KCR Hattrick Telangana.. ఎగ్జిట్ పోల్ అంచనాలేమో, కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని కట్టబెడుతున్నాయి. కానీ, భారత్ రాష్ట్ర సమితి మాత్రం, ‘కేసీయార్ హ్యాట్రిక్..’ అంటోంది.!
అనడమేంటి.? డిసెంబర్ 4వ తేదీన, మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీయార్ అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగబోతున్నట్లు ట్వీటేసింది.!
అసలేం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో.! నిన్ననే (నవంబర్ 30న) పోలింగ్ ముగిసింది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు సాయంత్రానికే డీలా పడ్డాయి కూడా.
KCR Hattrick Telangana.. ముచ్చటగా మూడోస్సారి..
వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, సహజంగానే కొంత ‘వ్యతిరేకత’ను ఎదుర్కొంటున్నారు. అది ప్రభుత్వ వ్యతిరేకత అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈ నేపథ్యంలో ‘కారు’ బోల్తా పడింది ఎన్నికల్లో.. అనే విశ్లేషణ రాజకీయ పరిశీలకుల నుంచి కూడా వ్యక్తమయ్యింది.
అధికార పార్టీ నుంచి టిక్కెట్టు పొందిన మైనంపల్లి హన్మంతరావు పార్టీని వీడటం, చాలామంది బీఆర్ఎస్ నేతలు ఇతర పార్టీల్లోకి దూకెయ్యడం తెలిసిన విషయమే.
ఇంకోపక్క కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. మరోపక్క, భారతీయ జనతా పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చింది. వెరసి, గులాబీ పార్టీకి కష్టకాలమేనని అంతా అనుకున్నారు.
నమ్మకం.. ఆత్మవిశ్వాసం..
కానీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని కాంగ్రెస్, బీజేపీ పోటీపడి చీల్చేసుకోవడం తమకు కలిసి వస్తుందనే గట్టి నమ్మకంతో వున్నట్టుంది గులాబీ పార్టీ.!
ఎంత బలమైన నమ్మకం లేకపోతే, ‘డిసెంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి ముఖ్యమంత్రి కేసీయార్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం’ అని బీఆర్ఎస్ ప్రకటించగలుగుతుంది.?
Also Read: సాయం పేరు పవన్ కళ్యాణ్.! అభిమానమే జనసైన్యం.!
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. మిత్రపక్షం మజ్లిస్ పార్టీకి ఖచ్చితంగా ఐదారు సీట్లు వస్తాయ్. ఆ లెక్కన బీఆర్ఎస్ ఓ యాభై ఐదు సీట్లు సొంతం చేసుకుంటే సరిపోద్ది కదా.!
హంగ్ వచ్చినా, చక్రం తిప్పగల సత్తా కేసీయార్‌కి వుంది. అద్గదీ అసలు సంగతి.!