రం సబబు కాదు.

నిజానికి, హీరోయిన్లు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కొత్తేమీ కాదు. వారి వారి ఆలోచనలు, వారి వారి అవకాశాల్ని బట్టి సేవా కార్యక్రమాల్లో విరివిగానే పాల్గొంటుంటారు మన హీరోయిన్లు. సో.. తొందరపడి ఓ మాట జారేయడం అంత సబబు కాదు కదా ఎవరికైనా.!

Related Post

RRR Movie

చరణ్‌, ఎన్టీఆర్‌, రాజమౌళి.. ‘మెగా’ ఓపెనింగ్‌

Posted by - November 11, 2018 0
తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి అత్యంత భారీ మల్టీస్టారర్‌గా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌.’ వార్తల్లోకెక్కేసింది. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమా…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *